Andhra Pradesh: ప్రియుడితో రాసలీలలు సాగిస్తున్న కోడలు.. వారిద్దరు కలిసి ఉండగా చూసిన మామ.. కట్ చేస్తే..

ప్రతీకాత్మక చిత్రం

ఓ పెళ్లైన మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో గుట్టుచప్పుడు కాకుండా రాసలీలలు సాగిస్తుంది. అయితే ఒక రోజు వారిద్దరు అభ్యంతకర స్థితిలో ఉండగా.. ఆమె మామ చూశాడు.

 • Share this:
  ఓ పెళ్లైన మహిళ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో గుట్టుచప్పుడు కాకుండా రాసలీలలు సాగిస్తుంది. అయితే ఒక రోజు వారిద్దరు అభ్యంతకర స్థితిలో ఉండగా.. ఆమె మామ చూశాడు. కోడలిని వేరే వ్యక్తితో అలా చూసేసరికి ఆవేశంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే కోడలిని, ఆమె ప్రియుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) కర్నూలు జిల్లా (Kurnool District) వెలుగొండ మండలంలోని సీసీ నగర్‌‌లో చోటుచేసుకుంది. వివరాలు.. మలికార్జున అనే వ్యక్తి రెండో భార్య బీట్ల చిన్ని(30). ఆమె కన్‌స్ట్రక్షన్ వర్కర్‌గా పనిచేస్తున్న చండా ఓబులేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఓబులేష్ తరుచూ మల్లికార్జున ఇంట్లో పనికి వస్తుండేవాడు. మరోవైపు మల్లికార్జున ( Mallikarjuna) అతని మొదటి భార్యను చూసేందుకు అప్పుడప్పుడు ఆత్మకూరు మండలంలోని (Atmakur Mandal) సిద్దారామపురం వెళ్లేవాడు.

  ఈ క్రమంలోనే ఓబులేష్, చిన్నిల మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి (Extramarital Affair) దారితీసింది. కొంతకాలంగా వీరు రిలేషన్ సాగిస్తున్న విషయం.. మల్లికార్జున తండ్రి రమణయ్యకు తెలిసింది. దీంతో అతడు వారం రోజుల క్రితం ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు. వివాహేతర సంబంధానికి ముగింపు పలకాలని చిన్ని, ఓబులేష్‌లను హెచ్చరించాడు. అయితే వారిద్దరు మాత్రం ఆ హెచ్చరికను పట్టించుకోకుండా.. బంధాన్ని కొనసాగించారు.

  శ్రీకాకుళం అమ్మాయి.. నల్గొండ అబ్బాయి.. ఇద్దరు ప్రేమించుకున్నారు.. కానీ అలా జరగడంతో..
   వారిద్దరిని అలా చూసేసరికి..
  ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి.. చిన్ని, ఓబులేష్ ఇద్దరు రూమ్‌లో కలిసి ఉండటం చూశాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన రమణయ్య.. చిన్ని, ఓబులేష్‌లపై పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. చిన్ని, ఓబులేష్‌ల మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

  కోడలు చిన్ని, ఆమె ప్రియుడు ఓబులేష్‌లను హత్య చేసిన తర్వాత రమణయ్య అక్కడి నుంచి పారిపోయాడు. ఇక, ఈ హత్యలకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

  Second Marriage: అతడి వయసు 49.. రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.. పెళ్లి కూడా ఫిక్స్ అయింది.. కట్ చేస్తే..

  మామను చంపిన కోడలు..
  తమిళనాడులోని కిజుతువాల్‌లో (Kizhathuval) కొద్ది రోజుల కిందట 25 ఏళ్ల కనిమొళి తన మామ మురుగేశన్‌ను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఎవరికి అనుమానం రాకుండా ఆహారంలో విషం కలిపి చంపేసింది. అయితే తనపై లైంగిక వేధింపులకు మామను హత్య చేసినట్టుగా ఆమె చెప్పింది. అయితే ఆమె నేరాన్ని స్వయంగా అంగీకరించేవరకు కూడా అతడు హత్యకు గురైనట్టుగా కుటుంబ సభ్యులు గుర్తించలేదు. ఎందుకంటే అనారోగ్యం వల్ల అతడు మరణించి ఉంటారని అనుకున్నారు. అతని అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. అయితే ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకు కనిమొళి.. గ్రామ నిర్వాహణ అధికారి వద్దకు వెళ్లి హత్య చేసినట్టుగా అంగీకరించింది. వెంటనే ఆ అధికారి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు హత్య ఆరోపణల కింద కనిమొళిని అరెస్ట్ చేశారు.
  Published by:Sumanth Kanukula
  First published: