psycho Husband: ఇంత శాడిజమా? భార్య ఆత్మహత్య వీడియో తీసి పైశాచిక ఆనందం

ప్రతీకాత్మక చిత్రం

Crime News: ఈ భర్తను శాడిస్ట్.. సైకో ఇలా ఏ పేరుతో పిలిచినా తక్కువే.. అతడి పైశాచిక ఆనందం చూస్తే ఛీ ఇలాంటి భర్తలు కూడా ఉంటారా అని షాక్ తింటారు.. భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే.. అడ్డుకోవలసిన అతడు.. ఆమె ఆత్మహత్యను వీడియో షూట్ చేసి మరి ఆనందం పొందాడు.. అసలు ఏం జరిగిందంటే..?

 • Share this:
  Sadism: భార్య భర్తల అనుబంధానికి (Husband and wife Reletionship) పెళ్లి (Marriage)కి భారతీయ సంప్రదాయంలో ప్రత్యేకత ఉంది. పెళ్లి అనేది ఏదో తూతూ మంత్రంగా జరిపేది కాదు.. దాని అర్థం రెండు జీవితాలను ఏకం చేస్తుంది. కష్టసుఖాల్లో ఇద్దరూ పాలుపంచుకుంటూ కలిసి జీవించే ప్రయాణానికి పెళ్లి పునాది. పెళ్లైన దంపతులు అన్ని వేళలా ఒకరికి ఒకరు తోడుంటారు. మూడుముళ్ల బంధంతో ఒకటై భర్త వెంట నడిచిన భార్య... ఎన్నికష్టాలు ఎదురైనా అతడితోనే ఉంటుంది. భార్యకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అనే ధైర్యం నింపాల్సినవాడు భర్త.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు వేసిన తరువాత ఆ ఇద్దరూ కలిసి జీవితాంతం చేదోడు వాదోడుగా ఉండాలి.. ఒకరి బాధను మరొకరు అర్థం చేసుకోగలగాలి. కష్టసుఖాల్లో తోడునీడై ఉండాలి.. కానీ ఇప్పుడు భార్య భర్తల అనుబంధానికి అర్థం మార్చేస్తున్నారు కొందరు. వారి సంతోషం స్వార్థం కోసం ఎంతటి ఘోరాలకైనా బరితెగిస్తున్నారు. అక్రమ సంబంధాల కోసం భర్తలను చంపిన భార్యలు కొందరైతే.. పరాయి స్త్రీ మోజులోనే.. లేక అదనపు కట్నం కోసమనో.. లేదంటే అనుమానం జబ్బుతోనే భార్యను వేధించావారు కొందరైతే.. ప్రాణాలు తీసేవారు మరికొందరు. రోజు రోజుకూ ఇలాంటి శాడిస్టులు పెరిగిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో మానవీయ ఘటన జరిగింది. దాన్ని దారుణం అనాలో.. ఘోరం అనాలో కూడా తెలియడం లేదు..

  నెల్లూరులో భర్త శాడిజం కారణంగా కట్టుకున్న భార్య బలైపోయింది. సాధారణంగా ఎవరైనా క్షణికావేశంలో చనిపోతాను అంటే పెద్దగా పరచయం లేనివారు సైతం వారిస్తారు. అప్పటికీ వినకపోతే బలవంతంగా అయినా వారిని ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ పెంచలయ్య అనే వ్యక్తి మాత్రం తన భార్య కొండమ్మ ఉరివేసుకుంటుంటే పైశాచిక ఆనందం పొందాడు. పక్కన నిలబడి ఓ వేడుకలా చూస్తూ.. ఆమె ఆత్మహత్య (Suicide)ను తన మొబైల్ లో చిత్రీకరించి సైకోలా బిహేవ్ చేశాడు..

  ఇదీ చదవండి: సచివాలయంలో భారీ స్కామ్.. ప్రజా ప్రతినిధుల సిబ్బంది పాత్ర..! ఏసీబీ అదుపులో అనుమానితులు

  ఆమె ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడా అతడి మనసు కరగలేదు. దీంతో ఊరివేసుకుని భర్త కళ్లముందే కొండమ్మ ప్రాణాలు విడిచింది. నెల్లూరులోని ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని జే.ఆర్ పేట కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.

  ఇదీ చదవండి: దివ్యాంగురాలిపై వైసీపీ నేత అత్యాచారం.. సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇస్తారంటూ లోకేష్ ఫైర్

  భార్య సూసైడ్ చేసుకుంటే భర్త సినిమా చూసినట్టు చూశాడు. ఆపే ప్రయత్నమే చేయలేదు. చివరకు గొంతుకి చీర బిగుసుకుపోయి కొండమ్మ ప్రాణాలు విడిచింది. ఫ్యాన్‌కి చీరకట్టి మెడకు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చివరకు గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. కాగా పెంచలయ్య ప్రవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొండమ్మ మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పనిచేసేంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కాగా పెంచలయ్య అనుమానంతో నిత్యం భార్య కొండమ్మను వేధిస్తున్న నేపథ్యంలో.. తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యప్తు చేస్తున్నారు. భర్తను అదుపులోకి తీసుకున్నారు. అయితే భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే పైశాచిక ఆనందంతో వీడియో తీసిన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: