Home /News /crime /

ANDHRA PRADESH LOVERS COMMITS SUICIDE IN NELLORE LODGE BOTH ARE GRAMA SECRETARIAT EMPLOYEES SU

Andhra Pradesh: లాడ్జిలో ఒకే తాడుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య.. ఇద్దరు గ్రామ సచివాలయ ఉద్యోగులే..

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడింది.

    ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు ఇద్దరు గ్రామ సచివాలయ ఉద్యోగులుగా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వివరాలు.. నెల్లూరు జిల్లా రూరల్‌ మండలానికి చెందిన హరీష్‌ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌గా, నాయుడుపేటకు చెందిన లావణ్య అదే సచివాలయంలో వీఆర్‌వోగా పనిచేస్తున్నారు. అయితే వీరు నెల్లూరు నగర శివారు పడారుపల్లిలోని నందా లాడ్జిలో ఓ రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు. అయితే కొద్ది గంటల తర్వాత వారు ఆ రూమ్‌లో ఒకే తాడుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

    అయితే శుక్రవారం రాత్రి హరీష్, లావణ్యలు ఇళ్లకు రాకపోవడంతో ఇరు కుటుంబాలు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి వారు నందా లాడ్జిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చినట్టుగా సమాచారం. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఇక, వీరి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహరమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై వేదాయిపాలెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

    హరీష్, లావణ్యలు ఆత్మహత్యకు పాల్పడటంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. అయితే వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియాల్సి ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Andhra Pradesh, Lovers suicide, Nellore, Suicide

    తదుపరి వార్తలు