Love story twist: ప్రేమించిన అమ్మాయి పేరెంట్స్ ను రిసీవ్ చేసుకోవడానికి వెళ్లాడు.. కానీ అంతలోనే ఊహించని ట్విస్ట్

ప్రతీకాత్మక చిత్రం

Sad Love Story: ఇద్దరూ ఒకరంటే ఒకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి బతకాలి అనుకున్నారు. పెద్లలను ఒప్పించారు... అమ్మాయి తల్లిదండ్రులను తీసుకొచ్చి.. హోటల్ లో రూమ్ ఏర్పాట్లు చేసి.. తరువాత తీసుకువస్తానని చెప్పి యువకుడు బయటకు వెళ్లాడు.. కానీ అంతలోనూ ఊహించని ట్విస్ట్ తో ఆ ఇంట్లో విషాదం నెలకొంది.

  • Share this:
    Sad Love Story: ఒక్కోసారి కొన్నిసంఘటనలు చూస్తే కన్నీరు తిరగకమానదు.. తాజాగా ఓ ప్రేమ కథ (Love story) అలాంటి మలుపులే తిరిగింది. వాళ్లిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కడదాకా కలిసి బతకాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి పెళ్లికి ఒప్పొంచారు కూడా.. రెండు కుటుంబాల సభ్యులు ఈ పెళ్లి (Marriage)కి ఒప్పుకున్నారు. ఈ క్రమంలో వారికి త్వరలోనే పెళ్లి చేసేందుకు పెద్దలు కూడా సిద్ధమయ్యారు. కానీ కాలం వారి ప్రేమను చూసి అసూయ పెంచుకున్నట్లుంది. వారి జీవితాలకు ఎండ్ కార్డ్ వేసింది. మొదట అనారోగ్యంతో ప్రియురాలు చనిపోగా.. ఆ తరువాత తన ప్రియురాలి లేని లోకంలో తాను ఉండలేనంటూ ప్రియుడు సైతం ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ విషాదంతమైన ప్రేమ కథకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని మైలవరం మండలం కరమలవారి పల్లెకు చెందిన రాచంరెడ్డి లక్ష్మినారాయణ రెడ్డి (Laxminarayana Reddy), పార్వతీ I(Parwathi)దంపతులకు కుమారుడు 27 ఏళ్ల మురళీధర్ రెడ్డి (Muralidhar Reddy), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, కొన్నేళ్ల క్రితం లక్ష్మీనారాయణ రెడ్డి చనిపోయాడు. మురళి సీఏ చదివాడు. ఆ సమయంలో తెలంగాణ (Telangana)లోని ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ ఒకరికొరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి.. పెళ్లికి ఒప్పించారు. పెద్దలు కూడా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు.

    తాజాగా ఖమ్మం (Khammam)నుంచి ప్రేయసి కుటుంబ సభ్యులు వస్తున్నారని, పెళ్లికి సంబంధించి వివరాలు మాట్లాడుతారంటూ మురళీ తన ఇంట్లో వారం రోజులుగా చెబుతూ వచ్చాడు. వారు ఖమ్మం నుంచి నేరుగా ప్రొద్దుటూరుకు చేరుకుంటారని, అక్కడ లాడ్జీలో బస ఏర్పాటు చేశానని చెప్పాడు. అక్కడి నుంచి వారిని తీసుకువస్తానని చెప్పి.. మురళీ ఇంటి నుంచి హోటల్‌కు వెళ్లాడు. అయితే, హోటల్‌కు వెళ్లే ముందు సూసైడ్ లెటర్ (Suicide letter)రాసి వెళ్లాడు. అది చూసిన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అప్పటి వరకు అంతా సవ్యంగా సాగుతుందనుకున్న మురళీ కుటుంబ సభ్యులు.. ఆ లేఖను చూసి షాక్ అయ్యారు.

    ఇదీ చదవండి: ఎగ్ దోశకు తినడానికి డబ్బులు అడిగితే అమ్మ నో అంది.. బీటెక్ విద్యార్థి ఏం చేశాడంటే..?

    ఆ లేఖలో ఏముందంటే..
    అమ్మా నన్ను క్షమించండి. నేను ప్రేమించిన యువతి ఈ నెల 20వ తేదీన అనారోగ్యంతో చనిపోయింది. ఆమెలేని జీవితం నేను ఊహించుకోలేను. ఈ బ్రతుకు నాకొద్దు. నేను కూడా చనిపోవాలని అనుకుంటున్నాను. అని మురళీ తన లేఖలో రాశాడు. ఆ లేఖ చదివిన మురళీ కుటుంబ సభ్యులు కంగారుపడి.. మురళీ బస చేసిన హోటల్‌కు వెళ్లారు. కానీ, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. హోటల్‌లోని ఓ గదిలో చీరతో ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయాడు.

    ఇదీ చదవండి: ఇంత శాడిజమా? భార్య ఆత్మహత్య వీడియో తీసి పైశాచిక ఆనందం

    మురళి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మురళి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మురళి మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: