సంక్రాంతి షాపింగ్ గురించి గొడవ... భర్త మీద అలిగి భార్య ఆత్మహత్య...

కొత్త బట్టలు కొనేందుకు భార్య నగలు తాకట్టు పెట్టిన భర్త... ఇద్దరి మధ్యా వాగ్వాదం... భర్త చేసిన పనిని భరించలేక ఆత్మహత్య చేసుకున్న భార్య...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 11, 2019, 4:56 PM IST
సంక్రాంతి షాపింగ్ గురించి గొడవ... భర్త మీద అలిగి భార్య ఆత్మహత్య...
నమూనా చిత్రం
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: January 11, 2019, 4:56 PM IST
తెలుగువారికి ముఖ్యంగా నవ్యాంధ్ర జనాలకు సంక్రాంతి చాలా పెద్ద పండగ. ఏ పండగకు కొనకపోయినా సంక్రాంతి పండగకు మాత్రం కొత్త బట్టలు కొనుక్కోవాల్సిందే. అయితే సంక్రాంతి షాపింగ్ ఓ యువతి ప్రాణాలను బలి తీసుకుంది. సంతోషాలు నింపాల్సిన పొంగల్ షాపింగ్... ఓ కుటుంబంలో విషాదం నింపింది. విజయవాడ వన్‌టౌన్ ఏరియాలో అశ్విని, ఆమె భర్త నివాసిస్తున్నారు. వీరిద్దరూ కలిసి సంక్రాంతి పండుగకు కొనాల్సిన షాపింగ్‌కు వెళ్లారు. అయితే కొత్త బట్టలు కొనేందుకు అవసరమైనంత డబ్బు లేకపోవడంతో అశ్విని నగలు తాకట్టు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే తన నగలను తాకట్టు పెట్టేందుకు అశ్విని ఒప్పుకోలేదు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.

అయితే అశ్విని అభిప్రాయానికి పెద్దగా విలువ ఇవ్వని, ఆమె భర్త నగలు తాకట్టు పెట్టి పండగకు కొత్త బట్టలు కొనుక్కొచ్చాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆమె... వెంటనే ఇంటి రెండో అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అశ్విని చేసిన పనికి షాక్‌కు గురైన ఆమె భర్త... వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ చనిపోయింది అశ్విని. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. పండగకు భార్యకు కొత్త బట్టలు కొనాలనే ఉద్దేశంతో ఇలా చేశానని, చిన్న విషయానికే ఇంత పని చేస్తుందని తాను ఊహించలేదని అశ్విని భర్త పేర్కొనడం విశేషం.

ఇవి కూడా చదవండి...

ప్రాణం తీసిన దురాచారం... ‘నెలసరి’ గుడిసెలో ఊపిరాడక ముగ్గురి మృతి...
ఇంట్లోనే యూనివర్సిటీ.. డబ్బు కొట్టు.. పట్టా పట్టు


దొంగతనానికి ‘సాక్ష్యం’ చెబుతానంది... అంతలోనే ఆత్మహత్య... పోలీసుల విచారణ కారణంగా...


థాయిలాండ్‌లో సౌదీ యువతికి అవమానం... ఆస్ట్రేలియా యువతుల ‘టాప్‌లెస్’ నిరసన...

Loading...

మేనల్లుడి ప్రేయసితో స్నేహం... అతిదారుణంగా చంపి... తులసి మొక్క నాటాడు...First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...