బాలికపై కన్నేసిన ఓ మృగాడు.. ఐస్‌క్రీమ్ ఆశ చూసి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. గుంటూరు జిల్లాకు 12 ఏళ్ల బాలికను ఆమె ఇంటి ఎదురుగా ఉంటే 25 ఏళ్ల వ్యక్తి రోజు పలకరిస్తూ ఉండేవాడు. ఆమె బయటకు వచ్చిన సందర్బాల్లో ఆమె వెంటపడేవాడు. అయితే తెలిసి వ్యక్తే కావడంతో బాలిక కూడా అతన్ని పలకరించేది. ఈ క్రమంలోనే బాలిక సెల్ నెంబర్ తీసుకున్న అతడు.. రోజు ఫోన్ చేసి మాట్లాడేవాడు. బాలికతో పరిచయం పెంచుకున్న అతడు.. ఆమెను రేప్ చేసేందుకు ప్లాన్ సిద్దం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పాఠశాలకు వెళ్లిన బాలిక వద్దకు వెళ్లి.. ఐస్‌క్రీమ్ తినేందుకు పిలిచాడు. ఐస్‌క్రీమ్ కోసమని ఆమెను బైక్‌పై ఎక్కించుకుని ఓ లాడ్జ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే బాలిక అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేసింది.
మరోవైపు టిఫిన్ కోసమని బయటకు వెళ్లిన బాలిక చాలా సేపటి వరకు రాకపోవడంతో పాఠశాల సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. దీంతో కంగారు పడిపోయిన బాలిక తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే బాలిక ఇంటి ఎదురుగా ఉండే యువకుడు ఆమెను తీసుకువెళ్లినట్లు తెలిసింది. దీంతో వారు పరిసరాల్లో బాలిక కోసం వెతుకులాట ప్రారంభించారు. అయితే అదే సమయంలో బాలిక ఏడుస్తూ పాఠశాల వైపు రావడం తల్లిదండ్రులు చూశారు. అనంతరం బాలికను తీసుకుని ఇంటికి తీసుకెళ్లారు.
ఇంటికి వచ్చాక ఎక్కడికి వెళ్లావనే అని తల్లిదండ్రులు బాలికను విచారించారు. దీంతో జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.