ExtraMarital Affair: స్మార్ట్ ఫోన్లు.. సోషల్ మీడియాతో మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా పచ్చని కాపురాలు కూలిపోతున్నాయి. భార్య భర్తల (Wife and Husband) మధ్య ఎడబాటు పెంచుతోంది. భార్య భర్తల మధ్య ప్రేమ, అన్యోన్యతలు తగ్గుతున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియా (Social Media) అంటూ.. రాంగ్ నెంబర్ అంటూ పరిచయమైన వ్యక్తులతో హలో .. హాయ్ అంటూ మొదలైన చాటింగ్ తరువాత స్నేహంగా మారుతోంది. అది కాస్త ముదిరి మరో ప్రేమ (Love)గా మారుతోంది. చివరికి అక్రమ సంబంధాలకు (Extra Marital Affair) దారి తీస్తోంది. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎన్నో.. నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఘటనలు వింటూనే ఉన్నాం.. పెళ్లి కాని వ్యక్తుల మధ్య ప్రేమ చిగురించడం తప్పు కాదు.. కానీ పెళ్లైన మహిళలు కూడా సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల (Smart Phones) ప్రభావంతో తమకు వివాహమైంది అన్న సంగతి మరిచిపోతున్నారు. వ్యక్తిగతంగా ఉన్న చిన్న చిన్న సమస్యలను.. అయిష్టాలను భూతద్ధంలో చూస్తూ పరాయి మోజులో పడుతున్నారు. కాపురాలను కూల్చుకుంటున్నారు. తాజాగా తన భార్య మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం సాగించడాన్ని ఆమె భర్త కళ్లారా చూశాడు. భార్య చేస్తున్న పని కళ్లారా చూడడంతో తట్టుకోలేకపోయాడు. ఆమెను మందలించడమో.. లేదా పెద్దలకు ఫిర్యాదు చేస్తే సరిపోయేది.. కానీ కసితో రగిలిపోయిన భర్త.. రోకలిబండతో ఆమె తలపై బాది హతమార్చాడు.
ఇదీ చదవండి : ఆ ప్రభుత్వ సలహాదారు ఏమైపోయారు.. అవసరానికి కనిపించకపోతే ఎలా అంటూ ఆవేదన
ఈ దారుణ సంఘటన అనంతపురం జిల్లా కదిరి మండల పరిధిలోని పట్నం గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎక్కువ సమయంలో ఆటో నడుపుతూ ఉంటాడు. ఇంట్లో ఉండేది చాలా తక్కువ సమయమే.. అతడికి పదేళ్ల క్రితం సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామానికి చెందిన గోపాలప్ప కుమార్తె 28 ఏళ్ల హేమలత అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఏడేళ్ల ఏళ్ల బాలుడు మురళి, ఐదేళ్ల ఏళ్ల బాలిక కీర్తన ఉన్నారు. హ్యాపీగా సాగిపోతున్న వారి సంసారంలో అనుకోని తుఫాను వచ్చింది. సోషల్ మీడియా ద్వారా పరిచమైన ఓ వ్యక్తితో ప్రేమలో పడింది..
ఇదీ చదవండి : కాలు కదపలేదు.. ప్రచారం చేయలేదు.. ఓటు వేయమని అడగలేదు.. వార్ వన్ సైడ్.. ఎలా సాధ్యమైంది..?
అదే గ్రామంలో ఉన్న రామాంజినేయులు అనే వ్యక్తితో హేమలత పరిచయడం హద్దులు దాటింది. గత కొన్నేళ్లుగా అది వివాహేతర సంబంధం సాగిస్తున్నారు ఇద్దరూ. భర్త ఆటో నడుపుతూ బయటకు వెళ్లిపోవడం.. పిల్లకు స్కూలుకు వెళ్లడంతో ఒంటరిగా ఉండే హెమలత.. రామాంజునేయులను ఇంటికి రప్పించుకునేంది.. ఇన్నాళ్లూ వారి వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగింది. చుట్టు పక్కల వారు ఆమె భర్తకు విషయం చెప్పడంతో.. పలుమార్లు పద్దతి మార్చుకోవాలని భార్యను భర్త హెచ్చరించడం జరిగింది. అయినా ఆమె ఖాతరు చేయలేదు.
ఇదీ చదవండి : కుప్పంలో చంద్రబాబుకు ఇక కష్టమే.. ప్రతి ఏడాది తగ్గుతున్నగ్రాఫ్.. కారణం అదేనా?
మొన్న అర్ధరాత్రి ఇంట్లో తన భార్య రామాంజినేయులుతో కలసి ఉండడం కళ్లారా చూసిన శివశంకర్‌కు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో పక్కనే ఉన్న రోకలి బండతో ఆమె తలపై బాదాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసి భయపడిపోయిన రామాంజినేయులు పారిపోయాడు. ఆ వెంటనే హేమలత తండ్రి.. తన మామకు ఫోన్ చేసి.. మామా నీ కూతురు అక్రమ సంబంధం పెట్టుకుంది. చాలా సార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని.. అందుకే ఇక లాభం లేదని చంపేశానంటూ ఫోన్ చేసి చెప్పాడు. అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్నం ఎస్సై సాగర్ ఘటనా స్థలానికి వెళ్లి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు. అక్రమసంబంధం కారణంగా తల్లి మరణించింది. ఆమెను హత్య చేసినందుకు తండ్రి జైలు పాలయ్యాడు.. ఇప్పుడు ఇద్దరు పిల్లలూ అనాథలయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Crime news, Extramarital affairs