HOME »NEWS »CRIME »andhra pradesh man died after trying to compromise a argument over 50 rupees in guntur su

Andhra Pradesh: 50 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు యత్నించిన వ్యక్తి మృతి..

Andhra Pradesh: 50 రూపాయల కోసం గొడవ.. సర్ది చెప్పేందుకు యత్నించిన వ్యక్తి మృతి..
ప్రతీకాత్మక చిత్రం

ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండగా సర్ది చెప్పేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఆ గొడవలో గాయపడి మృతిచెందాడు.

  • Share this:
    ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండగా సర్ది చెప్పేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. సత్తెనపల్లి పాత మార్కెట్‌లో ఉన్న శ్రీలక్ష్మి మారుతి సంగం పార్లర్‌లో పల్లపు కోటి వీరయ్య రెండు వారాల క్రితం వస్తువులు కొని 50 రూపాయలు ఫోన్ పే చేశాడు. అయితే ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావడంతో డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పి వెళ్లాడు. రోజులు గడుస్తున్న వీరయ్య ఆ డబ్బులు చెల్లించలేదు. షాప్ ఓనర్ వైకుంఠవాసి రెండు, మూడు సార్లు డబ్బులు అడిగిన కూడా వీరయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఇక, మూడు రోజుల కిందట వీరయ్య సోదరుడు షాప్ ఓనర్ వైకుంఠవాసికి రూ. 50 చెల్లించాడు.తాను చెల్లించాల్సిన డబ్బులు తన సోదరుడు చెల్లించాడని తెలుసుకున్న వీరయ్య బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో షాప్‌ వద్దకు వెళ్లాడు. తనతో పాటు మరో సోదరుడిని కూడా తీసుకెళ్లాడు.

    అక్కడ షాప్ ఓనర్, అతని భార్యతో వీరయ్య గొడవకు దిగారు. గొడవ పెద్దదిగా మారడంతో ఆ షాప్‌లో పనిచేస్తున్న షేక్ బాజీ(27) అనే వ్యక్తి మధ్యలో దూరి సర్దిచెప్పేందుకు యత్నించాడు. అయితే మధ్యలో దూరిన షేక్ బాజీ వారి దాడిలో గాయపడి కిందపడిపోయాడు. కిందపడి సృహ కోల్పోయిన బాజీని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే షేక్ బాజీ మృతిచెందినట్టుగా వైద్యులు తెలిపారు.



    షేక్ బాజీ మృతితో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి చేదోడుగా ఉన్న షేక్ బాజీ చిన్న వయసులోనే మృతిచెందడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై షేక్ బాజీ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published:January 22, 2021, 06:31 IST