Home /News /crime /

ANDHRA PRADESH GRAMA VOLUNTEER DIED IN ATTACK IN GUNTUR SU

ఏపీలో గ్రామ వాలంటీర్‌పై దాడి.. మెరుగైన వైద్యం కోసం తరలిస్తుండగా మృతి.. అసభ్య ప్రవర్తనే కారణమా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు జరిపిన దాడిలో ఓ గ్రామ వాలంటీర్ మృతిచెందాడు.

    ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు జరిపిన దాడిలో ఓ గ్రామ వాలంటీర్ మృతిచెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా ఉప్పలపాడులో చోటుచేసుకుంది. ఊరిలో జరిగిన కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. వివరాలు.. 21 ఏళ్ల నంబల నాగరాజు గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అయితే నాగరాజు ఓ యువతితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె కుటుంబ సభ్యులు అతనిపై దాడికి దిగారు. యువతి బంధువుల దాడిలో నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతన్ని వెంటనే వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమించడంతో మెరుగై వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు. అయితే అక్కడ నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించిన అతడు మృతిచెందినట్టు చెప్పారు. మార్గమధ్యలోనే నాగరాజు ప్రాణాలు విడిచినట్టుగా వైద్యులు తెలిపారు.

    గ్రామానికి చెందిన బాదినీడు పార్వతయ్య, కొండయ్య కుటుంబ సభ్యులు పది మంది దాడి చేయడంతో నాగరాజు మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. వినుకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నాగరాజు మాట్లాడుతూ.. తాను నిద్రలో ఉండగా తలుపులు తీసుకొని వచ్చి తనపై దాడికి పాల్పడ్డారని, ఓ యువతితో వచ్చిన వివాదంతోనే తనపై దాడి చేశారని చెప్పాడు. యువతి పట్ల వాలంటీరు అనుసరించిన తీరే ఈ దాడికి కారణమైందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Andhra Pradesh, Gram volunteer, Guntur

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు