HOME »NEWS »CRIME »andhra pradesh lovers commit suicide after parents rejected marriage proposal in guntur district of andhra pradesh prn gnt

Andhra Pradesh: రహస్యంగా పెళ్లి.., అంతలోనే ఆత్మహత్య.., విచారణలో షాకింగ్ నిజాలు

Andhra Pradesh: రహస్యంగా పెళ్లి.., అంతలోనే ఆత్మహత్య.., విచారణలో షాకింగ్ నిజాలు
ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గుంటూరు జిల్లాలో (Guntur District) విషాదం చోటు చేసుకుంది. పెద్దలను ఎదురించలేని ప్రేమజంట కఠిన నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    రెండు మనసులు కలిశాయి. ఇద్దరూ ప్రేమించుకున్నారు. విషయం పెద్దలకు చెప్పారు. ఇంకేముంది అందరి లాగా వాళ్లు కూడా వ్యతిరేకించారు. ఇద్దరు కులాలు వేరుకావడంతో పెళ్లికి అడ్డుచెప్పారు. దీంతో పెద్దలకు ఎదురు చెప్పలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సత్తెనపల్లి వివేకానందనగర్ లో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సత్తెనపల్లిలోని సంగం బజారుకు చెందిన కిరణ్ తాపీ పని చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన ప్రదీప్తీ స్థానికంగా ఇంటర్ చదువుతోంది. కాలేజీకి వెళ్లి వచ్చే క్రమంలో కిరణ్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో విషయం ఇరువురి కుటంబాల్లో తెలిసింది. కులాలు వేరుకావడంతో వీరి పెళ్లిని వ్యతిరేకించారు.

    పెళ్లంటూ చేసుకుంటే అతడ్నే చేసుకుంటానని ప్రదీప్తీ తల్లిదండ్రులకు స్పష్టం చేసింది. మనది అగ్రకులమని.., అతడు తక్కువ కులం వాడు, మంచివాడు కాదంటూ తండ్రి వారించారు. ఆమెను ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో ఇద్దరూ ఇంట్లోనుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆదివారం రాత్రి ఫ్రెండ్ ని కలిసి వస్తానంటూ ఇంట్లో నుంచి వెళ్లిన ప్రదీప్తీ, కిరణ్ ను ఓ గుడిలో పెళ్లి చేసుకుంది. పెద్దలకు దూరంగా వెళ్లి బ్రతకలేమని భావించిన ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు ఒకే తాడుతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.



    ఉదయం వివేకానంద నగర్ వైపు వెళ్లిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ప్రేమవివాహాన్ని అంగీకరించనందునే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చేతికంది వచ్చిన కొడుకు, పెళ్లీడుకు వచ్చిన కుమార్తె విగతజీవులుగా మారడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
    Published by:Purna Chandra
    First published:January 18, 2021, 11:37 IST

    टॉप स्टोरीज