Extramarital Affair: కొడుకు పుట్టిన తరువాత ప్రియుడి మోజులో వివాహిత.. కానీ ఆమె ఆడిన డ్రామా చూసి షాక్ తిన్న పోలీసులు

ప్రియుడి మోజులో కన్న కొడికుని అతి కిరాతకంగా హత్య చేయించిన తల్లి

కామం కొందరి కళ్లు మూసేస్తోంది. ప్రియుడి మోజులో పడి కొందరు పచ్చటి సంసారాన్ని నాశనం చేసుకుంటుంటే.. ఓ వివాహిత తన అక్రమ బంధానికి ఆరేళ్ల కొడుకు అడ్డొస్తున్నాడని మధన పడింది. చివరికి ఏం చేసిందో తెలుసా..?

 • Share this:
  అక్రమ సంబంధాలు మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి. ఎదిగిన కొడుకు ఉండగానే మరో వ్యక్తితో సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ భార్య తన భర్తను హత్య చేసింది. కానీ ఎవరికి తెలియకుండా ఆయన గుండెనొప్పితో చనిపోయాడని డ్రామాలు ఆడి చివరికి పోలీసులకు చిక్కింది. కోడలితో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ తండ్రి.. సొంత కొడుకును హతమార్చాడు.. ప్రేయసి మోజులో కట్టుకున్న భార్యను అంతమొందించాడు ఓ భర్త.. తమ సంబంధానికి అడ్డు వస్తున్నారని.. ప్రియుడితో కలిసి కన్న బిడ్డలను హత్య చేయించిన తల్లి.. ఇలాంటి వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. అయినా వీటికి అడ్డుకట్ట పడడం లేదు. పెళ్లి తరువాత కూడా పరాయి మోజులో సొంత వారిని దూరం చేసుకుంటున్నారు. పెళ్లైన తరువాతే కాదు పిల్లల పుట్టిన తరువాత కూడా కొందరు మహిళలు ప్రియుడి మోజులో పడి జీవితాన్ని నాశనం చేసుకున్న కొన్ని ఘటనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. భార్య లేదా భర్త చేసిన తప్పులకు.. వారి కోరికల కోసం కొందరు పిల్లలు అనాథలుగా మారుతుంటే.. మరికొందరి పిల్లలకు చిన్న తనంలోనే నూరేళ్లు నింపేస్తున్నారు. కన్న బిడ్డలు అని కనికరం లేకుండా అతి క్రూరంగా అంతం చేస్తున్నారు.

  తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఓ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. వివాహేతర సంబంధం మోజులో పడి కన్న కుమారుడినే తల్లి హతమార్చిన ఘటన రాజమహేంద్రవరం సీతంపేటలో చోటు చేసుకుంది. త్రీటౌన్‌ పోలీసులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉంటున్న మల్లెమొగ్గల లక్ష్మి తన కుమారుడు 6 ఏళ్ల మంజునాథ్‌ మంచంపై నుంచి పడిపోయి, గాయపడినట్టు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. ఆ బాలుడు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.

  ఏం తెలియనట్టు అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు ఈ లోకాన్ని వీడిపోయాడు అంటూ రోధించింది. ఇదేరా కన్న తల్లి ప్రేమ అంటూ అందర్నీ చలించిపోయేలా చేసింది. ఏం తెలియనట్టు పెద్ద డ్రామానే ఆడింది. కానీ ఆ బాలుడి తల, మెడ, ముఖంపై గాయాలుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం నివేదికతో పాటు, స్థానికుల నుంచి పోలీసులు పలు వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో మంజునాథ్‌ను అతడి తల్లి లక్ష్మి, ప్రియుడు బోనం దాసు హతమార్చినట్టు పోలీసులు గుర్తించారు. వారిద్దరినీ అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.
  Published by:Nagesh Paina
  First published: