ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ గ్రామ వాలంటీర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని కూడేరు మండలం శివరాం పేటలో చోటుచేసుకుంది. వివరాలు.. శివరాంపేటకు చెందిన బోయ శ్రీకాంత్ అనే వ్యక్తి గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి అతడు పొలం వద్ద నిద్రించాడు. అయితే అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి హత్య చేశారు. శనివారం ఉదయం అటువైపుగా వెళ్లిన కొందరు స్థానికులు శ్రీకాంత్ మృతిచెంది ఉండటాన్ని గుర్తించారు. దీనిపై శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే పోలీసులకు కూడా విషయాన్ని తెలియజేశారు.
ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. శ్రీకాంత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనుకు సంబంధించి శ్రీకాంత్ కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక, శ్రీకాంత్ తండ్రికి గతంలో పలువురితో విబేధాలు ఉన్నాయని తెలియడంతో.. పోలీసులు ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. పాత కక్షల కారణంగా హత్య జరిగి ఉంటుందా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తున్నారు.
ఇక, అర్ధరాత్రి సమయంలో గునపంతో పొడిచి శ్రీకాంత్‌ను హత్య చేసినట్టుగా అతని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. శ్రీకాంత్ తండ్రిని చంపబోయి అతడి కుమారుడిపై దాడి జరిగి ఉండొచ్చన్నా అనుమానాలను కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.