హోమ్ /వార్తలు /క్రైమ్ /

Breaking News: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కూలీలు దుర్మరణం

Breaking News: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు కూలీలు దుర్మరణం

అనంతపురంలో ఘోర ప్రమాదం

అనంతపురంలో ఘోర ప్రమాదం

Road Accident: రెక్కాడితే కాని డొక్కాడని కూలీలు వారు.. ఎప్పటిలాగే నాలుగు పైసలు సంపాదించాలనే ఉద్దేశంతో కూలీ పనులుకు వెళ్తున్న వారి పట్ల ఓ వాహనం మృత్యువుగా మారింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న వాహనం ఢీ కొనడంతో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు.

ఇంకా చదవండి ...

Road Accident:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రహదారులు రక్తమోడుతున్నాయి. రోజూ ఎదో ఒక చోట ప్రమదాలు భయపెడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా (Anantpuram District)లో ఘోర రోడ్డు ప్రమాదం  (Raod accident) జరిగింది. పామిడిలోని 44వ జాతీయ రహదారిపై తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ప్రమాదం (Accident) జరిగింది. ప్రతి రోజులాగే తెల్లవారుతూనే పనికి వెళ్లాలనే తొందరలో కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఆరుగురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో  గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విసమంగానే ఉంది. అయితే ఈ ప్రమాదం ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆటో నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఎక్కడిక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్న మృత దేహాలతో పరిస్థితి భయానకంగా కనిపిస్తోంది. రోడ్డంతా రక్తం పారింది.

ఈ ప్రమాదంలో మృతలను సుబ్బమ్మ, శంకరమ్మ, నాగవేణి, సావిత్రి, చౌడమ్మగా గుర్తించారు. వీరిది గార్లదిన్నె మండలం కొప్పలగొండ. తెల్లవారు జామున.. ఆటో అతి వేగంగా వెళ్తోంది. దానికి తోడు.. మంచు ఎక్కువగా ఉండడంతో ఎదురుగా వస్తున్న వాహనం కనిపించక ప్రమాదం జరిగిందని అంచనా వేస్తున్నారు.. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆటోను ఢీ కొట్టిన వాహనం కోసం గాలిస్తున్నారు..

ఇదీ చదవండి: కార్తీక మాసం స్పెషల్ ఏంటి..? ఏం చేస్తే శుభం కలుగుతుంది..? సోమవారానికి ఏంటి ప్రత్యేకత

గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులు ఆదేశించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఎదురుగా వస్తున్న లారీ అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికుల అంటున్నారు.

ఇదీ చదవండి: దటీజ్ స్టాలిన్.. నరికురవ మహిళను కలిసిన సీఎం, కోట్ల విలువైన సంక్షేమ పథకాల ప్రకటన

ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్పత్రికి తరలించారు. మృతులు గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన శంకరమ్మ, నాగవేణి, చిట్టెమ్మ(35), సుబ్బమ్మ(45), సావిత్రి‍‌(40) గా గుర్తించారు. ప్ర‌మాదతీవ్ర‌త‌కు ఆటో నుజ్జు నుజ్జ‌ అయ్యింది. మృత దేహాలు రోడ్డు ప‌క్క‌న‌ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పోలీసులు.. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృతదేహాల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని వివ‌రాలు సేక‌రిస్తున్నారు. లారీ డ్రైవర్‌ తప్పిదం కారణంగానే.. ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: కార్తీక మాసంలో వన భోజనాలు ఎందుకు..? ఉసిరి చెట్టుకింద భోజనం విశిష్టత ఏంటి..?

మరోవైపు అనంతపురం జిల్లాలోనే  మిడుతూరు దగ్గర కూడా  ప్రమాదం పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద మరో ప్రమాదం జరిగింది. మిడుతూరు  నేష‌న‌ల్ హైవేపై కారు పాదాచారులపై దూసుకెళ్లిన ఘటనలో 62 యాకోబ్‌ , 60 ఏళ్ల నారాయణ  అనే వ్యక్తులు మృతి చెందారు. అనంతపురం జిల్లాలో జ‌రిగిన‌  రోడ్డు ప్రమాదాల్లో.. ఏడుగురు మృతి చెంద‌డంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెల‌కుంది.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Crime news, Road accident

ఉత్తమ కథలు