హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: ఇంటికి వెళ్తే మమల్ని విడదీస్తారు.. సెల్ఫీ వీడియో తీసుకుని..

Andhra Pradesh: ఇంటికి వెళ్తే మమల్ని విడదీస్తారు.. సెల్ఫీ వీడియో తీసుకుని..

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం కొటా బోయపల్లె గ్రామానికి చెందిన బాలిక, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం కొటా బోయపల్లె గ్రామానికి చెందిన బాలిక, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం కొటా బోయపల్లె గ్రామానికి చెందిన బాలిక, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

  పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోరని ఓ జంట.. నాలుగు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయింది. అయితే తాజాగా వారిద్దరు ఆత్మహత్యకు యత్నించారు. ఇందుకు సంబంధించిన సెల్ఫీ వీడియోను చిత్రీకరించారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం కొటా బోయపల్లె గ్రామానికి చెందిన బాలిక, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో వారు ఆందోళన చెందారు. పెద్దలు తమను విడదీస్తారనే భయంతో ఈ ఏడాది మార్చిలో ఇళ్లలో నుంచి పారిపోయారు. దీంతో బాలిక కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి నుంచి ఆ జంట ఆచూకీ లభించలేదు.

  అయితే తాజాగా ఈ నెల 28వ తేదీ తాము కదిరి సమీపంలో ఉన్నామని.. ఇంటికి వస్తే తమను విడదీస్తారని, ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని పేర్కొంటూ ఓ వీడియోను రికార్డు చేశారు. ‘అప్పుడు మేము పెళ్లి చేసుకోవడానికి నా వయసు అడ్డంకిగా మారింది. అందుకే మా తల్లిదండ్రులు నన్ను ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినట్లు తెలిసింది. ఇప్పుడు నాకు 18 ఏళ్లు. ఇప్పుడు మేము పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్లినా.. మా తల్లిదండ్రులు మమ్మల్ని విడదీస్తారు. అందుకే కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగి చచ్చిపోవాలని డిసైడ్‌ అయ్యాం’అని వారు బాలిక పేర్కొంది. అనంతరం వీడియోలో కనిపించే విధంగా ఇద్దరు కలిసి పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ తాగారు.

  ఇవి చదవండి: Crime News: విదేశాల్లో భర్త.. ఎవరూ ఊహించని పని చేసిన భార్య.. కుటుంబంలో తీవ్ర విషాదం..

  Viral Video: భర్త బెడ్‌రూమ్‌లో మరో మహిళ.. అనుకోకుండా ఇంటికొచ్చిన భార్య.. ఏం జరిగిందో చూడండి..


  ఈ వీడియో వైరల్‌గా మారడంతో అప్రమత్తమైన పోలీసులు.. ప్రేమ జంట ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. బుధవారం రాత్రి ప్రేమికులిద్దరిని ములకలచెరువులో గుర్తించిన పోలీసులు వారిని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరు వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ప్రాణాప్రాయం లేదని వైద్యులు చెప్పారు.

  First published:

  Tags: Andhra Pradesh, Attempt to suicide, Crime news

  ఉత్తమ కథలు