Sarpanch Murder: సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో ఫ్యాక్షన్ హత్య.. సర్పంచ్‌ను వేటకొడవళ్లతో దారుణంగా..

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకర్గం పులివెందులలో ఫ్యాక్షన్ పడగవిప్పింది.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకర్గం పులివెందులలో ఫ్యాక్షన్ పడగవిప్పింది. కడప జిల్లా పులివెందుల నియోజవర్గం పరిధిలోని లింగాల మండలంలోని కోమన్నూతల గ్రామ సర్పంచ్‌ మునెప్పను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. అధిపత్య పోరుతోనే ఈ హత్య జరిగినట్టుగా సమాచారం. వైసీపీకి చెందిన మునెప్ప.. పులివెందుల నుంచి కోమన్నూతలకు వాహనంలో వస్తున్న సమయంలో దారికాసిన ప్రత్యర్థులు.. వేటకొడవళ్లతో కాపు కాసి ఈ హత్య చేశారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మునెప్పపై కక్ష పెట్టుకున్న వారే ఈ పని చేసినట్టుగా తెలుస్తోంది. కాగా, ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    Published by:Sumanth Kanukula
    First published: