ఎన్నికల డ్యూటీకి వెళుతూ... విశాఖలో మహిళా కానిస్టేబుల్ దుర్మరణం...

ఎయిర్‌పోర్టు ఏరియాలో ఎలక్షన్ డ్యూటీకి డ్యూటీకి వెళుతూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పీఎమ్ పాలెం పీఎస్ హెడ్ కానిస్టేబుల్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 11, 2019, 5:23 PM IST
ఎన్నికల డ్యూటీకి వెళుతూ... విశాఖలో మహిళా కానిస్టేబుల్ దుర్మరణం...
ఎన్నికల డ్యూటీకి వెళుతూ... విశాఖలో మహిళా కానిస్టేబుల్ దుర్మరణం...
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: April 11, 2019, 5:23 PM IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ రసవత్తరంగా జరుగుతోంది. ఈసారి ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై స్పష్టమైన క్లారిటీ లేకపోవడంతో ఎవ్వరికీ వారే, తమకే అధికారం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే... ఎన్నికల విధులకు వెళుతూ ఓ మహిళా కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయింది. 41 ఏళ్ల లక్ష్మీకాంతం... మధురవాడ ఏరియాలో ఉంటున్న పీఎమ్ పాలెం పోలీస్ స్టేషన్‌‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. గురువారం ఆమెకు ఎయిర్‌పోర్టు ఏరియాలో ఎలక్షన్ డ్యూటీ పడింది. ఎన్నికల విధులకి తన టూవీలర్ మీద బయలుదేరిన లక్ష్మీకాంతం... రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. నేషనల్ హైవే 16 మీద పంజాబ్ హోటల్ జంక్షన్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ ఎస్‌యూవీ వాహనం... లక్ష్మీకాంతం బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన లక్ష్మీకాంతం...అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

వైజాగ్ నేషనల్ హైవే 16 మీద ఇలాంటి ప్రమాదాలు ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోయాయి. మితిమీరిన వేగంతో వస్తున్న వాహనాలు, మిగిలిన వారికి ప్రమాదకరంగా మారుతున్నా అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మహిళా హెడ్ కానిస్టేబుల్ కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...