హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: నీ కూతురుకి పెళ్లి చేయకపోతే చస్తావ్..! జాతకాల పేరుతో కుటుంబాన్ని రోడ్డున పడేసిన మాయగాళ్లు

Andhra Pradesh: నీ కూతురుకి పెళ్లి చేయకపోతే చస్తావ్..! జాతకాల పేరుతో కుటుంబాన్ని రోడ్డున పడేసిన మాయగాళ్లు

Cheating: మనదేశంలో బాబాలకు ఉన్న క్రేజ్ సైంటిస్టులకు ఉండదు. మ్యాజిక్ ను నమ్మే జనం లాజిక్ ను అస్సలు పట్టించుకోరు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) సినిమాల్లో ఈ డైలాగులను కొందరు నిజం చేస్తున్నారు.

  మనదేశంలో బాబాలకు ఉన్న క్రేజ్ సైంటిస్టులకు ఉండదు. మ్యాజిక్ ను నమ్మే జనం లాజిక్ ను అస్సలు పట్టించుకోరు. త్రివిక్రమ్ సినిమాల్లో ఈ డైలాగులను కొందరు నిజం చేస్తున్నారు. ఇటీవలే మూఢనమ్మకాలతో కన్నబిడ్డలను చంపుకున్న తల్లిదండ్రుల ఉదంతం మరవకముందే.. ఇవే మూఢనమ్మకాలు, జాతకాలను నమ్మి కూతురు జీవితాన్ని నాశనం చేశారో తల్లిదండ్రులు. అమాయకత్వమో, భయమో తెలియదు గానీ డాక్టర్ చదివిని కూతుర్ని ఓ పోకిరీకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇల్లు కూడా పొగొట్టుకొని రోడ్డున పట్టారు. వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా బి.కొత్త కోటకు చెందిన కృష్ణారెడ్డి, నిర్మల దంపతులు. పట్టణంలోని రంగసముద్రం రోడ్డులో నివాసముంటున్నారు. వీరికి కొంతకాలం క్రితం వెంకటరెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తరచూ కలుస్తుండటంతో వారి కుటుంబానికి దగ్గరయ్యాడు.

  ఈ క్రమంలో వెంకటరెడ్డితో కృష్ణారెడ్డి కుటుంబానికి సాన్నిహిత్యం ఏర్పడింది. ఐతే కృష్ణారెడ్డి దంపతుల బలహీనతను క్యాష్ చేసుకోవాలనుకున్న వెంకటరెడ్డి.., కృష్ణారెడ్డి జాతకంలో దోషముందంటూ ఓ మాతాజీ వద్దకు తీసుకెళ్లాడు. కుమార్తెకు పెళ్లి చేయకుంటే ప్రాణ గండం ఉందంటూ ఆ మాతాజీ వారిని భయపెట్టింది. స్థానిక కరెంట్ కాలనీలో ఉంటున్న చరణ్ అనే యువకుడు ఉద్యోగం చేస్తున్నాడని ఇచ్చి పెళ్లిచేయాలని సలహా ఇచ్చింది. దీంతో ఇష్టం లేకపోయినా ఎంబీబీఎస్ చదివిన కుమార్తెను అతడికిచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత బి.కొత్తకోటలోని ఇంటికి దోషం ఉందంటూ ఆ ఇంటిని వేరే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అక్కడితో ఆగకుండా మాతాజీ పూజలు చేస్తే దోషం పోతుందని నమ్మించి రూ.20 వేలు వసూలు చేశారు.

  మరోవైపు అల్లుడు చరణ్.., కుమార్తెను చిత్రహింసలు పెడుతుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఆరు నెలలుగా తమను మోసం చేస్తూ సర్వం దోచేశారని.., కుమార్తె జీవితాన్ని కూడా నాశనం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్మల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంకటరెడ్డితో పాటు చరణ్ పై కేసు నమోదు చేశారు. అలాగే వీరిని భయపెట్టిన మాతాజీపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Chittoor S01p25, Crime, Crime news, Horoscope, Marriage

  ఉత్తమ కథలు