Village Volunteer: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. కొత్త కొత్త పథకాలు తీసుకొస్తున్నారు సీఎం జగన్ (CM Jagan). ఆ పథకానికి మీరు అర్హులు అంటూ మాటలు చెప్పేవాడు.. ఈ పథకం మీకు రావాలి అంటే ఇలా చేయండి అంటూ మాటలు చెప్పేవాడు. అలా ఆ కుటుంబానికి చేరువ అయ్యాడు.. వాలంటీరే (Volunteer)కదా అని.. ఆయనకు ఇంట్లోకి వచ్చి కబుర్లు చెప్పేంత చనువు ఇచ్చారు. అతడి మాటల వెనుక ఉన్న వక్ర బుద్ధిని ఊహించలేకపోయారు. తరుచూ వాలంటీర్ ఇంటికి వస్తూ వెళ్తూన్నా అతడి లో ఉన్న కామాంధుడిని పసికట్టలేకపోయారు. అలా రోజు ఆ ఇంటికి వెళ్తున్న వాలంటీర్.. కామంతో రగిలిపోతు.. ఆ ఇంట్లో ఉన్న బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెకు మాయ మాటలు చెబుతూ వచ్చాడు.. ఓ రోజు తల్లిదండ్రులు లేని సమయంలో ఇంటికి వచ్చి.. బాలికపై పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.. వద్దని వారించినా ఆమెను బెదిరించాడు. తనకు వారు తెలుసు, వీరు తెలుసు అంటూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తాను అంటూ బెదిరించాడు. కానీ ఇటీవల ఆ చిన్నారిలో మార్పును గమనించిన తల్లిదండ్రులు.. ఏమైందని నిలదీస్తే అసలు విషయం బయటకు వచ్చింది.
ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామంలో వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం. గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్న 23 ఏళ్ల బూసి సతీష్ అనే యువకుడు బొబ్బిల్లంక గ్రామానికి చెందిన బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రభుత్వ పధకాలు చేరవేత పేరుతో తరచూ బాలిక ఇంటికి వెళ్లివచ్చే సతీష్. .ఇటీవల ఇంటిలో బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో ఇంటికి వచ్చాడు. అయితే నిత్యం అతడు వచ్చివెళ్తుండడం.. తనతో చనువు ఉండడంతో అలాగే వచ్చాడేమో అనుకుంది బాలిక.. దీంతో ఇంట్లోకి రానిచ్చింది. అయితే అతడిలో ఉన్న కామాంధుడిని నిద్రలేపి బాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తాను అంటూ బెదిరించాడు.
ఇదీ చదవండి : సీఎం జగన్ ను ఫాలో అయిన మంత్రులు.. ఆ ఇద్దరికి హ్యాట్సాఫ్
అయితే నిత్యం చాలా చాలాకిగా కనిపించే ఆ బాలిక.. అత్యాచార ఘటన తరువాత లోలోనే మధనపడుతూ డల్ అయిపోయింది. అప్పటి నుంచి కూతురి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు.. ఏం జరిగింది ఎందుకు అలా ఉన్నావంటూ గట్టిగా నిలదీశారు. దీంతో ఆమె అసలు విషయం చెప్పడంతో షాక్ కు గురయ్యారు. దీంతో వారు సీతానగరం పోలీసులకు సమాచారం ఇవ్వగా..రంగంలోకి దిగిన పోలీసులు గ్రామ వాలంటీర్ సతీష్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. నిందితుడు సతీష్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ శుభశేఖర్ తెలిపారు.
ఇదీ చదవండి : చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు.. గుంటనక్కలను ఉసిగొల్పుతున్నాడు అంటూ ట్వీట్
అయితే .ప్రభుత్వం నుంచి ప్రజలకు వారధిగా పనిచేస్తామంటూ ముందుకు వచ్చిన గ్రామ సేవకులు ఇలా ప్రవర్తిస్తుండడంతో ఆ వ్యవస్థపైనే విమర్శలు వస్తున్నాయి. కొందరు చేసిన పనికి అందరూ ఇబ్బంది పడాల్సి వస్తోంది. వాలంటీర్లతో మేలు సంగతి అటు ఉంచితే.. ఇలాంటి పనులతో ఇబ్బందులు ఎదరువుతున్నాయని మండిపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, East godavari