Andhra Pradesh: బస్సులు లేక పోవడంతో రాత్రి వేళ ఆటో ఎక్కిన యువతి.. కొద్ది దూరం వెళ్ళాక స్పీడ్ పెంచిన ఆటో డ్రైవర్.. ఆ తరువాత ఏమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

యువతి తన సొంత గ్రామం మార్కాపురం వెళ్లి తిరిగి శనివారం సూళ్లూరుపేటకు బయలుదేరింది. యువతి రాత్రి 9.25 గంటల ప్రాంతంలో నాయుడుపేటలో బస్సు దిగింది.

  • Share this:
    మహిళల‌ రక్షణ కోసం ఇటీవల్ల రాష్ట్ర ప్రభుత్వం దిశ యాప్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో దిశ యాప్‌ ఓ యువతిని కామాందుని బలి కాకుండా రక్షించింది. ప్రకాశం జిల్లా,మార్కాపురానికి చెందిన ఓ యువతి శ్రీసిటీలో ఉద్యోగం చేస్తూ సూళ్లూరుపేటలో నివాసం ఉంటోంది. యువతి తన సొంత గ్రామం మార్కాపురం వెళ్లి తిరిగి శనివారం సూళ్లూరుపేటకు బయలుదేరింది. యువతి రాత్రి 9.25 గంటల ప్రాంతంలో నాయుడుపేటలో బస్సు దిగింది. గంట సేపు వేచి చూసిన సూళ్లూరుపేటకు వెళ్ళేందుకు ఏ బస్సు కనిపించలేదు. బస్టాండ్ లో తనతో పాటు ఉన్న ప్రయాణికులను బస్సు వివరాలు అడిగి తెలుసుకుంది. ప్రయాణికులకు కూడా సరైన సమయం తెలియక పోవడంతో దగ్గరలోనే ఉన్న సమాచార కేంద్రం వద్దకు చేరుకుని బస్సు వివరాలు విచారించింది. అయితే బస్సు లేదు అని తెలియడంతో ఆ యువతికి ఎలా గమ్యస్థానం చేరుకోవాలో తెలియక ఆలోచనలో పడింది. ఏమి చేయాలో తోచడం‌ లేదు. ఇంతలో యువతి తన వేంట తెచ్చుకున్న మొబైల్ ఫోన్ లో తనకు తెలిసిన వారికి ఫోన్ చేసింది. తన పరిస్ధితిని వారికి వివరించింది. ఏవరూ తనకు దగ్గరగా లేక‌పోవడంతో తిరిగి బస్టాండ్‌లో తను వేచి ఉన్న ప్రాంతం వద్దకు చేరుకుంది.

    ఇంతలో సమయం రాత్రి 10.30 గంటలు గడిచింది. అయినా గమ్యస్ధానంకు ఎలా చేరాలి అనే ఆలోచనలో ఆ యువతి పడింది. బస్టాండ్ నుండి బయటకు వెళ్లి చూస్తే బస్సు ఏమైనా వస్తుంది అని ఆలోచించిన యువతి వెంటనే బస్టాండ్ నుండి బయటకు వచ్చింది. ఇంతలో ఆ యువతికి ఓ ఆటో కనిపించింది. వెంటనే ఆటో ఆటో అని పిలువ సాగింది. అతడు దగ్గరకు వచ్చాక.. తాను సూళ్లూరుపేటకు వెళ్ళాలని డ్రైవర్‌కు చెప్పింది. సరే అన్న ఆటో డ్రైవర్‌కి ఒంటరిగా వెళ్లలేక ప్రయాణికులను ఎక్కించుకోమని చెప్పింది. అంతలో ఆటో డ్రైవర్ బైపాస్ వద్ద ప్రయాణికులు ఉంటారని అక్కడ ఆటోను ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటానని ఆ యువతికి మాయమాటలు చెప్పాడు. ఆటో డ్రైవర్.. ఆ ఆటో డ్రైవర్ మాయమాటలను నమ్మిన యువతి.. ఆటో ఎక్కింది.

    నిదానంగా ఆటోను ముందుకి పొనిచ్చిన ఆటో డ్రైవర్.. ఆ తర్వాత వేగం పెంచాడు. దీంతో యువతి ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఇంతలో బైపాస్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకుంటాను అని చెప్పావు కదా అని ఆటో డ్రైవర్ ని యువతి ప్రశ్నించింది. అందుకు ఆ ఆటో డ్రైవర్ ఎటువంటి సమాధానం ఇవ్వక పోవడంతో ఆ యువతికి అనుమానం వచ్చింది. అతడి ప్రవర్తనను చూస్తే మరింత వేగంగా ఆటోను నడుపుతుండడంతో ఆ యువతికి ఏమి చేయాలో పాలు పోలేదు. వేంటనే సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద ఆపమని ఆటో డ్రైవర్‌కి చెప్పినా అతను పట్టించుకోలేదు. గట్టిగా కేకలు కూడా వేసింది. కానీ ఆ ఆటో డ్రైవర్ స్పందించక పోవడంతో తన మొబైల్ ఫోన్‌లో నుంచి తన సోదరికి ఫోన్ చేసి విషయం చెప్పింది.

    ఇంతలో నెల్లబల్లి ప్రాంతం రావడంతో ఆపమని మరోక సారి చెప్పంది. కానీ ఆటోను ఆపక‌పోవడంతో ఒక్కసారిగా ఆ యువతి ఆటోలోంచి దూకేసింది. విషయం తెలుసుకున్న బాధిత యువతి సోదరి తన స్నేహితురాలి మొబైల్‌లోని దిశ యాప్‌ను ఓపెన్‌ చేసి ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కారు. వెంటనే దిశ యాప్ కమాండ్ కంట్రోల్‌కి సమాచారం వెళ్లింది. సమాచారం అందుకున్న కమాండ్ కంట్రోల్ పోలీసులు ఆ యువతి సోదరికి ఫోన్ ద్వారా సంప్రదించారు. కమాండ్ కంట్రోల్ పోలీసులకి విషయం తెలిపి బాధిత యువతి ఫోన్‌ నంబరు తెలియపరిచింది. వేంటనే దిశ యాప్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి నెల్లూరు పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కి సమాచారం చేర వేయడంతో అక్కడి నుండి హైవే మొబైల్‌ పోలీసులకు సమాచారం వెళ్లింది.. అప్పటికి సమయం 10.38 గంటలు కావస్తోంది.రెండు‌ నిమిషాల వ్యవధి అంటే ఖచ్చితంగా 10.40 గంటలకు పోలీసులు బాధిత యువతితో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు.

    అటుతరువాత దొరవారిసత్రం వద్దకు పోలీసులు, హైవే మొబైల్‌ సిబ్బంది 10.42 గంటలకు యువతి వద్దకు చేరుకుని ఆమె వద్ద నుండి జరిగిన సమాచారం తెలుసుకుని సురక్షితంగా ఆ యువతిని పొలీసు వాహనంలో ఎక్కించుకుని సూళ్లూరుపేట చేరుకున్నారు. యువతికి సన్నిహితులు కానీ, బంధువులు గానీ ఉన్నారా..? అని ఆరా తీసి బంధువుల ఇంటికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ యాప్ మహిళలను రక్షించే విషయంలో ఎంత స్పీడ్ గా పని చేస్తుందో మనంకు ఇట్టే తెలుస్తోంది. నిమిషాల వ్యవధిలో యువతిని రక్షించిన పోలీసు సిబ్బందిని, అధికారుల్ని డీఐజీ అభినందించారు.
    Published by:Sumanth Kanukula
    First published: