• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • ANDHRA PRADESH CRIME NEWS ONE NRI CHEATED HIS WIFE SHE FILES CASE AGAINST HIS HUSBAND FAMILY NGS GNT

కోట్ల ఆస్తి ఉందన్నాడు.. సొంత నర్సింగ్ హోం పెట్టిస్తామన్నాడు.. పెళ్లాయ్యక ఏం చేశాడంటే..?

ప్రతీకాత్మక చిత్రం

వంద అబద్దాలు చెప్పైనా ఓ పెళ్లి చేయ్యాలన్నది సామెత.. ఆ సామెతను ఆదర్శంగా తీసుకున్నాడు ఆ పెళ్లి కొడుకు.. చివరికి పెళ్లయ్యాక అక్కడ చెప్పిన పరిస్థితి ఏమీ లేకపోవడంతో.. నవ వధువు నిలదీయడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

  • Share this:
    వంద అబద్దాలు చెప్పి.. ఒక పెళ్లి చేయడం తప్పు కాదనేది ఎప్పటి నుంచో మనం వింటున్న సామెత.. పెళ్లి  కోసం చాలామంది చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉన్న సంఘటనలు ఎన్నో నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. కానీ అదే సామెతను ఓ యువకుడు ఆదర్శంగా తీసుకున్నాడు. నిజం చెప్పడం పాపం అన్నట్టు ప్రతి విషయం రెండింతలు చేసి చెప్పాడు. అలా మాయమాటలతో పెళ్లి కూతురు సహా వారి తల్లిదండ్రులను నమ్మించాడు. దీంతో కోటి ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన యువతికి.. అక్కడకు వెళ్లగానే అసలు నిజం తెలిసింది. దీంతో భర్తను ఏం ఛెప్పారు.. ఇక్కడ పరిస్థితి ఏంటని నిలదీసింది.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చి ఆమె షాక్  కు గురైంది..

    ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామాని కి చెందిన యువతికి హైదరాబాద్ కి చెందిన యువకుడితో గత సంవత్సరం ఫిబ్రవరి పదో తేదీన అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. యువతి కేరళలో పీీజీ వైద్య విద్యను అభ్యసిస్తోంది. అయితే తెలిసిన వారి ద్వారా పరిచమైన యువకుడు గోరంట్ల రూబెన్ అజయ్ కుమార్.. ఆ యువతి కుటుంబానికి మాయమాటలు చెప్పాడు. తనకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని.. అలాగే  హైదరాబాద్ లో సొంత నర్సింగ్ హోమ్ కట్టిస్తామని చెప్పాడు.. చెప్పడమే కాదు వివాహం కోసమని భారీగా బంగారు ఆభరణాలు చేయించాడు కూడా..

    కూతురుకి గొప్ప సంబంధం వచ్చిందని సంతోష పడ్డ తల్లిదండ్రులు.. తమ తాహతకు మించి.. పెళ్లిని అంగరంగ వైభవం గా జరిపించారు. తన జీవిత భాగస్వామి గా మంచి బార్త దొరికాడని ఎన్నో కలలు కన్నఆ యువతీకి అక్కడికి వెళ్లాక అసలు విషయం తెలిసింది.  కోటి ఆశలతో కాపురాన్ని కి హైదరాబాద్ లో ని హైటెక్ సిటీ మసీద్ బాండ ప్రాంతం లో ఉన్న గోరంట్ల రూబెన్ అజయ్ కుమార్ ఇంటి కి వెళ్ళింది. కానీ పెళ్లికి ముందు చెప్పిన ఆనవాళ్లు.. ఎక్కడా ఆ ఇంట్లో కనిపించలేదు. అసలు ఆమె ఊహించింది ఒకటైతే అక్కడి కనిపించింది వేరేలా ఉంది. రూబెన్ అజయ్ కుమార్ ను ఆమె నిలదీసింది .. అక్కడ నుంచి అత్తింటి వేధింపులు మొదలయ్యాయి.

    ఇంతలో ఉద్యోగం పేరుతో ఆ యువకుడు అమెరికాకు పయనం అయ్యాడు. అమెరికా వెళ్లి న తరువాత అత్తవారింటి వేధింపులు  రెట్టింపు అయ్యాయి. అలాగే రూబెన్ అమెరికాలో మోసాలకు పాల్పడుతున్నాడని తెలియడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. అత్తింటివారి మీద అనుమానంతో తన వివాహ సమయం లో  పెట్టిన బంగారు ఆభరణాలు ను తనిఖీ చేయించగా అవి అన్నీ నకిలీవని తేలటం తో షాక్ తిన్నఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.
    Published by:Nagesh Paina
    First published: