Minor Girl Pregnant by Teacher: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మహిళలు, మైనర్లపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మైనర్లపై ఇటీవల లైంగిక దాడులు పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది. నిందితులను కఠినంగా శిక్షిస్తున్నా దిశ వంటి యాప్ లు తీసుకువచ్చి నిఘా పెంచిన మహిళలపై అరాచకాలు మాత్రం తగ్గటం లేదు. వరుస ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే వెకిలిచేష్టలకు పాల్పడ్డాడు. పాఠాలు చెబుతూనే పాడుపని చేశాడు. కామాంధుడి పైశాచికత్వానికి ఓ మైనర్ బాలిక గర్భవతి అయ్యింది. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటుంటారు. సమాజంలో గురువుకు ఉండే గౌరవం అలాంటింది. కానీ విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తే, అవకాశం దొరికింది కదా అని ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దిగజారితే, అలాంటి వ్యక్తిని ఏమనాలో అర్థం కావడం లేదు. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఫిజిక్ క్లాసులకు ఆమె దూరమైందనే పేరుతో ఫిజికల్ గా దగ్గరయ్యాడు. ట్యూషన్‌కు వెళ్లిన బాలికను లొంగదీసుకుని అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ టీచర్. అలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన విజయనగరం జిల్లా (Vizianagaram)లో చోటుచేసుకుంది.
తన దగ్గర చదువు నేర్చుకునేందుకు వచ్చిన మైనర్ బాలిక ( Minor Girl) ను ట్యూషన్ మాస్టారు (Tution Master)చిన్నా బెదిరించి, లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, కుటుంబసభ్యుల వివరాల మేరకు విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పదోతరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని మూడేళ్ల నుంచి ఓ ట్యూషన్ సెంటర్‌కు వెళుతోంది. ఆ అమ్మాయిపై ట్యూషన్ మాస్టారు కన్నేశాడు.
ఇదీ చదవండి: మత్తు వదిలించండి.. ఎస్‌ఈబీ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు.. అక్రమ ఇసుకపై ప్రత్యేక ఫోకస్
అమెను లోబరుచుకునేందుకు.. మిగిలిన విద్యార్థులంతా వెళ్లిపోయాక.. ‘నీకు తెలివి లేదు.. మేధాశక్తి పెంచుతాను. అందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి’ అంటూ బాలికను లోబర్చుకున్నాడు. కొన్ని రోజులుగా ఆ బాలిక సరిగ్గా తినకపోవడంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భవతి అని, ఎనిమిదో నెల అని వైద్యులు నిర్ధారిచారు. దీంతో బాలికను కుటుంబసభ్యులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి: మత్తు ఆంధ్రప్రదేశ్ లో వింత ఆచారం.. ఇలా పెళ్లి చేస్తే పంటలు బాగా పండుతాయంట..?
వెంటనే బాధితులు దిశ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. ఈ దారుణానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు చిన్నాను అదుపులోకి తీసుకున్నామని దిశ డీఎస్పీ త్రినాథ్ తెలిపారు. ఇతడికి ఇదివరకే అక్క కుమార్తెతో పెళ్లయిందని, ఉద్యోగం రాకపోవడంతో ట్యూషన్ చెబుతున్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Minor girl, Vizianagaram