అన్నా రఘు న్యూస్ 18 ప్రతినిధి అమరావతి. Facebook Friendship: సోషల్ మీడియా (social media) వల్ల మంచి సంగతి ఎలా ఉన్నా.. సైబర్ నేరాలు (Cyber Crime) పెరుగుతున్నాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా..? మోసాలు జరుగుతున్నట్టు రోజూ వార్తలు వస్తున్నా.. మోసపోతూనే ఉన్నారు జనాలు.. ముఖ్యంగా కేటుగాళ్లు.. సోషల్ మీడియా ద్వారా తమ రూటు మార్చి.. అమాయకులను గుర్తించి.. వారి సమస్యలు తెలుసుకుని మరీ మోసం (Cheating) చేస్తున్నారు. ఆన్ లైన్ లో పరిచయమైన ఓ జంట కారణంగా రోడ్డున పడ్డాడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. (Software Engineer) బాగా సంపాదించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరుకు నలభై ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. అదే సమయంలో అతనికి పేస్ బుక్ లో కల్యాణ శ్రీ పేరు తో రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ ను అనుమతించిన ఇంజనీర్ తో మాట మాటా కలిసింది. ఇద్దరూ పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నారు.
అవతల తనతో చాట్ చేస్తున్నది అమ్మాయి కాదు అబ్బాయి అని గుర్తించలేకపోయాడు. దాసు అనే సైబర్ నేరగాడు.. అమ్మాయిగా తన ప్రొపైల్ పెట్టి. తనది విజయవాడ అని పెళ్లి కాలేదని నమ్మించాడు.. నో వాయిస్ ఓన్లీ మెస్సేజ్ అని దాసు చాటింగ్ ను స్టార్ట్ చేసాడు. కల్యాణి శ్రీ అని చాటింగ్ చేసేవాడు. తాను బాగా డబ్బు కలదానినని ఐతే ఆస్థి తగాదాల్లో ఉందని తగాదాలు పరిష్కారమైతే తనకు యాబై కోట్ల మేరకు ఆస్థి ఉందని సమస్యల పరిష్కారానికి కొంత ధన సహాయం కావాలని దాసు కోరాడు.
ఇదీ చదవండి: సోషల్ మీడియాలో బిగ్ బాస్ బ్యూటీ సెగలు.. అందాల ఆరబోతతో కవ్విస్తోన్న దేత్తడి హారిక
డబ్బు ఇచ్చేందుకు ఒకే చెప్పిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. పెళ్లి చేసుకుందామని ఆమెను కోరాడు. అయితే తన పెళ్లి గురుంచి తన ఇంటి పెద్ద మధుసూదన్ తో మాట్లాడాలని అతని నెంబర్ ఇచ్చాడు. దాసే తరువాత మధుసూదన్ లా మాట్లాడి బాధితుడి వద్ద ఖర్చులకు ఇతర అవసరాల పేరుతో గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు విడతల వారీగా కోటి రూపాయల వరకు కాజేసాడు.
ఇదీ చదవండి: పసిడి ప్రియులకు పండగ లాంటి వార్త.. బంగారం కొనేందుకు ఇదే సరైన సమయం..
బాధితునికి అనుమానం రాకూడదని.. తన భార్య జ్యోతి ఖాతాలో నగదు వేయించేవాడు. అలా కళ్యాణి శ్రీ పేరుతో కొంతకాలం ప్రేమాయణం నడిపి పెళ్లి ప్రస్తావన తెచ్చేప్పటికీ.. మొఖం చేటేయటంతో బాధితునికి తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ లకు పిర్యాదు చేశాడు.
ఇదీ చదవండి: వాహనదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. ఎందుకో తెలుసా..?
గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో ఉంటున్న దాసు జ్యోతి దంపతులను సత్తెనపల్లి పోలీస్ ల సహాయంతో అరెస్ట్ చేసారు. ఐతే దాసు జ్యోతి ల గురుంచి విచారించిన పోలీస్ లకు విస్తపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దాస్ నూజివీడు లో ట్రిపుల్ ఐటీ లో చదువుకొని ప్రాంగణ ఎంపికలో టిసిఎస్ లో ఉద్యోగం పొందాడు. హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ ఆన్లైన్ లో రమ్మీ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతూ తన ఉద్యోగ బాధ్యత లను సక్రమం గా నిర్వర్తించకపోవటం తో తొలగించారు.
ఇదీ చదవండి సామాన్యుడి ఆహ్వానంపై స్పందించిన సీఎం.. ఆటోలో ఇంటికి వెళ్లి భోజనం.. వైరల్ గా మారిన వీడియో
ఆ తరువాత నత వ్యసనాల కోసం ఈజీగా మనీ సంపాదించాలని ప్లాన్ చేశాడు. సత్తెనపల్లి వచ్చి కొంత భూమిని లీజ్ కు తీసుకున్నాడు. ఈక్రమం లో ప్రెవేట్ ఉద్యోగి జ్యోతిని వివాహమాడాడు. ఆన్లైన్ రమ్మీ క్రికెట్ బెట్టింగ్ లలో డబ్బు పోగొట్టి అప్పుల పాలయ్యాడు. జీవనోపాధి కోసం పండ్ల బండిని ఏర్పాటు చేసుకున్నాడు. అయినా తన బెట్టింగ్ రమ్మీ వ్యసనాన్ని వదులుకోలేదు. ఈ క్రమం లో డబ్బు కోసం నకిలీ పేస్ బుక్ ప్రొఫైల్ ను రూపొందించి పలువురికి రిక్వెస్ట్ లు పంపుతూ వారి తో చాటింగ్ చేసి అందినకాడికి డబ్బు కాజేసేవాడు. ఇలా మోసం చేసిన డబ్బును ఎక్కువ భాగం ఆన్లైన్ రమ్మీ క్రికెట్ బెట్టింగ్ లలో పందాలను కాసేవాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Facebook friend, Gunturu