పక్కా స్కెచ్ తో ఏడాది క్రితం ఏపీ నుంచి వచ్చి జనాల ఆశతోనే యాపారం.. రూ.25 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు..!

ప్రతీకాత్మక చిత్రం

స్థానికులను ఏజెంట్లుగా నియమించుకుని ‘నెలకు నూటికి 20 రూపాయల చొప్పున వడ్డి’ ఇస్తానని ప్రచారం చేసి ఒక్కొక్కరి నుంచి లక్షల్లో అప్పుగా తీసుకున్నాడు. ఇలా దాదాపు 25 కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకున్నాడు. వడ్డీని కొంతకాలం వారి ఖాతాల్లో నెలనెలా వేశాడు.

 • Share this:
  షేర్ మార్కెట్ వ్యాపారం చేస్తున్నానని తనకు డబ్బులు ఇస్తే అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి కోట్ల రూపాయలు అప్పు తీసుకున్న వ్యక్తి కనిపించకుండా పోయాడు. మొదట్లో నెలనెలా క్రమం తప్పకుండా వడ్డీ చెల్లించడంతో ఒకరిని చూసి మరొకరు అతనికి అప్పు ఇస్తూ పోయారు. బుధవారం సాయంత్రం అతని ఇంటికి వడ్డీ తీసుకోవడానికి వెళ్తే.. తాళం వేసి ఉండటం చూసి కంగుతిన్నారు. రాత్రి వరకు కనిపించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుంచి షేక్ మహబూబ్ అనే వ్యక్తి ఏడాది క్రితం నారాయణపేట జిల్లా మక్తల్ కు వచ్చి స్థిరపడ్డాడు. మక్తల్ పట్టణంలోని మిత్ర ఎంటర్ప్రైజెస్ పేరుతో షేర్ మార్కెట్ నిర్వహిస్తున్నానని చెప్పి మక్తల్, మంగనూరు, కృష్ణ ఉట్కూరు, మరికల్ మండలాలలో పరిచయాలు పెంచుకున్నాడు. స్థానికులను ఏజెంట్లుగా నియమించుకుని ‘నెలకు నూటికి 20 రూపాయల చొప్పున వడ్డి’ ఇస్తానని ప్రచారం చేసి ఒక్కొక్కరి నుంచి లక్షల్లో అప్పుగా తీసుకున్నాడు.

  ఇలా దాదాపు 25 కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకున్నాడు. వడ్డీని కొంతకాలం వారి ఖాతాల్లో నెలనెలా వేశాడు. నమ్మకం కలిగేందుకు ఓ చోట 20 ఎకరాలు, ఉట్కూర్ లో 17 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. తనకు రూ.ఐదు లక్షలకు పైగా నగదు ఇచ్చినవారికి ఆ భూమిలో 200 గజాలు, 300 గజాల ప్లాటు చేయిస్తానని నమ్మకం కలిగించాడు. కొంతమందికి స్టాంపు పేపర్లు పై ప్లాట్లు కూడా రాసి ఇచ్చాడు. దీంతో మక్తల్ నియోజకవర్గం లోని పలు గ్రామాలతో పాటు నారాయణపేట నియోజకవర్గం మరికల్ మండలంలోని పలువురు రూ.30 లక్షల నుంచి యాభై లక్షల దాకా ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. అప్పు తీసుకున్న వారికి ప్రామిసరీ నోటుపై రెండు రూపాయల వడ్డీ అనీ, కొన్ని ప్రామిసరీ నోట్లలో వడ్డీ ప్రస్తావన లేకుండా తన సంతకం చేసి ఇచ్చాడు. ఇరవై రూపాయల వడ్డీ అన్నావు కదా అని ఎవరైనా అడిగితే ‘ప్రామిసరీ నోట్లలో అంత వడ్డీ రాయడం నిబంధనలకు వ్యతిరేకం. చెల్లవు కూడా. కేసు అవుతుంది. మీకు నేరుగా నేను డబ్బు ఇస్తుంటా. కాగితంతో పనేముంది‘ అని చెప్పేవాడు.

  ఇది కూడా చదవండి: మేడమీద గదిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. అర్ధరాత్రి అక్క అదృశ్యం.. తల్లిదండ్రులతో కలిసి ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్తే..

  జనానికి నమ్మకం కలిగేందుకు రెండు నెలల క్రితం మక్తల్ లో బంగారం దుకాణం కూడా తెరిచాడు. ఇదే సమయంలో జనానికి వడ్డీ చెల్లించడం ఆపేయడం తో చాలామంది బాధితులు ఇంటికి వెళ్లి అడగడం ప్రారంభించారు. దీంతో కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాను. భూములు అమ్మి వారం రోజుల్లో మీ డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి నుంచి భార్యా పిల్లలతో సహా అదృశ్యమయ్యాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. బంగారు దుకాణం బోర్డు కూడా తీసి వేశాడు. విషయం తెలిసిన బాధితులు 20 మంది వరకు మక్తల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కొంతమంది బాధితులు ఫిర్యాదు చేశారనీ, కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని మక్తల్ ఎస్ఐ రాములు తెలిపారు. కాగా షేక్ మహబూబ్ సుభాని నారాయణపేట కు వెళ్లి పోలీసు ఉన్నత అధికారులకు కలవడానికి ప్రయత్నించినట్లుగా తెలిసింది. ఏది ఏమైనా ఇలాంటి అధిక ఆశ చూపి జనాలు ఆశకు మోసపోవద్దని పోలీసులు తెలిపారు.
  ఇది కూడా చదవండి: వివాహితతో 23 ఏళ్ల కుర్రాడు ఎస్కేప్.. బస్టాండ్ లో పట్టుకుని ఊళ్లో పంచాయితీ.. అందరిముందు ఆమె చెప్పిన మాటలతో..
  Published by:Hasaan Kandula
  First published: