Andhra Pradesh: దివ్యాంగురాలిపై వైసీపీ నేత అత్యాచారం.. సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇస్తారంటూ లోకేష్ ఫైర్

దివ్యాంగురాలిపై వైసీపీ నేత అత్యాచారం

YCP Leader: ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మహిళలకు అండగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులే అరాచాకాలకు పాల్పడుతుండడం దారుణం. తాజాగా ఓ దివ్యాంగురాలిపై ఓ వైసీపీ నేత అత్యాచారానికి పాల్పడ్డాడు ఫిర్యాదు అందడంతో అరెస్ట్ అయ్యారు.

  • Share this:
    Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మహిళలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో ఒక ప్రాంతంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిందితులను కఠినంగా శిక్షిస్తున్నా దిశ వంటి యాప్ లు తీసుకువచ్చి నిఘా పెంచిన మహిళలపై అరాచకాలు మాత్రం తగ్గటం లేదు. వరుస ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటం తో ప్రజలు ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎవరికైనా కష్టం వస్తే.. స్థానిక ప్రజా ప్రతినిధులకే తమ కష్టాలు చెప్పుకుంటారు ప్రజలు.. కానీ ప్రజా ప్రతినిధులే పైశాచికాలకు పాల్పడుతుంటే రక్షించేది ఎవరు.. తాజాగా విశాఖపట్నం జిల్లా (Visakhapatnam)లో దారుణం చోటు చేసుకుంది. సీలేరులో దివ్యాంగురాలిపై స్థానిక వైసీపీ నేత (YCP Leader)అత్యాచారానికి పాల్పడ్డారు. నేరుగా బాధితురాలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ.. ఫిర్యాదు చేసింది.. ఆ ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేసింది. సోమవారం రాత్రి తనపై దాడి చేసి అత్యాచారం చేశాడని బాధితురాలు పేర్కొంది. వద్దని వేడుకున్నా బతిమాలినా వదల్లేదని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.. దివ్యాంగురాలిని అనే జాలి కూడా చూపించలేదంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అత్యాచారానికి పాల్పడడమే కాకుండా.. ఎవరికైనా చెబితే చంపేస్తానని హెచ్చరించినట్టు దివ్యాంగురాలి బాధితులు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో వైసీపీ నాయకుడు వెంకట్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    వైసీపీ నేత తీరుపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మాట్లాడలేని స్థితిలో ఉన్న దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడడం దారుణమని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వెంకట్రావు.. ప్రస్తుతం వైసీపీ సీలేరు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో వెంకట్రావును పోలీసులు అరెస్ట్ చేశారు.. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

    అత్యాచారం విషయం తెలుసుకున్న తెలుగు దేశం (Telugu Desam)జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ట్విట్టర్ (Twitter) ద్వారా స్పందించారు. వైఎస్ఆర్ సీపీ రేపిస్టుల తరఫున వకాల్తా పుచ్చుకుని పోలీసులు ప్రెస్​మీట్లు పెట్టొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కామాంధుల్లా అఘాయిత్యాలకు పాల్పడుతుంటే... తామేమీ తక్కువ తినలేదంటూ స్థానిక నేతలు అత్యాచారాలకు ఒడిగడుతున్నారని ధ్వజమెత్తారు. సభ్యసమాజం తలదించుకునేలా విశాఖ వైసీపీ నాయకుడు వెంకట్రావు దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని లోకేష్ పేర్కొన్నారు. సాయం అందించాల్సిన చేతులే చిదిమేయడం ఘోరమన్నారు. పోలీసులకు చేతనైతే... నిందితుడిని కఠినంగా శిక్షించి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    Published by:Nagesh Paina
    First published: