AP Road Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని విశాఖపట్నం (Visakhapatnam)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం.. బైక్‌ను ఢీకొట్టడంతో ఈ రోడ్డు ప్రమాదం (Road Accident)జరిగింది. విశాఖ నగరంలోని పీఎం పాలెం క్రికెట్ స్టేడియం సమీపంలో వీ కన్వెన్షన్ హాల్ ఎదురుగా మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులను 22 ఏళ్ల ధనరాజ్, 22 ఏళ్ల కె.వినోద్ ఖన్నా గా గుర్తించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి మారికవలస ప్రాంతానికి చెందిన ధనరాజ్, కె.వినోద్ ఖన్నా కలిసి పనోరమ హిల్స్‌లో ఉన్న స్నేహితుడు ప్రశాంత్ పుట్టినరోజు వేడుకలకి హాజరయ్యారు. ఎంతో సంతోషంగా ఫ్రెండ్ పుట్టిన రోజు వేడుకలను జరపాలి అనుకున్న సమయంలో అనుకోని ప్రమదం వారి జీవితాలను ముగించేసింది..
స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలకు అని వెళ్తూ.. ఆ తర్వాత బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు కొమ్మాది పెట్రోల్ బంక్‌కు చేరుకొని.. మళ్లీ అక్కడి నుంచి తిరిగి పనోరమ హిల్స్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో స్టేడియం సమీపానికి రాగానే గుర్తు తెలియని వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ధనరాజ్, వినోద్ ఖన్నా అక్కడికక్కడే మృతిచెందారు. ధనరాజ్ ఇన్ఫోసిస్‌లో, వినోద్ ఖన్నా స్థానికంగానే రామాటాకీస్ వద్ద ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి: అనంతపురం మరోసారి తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థుల ప్రాణాలతో ఆటలా అంటూ లోకేష్ ఫైర్
రాత్రి మారికవలసలోని శారదానగర్-2 ప్రాంతానికి చెందిన ధనరాజ్, స్వతంతర్ నగర్‌కు చెందిన కె.వినోద్ ఖన్నా కలిసి లా కళాశాల సమీపంలోని పనోరమ హిల్స్‌లో ఉన్న స్నేహితుడు ప్రశాంత్ పుట్టినరోజు వేడుకలకి చేరుకున్నారు. కొద్దిసేపు అక్కడ గడిపిన తర్వాత బైక్‌లో పెట్రోల్ పోయించుకునేందుకు కొమ్మాది పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. పెట్రోల్ పోయించుకున్న తరువాత కాసేపట్లో తమ గమ్యస్థానానికి చేరుకుంటామనుకునే సమయంలో ఊహించని ప్రమాదం వారి జీవితాలను బలి తీసుకుంది.
ఇదీ చదవండి: టార్గెట్ 2024.. కలుస్తున్న టీడీపీ-జనసేన..! సెట్ చేస్తున్న బీజేపీ సీనియర్…?
అక్కడికి సమీపంలో వేరే ప్రమాదంలో మరో యువకుడు మరణించాడు. స్వాతంత్య్ర నగర్ కు చెందిన బత్తిన మురళి ప్రొక్లైన్ మిషన్ విధులకు వెళ్తుండదు .. ఈ నేపథ్యంలో స్టేడియం ఎదురుగా ఉన్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు సంభందించిన నిర్మాణం అవుతున్న అపార్ట్మెంట్స్ వద్దకు విధులకు వెళ్ళాడు .. మంగళవారం అర్ధరాత్రి బత్తిన మురళి పై ప్రొక్లైన్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు .. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది..
పీఎం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికొచ్చిన ఇద్దరు యువకులు మరణించడంతో మృతుల కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. దీంతో మారికవలసలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Road accident, Vizag