హోమ్ /వార్తలు /క్రైమ్ /

AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ పై సీఐడీ దర్యాప్తు... టార్గెట్ ఆ మాజీ మంత్రేనా...?

AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ పై సీఐడీ దర్యాప్తు... టార్గెట్ ఆ మాజీ మంత్రేనా...?

ఏపీ ఫైబర్ నెట్ పై సీఐడీ దర్యాప్తుకు ఆదేశం

ఏపీ ఫైబర్ నెట్ పై సీఐడీ దర్యాప్తుకు ఆదేశం

AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్, ఎంపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తును సీఐడీకి అప్పగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలు, అప్పట్లో కట్టబెట్టిన కాంట్రాక్టులపై దృష్టిపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశించింది. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే కార్యక్రమంలో భాగంగా టెండర్ల ఖరారులో కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చేలా వ్యవహరించినట్లు గుర్తించిన నేపథ్యంలో విచారణకు ఆదేశించింది. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్, ఎంపీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దర్యాప్తును సీఐడీకి అప్పగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణ చేపడుతూనే ఉంది. ఇందులో భాగంగా ఏపీ ఫైబర్ నెట్ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని గతంలోనే రాష్ట్రమంత్రి వర్గం తీర్మానించింది. అంతేకాదు ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ పై కేసు కూడా నమోదైంది. పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏపీ ఫైబర్ నెట్ పై ఫిర్యాదు చేసింది.

అర్హత లేని సంస్థలకు కాంట్రాక్టులు కట్టబట్టేందుకు నిబంధనలు పట్టించుకోలేదన్నది గత ప్రభుత్వంపై ఉన్న ఆరోపణ. ఇందులో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని దీనిపై విచారణ జరుపుతామని గతంలోనే వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు తగ్గట్లుగా ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి గోపాలరావుకు చెందిన పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిడెట్.. టెండర్ల ప్రక్రియల అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదు చేసింది.

ఇది చదవండి: ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి...? గవర్నర్ సిఫార్సు.. అసలు నిజం ఇదే...!ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు గత ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఇందులో పేస్ పవర్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా బిడ్ దాఖలు చేసింది. ఐతే అన్ని అర్హతలున్న తమను కాదని... ఎలాంటి అనుభవం లేని టెరా సాఫ్ట్ వేర్ సంస్థకు కాంట్రాక్ అప్పగించినట్లు పేస్ పవర్ సిస్టమ్స్ ఆరోపించింది.

ఇది చదవండి: సెల్ఫీలతోనే యువకుడి అరుదైన ఘనత... ఇండియా బుక్‌ ఆఫ్ రికార్డ్ సొంతం... అది ఎలాగంటే..!అలాగే సౌత్ కొరియాకు చెందిన డసాన్ నెట్ వర్క్ సొల్యూషన్స్ అనే సంస్థ కూడా ఏపీ ఫైబర్ నెట్ పై ఫిర్యాదులు చేసింది. బిడ్డింగ్ సమయంలో వివక్ష చూపారని డసాన్ సంస్థ ఆరోపించింది. ఆప్టికల్ లైన్ టెర్మినల్ కు సంబంధించిన బిడ్డింగ్ లో ఎల్-1గా నిలిచినా.. వేరే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారని డసాన్ తన ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా ప్రభుత్వం సీఐడీ దర్యాప్తుకు ఆదేశించడంతో ఫైబర్ నెట్ అంశం మరింత వేడెక్కింది. ఈ విషయంలో వైసీపీ నేతలు అప్పటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఇతర నేతలపై ఆరోపణలు చేస్తోంది. అలాగే సెట్ టాప్ బాక్సులను ఎలాంటి టెస్టులు చేయకుండానే వేలకోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేశారనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. తాజాగా సీఐడీ దర్యాప్తుకు ఆదేశించడంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందోననేది ఆసక్తికరంగా మారింది.

ఇది చదవండి: అక్కడ వానపడితే వజ్రాల పంటే... రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు..


First published:

Tags: Andhra Pradesh, Information Technology, Ysrcp

ఉత్తమ కథలు