• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • ANDHRA PRADESH CRIME NEWS ONE YOUNG MAN FIRE ON A GIRL WHO REJECT TO GAVE HER PHONE NUMBER NGS TPT

Gun Fire: ప్రేమ అంటూ పక్కింటి అమ్మాయి వెంటపడ్డాడు.. ఒప్పకోనందుకు కాల్పులకు తెగబడ్డాడు

ప్రేమించలేదని పక్కింటామ్మాయిపై కాల్పులు

ప్రేమ అన్న పదాన్ని ఉన్మాదంగా మార్చేస్తున్నారు కొందరు యువకులు.. ప్రేమ అంటూ వెంటపడుతున్నారు. ప్రేమించాలని వేధిస్తున్నారు. అయినా ఒప్పుకోకపోతే దాడులకు తెగబడుతున్నాడు. తాజాగా చిత్తూరులో ఓ యువకుడు నాటు తుపాకీతో హల్ చల్ చేశాడు.

  • Share this:
    ఏపీలో ప్రేమ పేరుతో యువతులను వేధిస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమించలేదని యువతులపై దాడికి దిగుతున్నారు యువకులు. యాసిడ్ దాడులు, కత్తి దాడులు అంటూ ఉన్మాదంతో భయం పెంచుతున్నారు. ప్రేమించాలని వెంటపడుతారు.. నువ్వు లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాను అంటారు. ప్రేమను తిరస్కరించిన అమ్మాయిపై దారుణానికి ఒడిగడుతారు. ప్రేమించలేదన్న కోపంతో మద్యం సేవించి మత్తులో ఉన్మాదంతో బాలికలపై దాడికి దిగుతున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా మారుమూల పల్లెలో నాటుతుపాకీ కాల్పుల కలకలం వెలుగు చూసింది. మైనర్ బాలిక ఇంటి దగ్గర మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు ఓ యువకుడు. ఇదేంటని అడిగిన వారిపై నాటు తుపాకులతో కాల్పుకు యత్నించాడు ఆ ఉన్మాది.

    చిత్తూరు జిల్లా పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బైరెడ్డి పల్లె మండలం కడపనత్తం గ్రామంలో చాన్ అలియాస్ ఖాదర్ బాషా వృత్తిరీత్యా టైలర్. బట్టలు కుట్టుకుంటూ.. అమ్మ, నాన్నలతో కలసి జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై మనసు పడ్డాడు. ప్రేమించాలంటూ వెంటపడుతూ వచ్చాడు. ప్రేమకు ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. దీంతో ఉన్మాదిగా మరిన చాన్ బాషా అమ్మాయిని మరింత వేధింపులకు గురిచేస్తూ.. రోడ్డుపై వెళ్తున్న ఆ మైనర్ పై అసభ్యంగా ప్రవర్తించాడు. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఈల వేయడం.. చెయ్యి పట్టుకొని లాగటంతో వేధింపుల విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో యువతి తల్లి చాన్ భాషను మందలించే ప్రయత్నం చేసింది. అయినా ఆ యువకుడు వేధింపులు మాత్రం ఆపక పోవడంతో... ఊరి పెద్దల వద్దకు పంచాయితిని తీసుకెళ్లారు.

    ఇదీ చదవండి: ఏపీలో అరుదైన అరటి పండ్లు.. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?

    పెద్దల దగ్గర పంచాయతీ జరుగుతున్న సమయంలో అందరి సమక్షంలోనే చాన్ భాషాను కొట్టింది యువతి తల్లి. అసలే ప్రేమించలేదన్న కోపంతో పాటు యువతీ తల్లి అందరి ముందు దాడి చేయడం చాన్ తట్టుకోలేకపోయాడు. యువతి ఇంటి దగ్గరకు వెళ్లి నాటు తుపాకీతో కలకలం సృష్టించాడు. యువతీ తల్లితో గోడవకు దిగాడు.. ఇంతలోనే పొరిగింటిలో నివాసం ఉంటున్న దినేష్ గొడవను నిలువరుంచే ప్రయత్నం చేసాడు. దింతో ఆగ్రహించిన చాన్ దినేష్ పై కాల్పులు జరిపాడు. తృతిలో ఆ కాల్పుల నుంచి తప్పించుకున్నాడు. నాటు తుపాకీ నుంచి పేలిన నల్ల మందు ఇంటి గోడకు తాకింది.

    ఇదీ చదవండి: త్వరలోనే ఏపీ కేబినెట్ విస్తరణ...? మంత్రుల్లో ఎవరు సేఫ్? కొత్తగా వచ్చేది ఎవరు..?

    ప్రశాంతంగా ఉన్న గ్రామంలో కాల్పులు జరపడంతో తుపాకుల తూటా శబ్దాలతో గ్రామం గజగజ వణికింది. విషయం తెసులుకున్న పోలీసులు ఘటన స్థానికి చేరుకున్నారు. చాన్ భాషాను అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు. నాటు తుపాకీ ఎలా లభ్యమైంది. ఎవరు తయారు చేసి ఇచ్చారు.. లాంటి అంశాలపై దర్యాప్తు చేపట్టారు. మైనర్ బాలికపై బేధింపులు చేయడంతో ఫోక్సో చట్టముక్రింద ఎఫ్ఐ ఆర్ నమోదు చేసారు
    Published by:Nagesh Paina
    First published: