Home /News /crime /

ANDHRA PRADESH CRIME NEWS ONE YOUNG GIRL FIGHT FOR LOVE PROTEST AT LOVER HOUSE NGS

Andhra Pradesh: ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాడు.. కానీ పెళ్లి ఎప్పుడు అంటే..?

పెళ్లి కోసం ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా

పెళ్లి కోసం ప్రియుడి ఇంటి ముందు యువతి ధర్నా

ప్రేమ పేరుతో మోసం చేసే ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి తనకు న్యాయం చేయాలి అంటూ ప్రియుడి ఇంటి ముందే ధర్నాకు దిగింది..

    ప్రేమ.. ఎంతో మధురమైనది.. కానీ కొందరిని మాత్రం ఉన్మాదిగా మారుస్తుంటే.. మరికొందరి ప్రాణాలు తీస్తోంది.. ఆత్మహత్యలు చేసుకునేలా చేస్తోంది. అయితే ఈ ప్రేమ పేరుతో కొంతమంది యువతులు నరక యాతన అనుభవించాల్సి వస్తోంది. ప్రేమ పేరుతో వేధించే వారు కొందరైతే.. ? ప్రేమించి.. వంచించే వారు మరికొందరు. ఇలా ప్రేమ ఎంతో మంది యువతుల జీవితాలను రోడ్డుపై పడేస్తోంది. సోషల్ మీడియా వాడకం పెరిగాక.. ప్రేమ మోసాలు మరింత ఎక్కువయ్యాయి. పరిచయం ఉన్న వ్యక్తులే ప్రేమించి తరువాత మొహం చాటేస్తున్న వార్తలు తరచూ వింటూనే ఉంటాం.. ఇప్పుడు సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులతో పీకల్లోతు ప్రేమలో పడి.. తరువాత అది నిజమైన ప్రేమ కాదని తెలిసి ఆత్మహత్య చేసుకున్న అమ్మాయిలు ఎంతో మంది గురించి వింటున్నాం.. అయినా ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రేమ అంటూ వెంటపడి.. తరువాత మొహం చాటేసే వారు పెరుగుతూనే ఉన్నారు..

    ప్రేమ పేరుతో మోసగించిన యువకుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగిన ఉదంతం మండలంలోని వెంప గ్రామంలో వెలుగులోకి వచ్చింది. బాధితురాలు గుత్తుల లావణ్య ఇంటర్మీడియట్‌ చదివి ఇంటివద్దే ఉంటోంది. ఆమె కథనం ప్రకారం.. వెంప గ్రామానికి చెందిన బొక్కానరేష్‌ రెండేళ్ల క్రితం పరిచయం అయ్యాడు. లావణ్య వెంట పడి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పాడు. 

    నరేష్‌ కుటుంబ సభ్యులకు పరిచయం చేసి తరచూ వాళ్ల ఇంటికి తీసుకువెళ్లేవాడు. కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చేసరికి మొహం చాటేసేవాడని.. ఇటీవల పెళ్లి చేసుకోమని గట్టిగా అడిగితే డబ్బులు తీసుకుని ఈ విషయం మార్చిపోవాలని నరేష్, ఆయన కుటుంబ సభ్యులు చెప్పారని వాపోయింది. సంఘ పెద్దలు చర్చించి వివాహం చేసుకోవాలని చెప్పడంతో గురువారం రాత్రి నరేష్, అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. 

    నరేష్‌ తనను పెళ్లి చేసుకునే వరకు కదిలేది లేదంటూ ఇంటిముందు టెంట్‌ వేసి ఆందోళనకు దిగింది. బాధితురాలు లావణ్యకు కుటుంబ సభ్యులు, స్థానికులు మద్దతుగా నిలబడ్డారు. విషయం తెలుసుకున్న మొగల్తూరు ఎస్సై సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, West Godavari

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు