Andhra Pradesh: గుంటూరులో మరో దారుణం.. దళిత మైనర్ పై గ్యాంగ్ రేప్.. సర్కార్ వైఫల్యాలపై లోకేష్ ఫైర్

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో యువతులకు రక్షణ లేకుండా పోతోంది. వరుస దారుణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గుంటూరులో ఓ దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు.. ప్రభుత్వ వైఫల్యాలతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని లోకేష్ మండిపడ్డారు.

 • Share this:
  అన్నా రఘు అమరావతి ప్రతినిది న్యూస్,          ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. రోజు రోజుకూ కామంధులు రెచ్చిపోతున్నారు. ఇటీవల గుంటూరులో బీటెక్ విద్యార్థిని ప్రమోన్మాది అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మరిచిపోకముందే.. మరో దారుణం చోటు చేసుకుంది. ఇప్పటికీ బీటెక్ విద్యార్థిని హత్యపై ఆందోళనలు మిన్నంటుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో మరో దళిత మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ వార్త కలకలం రేపుతోంది. గుంటూరు జిల్లా రాజుపాలెంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా మహిళలపై దాడులు పెరిగాయి. పోకరీలు, కామాంధులు, ప్రేమోన్మాదుల కారణంగా మహిళల ప్రాణాలకు రక్షణ లేదంటున్నారు. తాజాగా గుంటూరు లోని రేయిపూడిలో నివాసం ఉంటున్న ఓ దంపతులకు చెందిన బాలిక.. తమ కుటుంభం సభ్యులతో కలిసి రాజుపాలెంలో బంధువు చనిపోవడంతో కార్యక్రమానికి వెళ్లింది. అయితే అక్కడ ఒంటరిగా ఉన్న ఆ బాలికపై కొందరి కామందుల కన్ను పడింది. ఓ ఇద్దరు ఆమె దగ్గరకు వెళ్లి.. మీ అమ్మ పిలుస్తోందని చెప్పి నమ్మించారు. నిజమే అని నమ్మిన ఆ బాలిక వారితో పాటు ఇంటి వెనుకకు వెళ్తున్న సమయంలో.. ఆమె నోటిలో గుడ్డలు కుక్కి.. మరో ఇంట్లోకి తీసుకెళ్లి నిర్బంధించరారు. నాలుగు గంటల పాటు నిర్భిందించి.. ఆమెపై తమ కోరికలు తీర్చుకున్నారు. తరువాత విడిచిపెట్టారు.. అత్యంత దారుణంగా హింసించారు. వద్దు వద్దు అంటున్నా వినకుండా ఒంటినిండా గాయాలు చేశారు.

  వారి చెర నుంచి బయటకు వచ్చిన ఆమె జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. యువతి చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటికే ఇద్దరు నిందితులను గుర్తించి కేసు నమోదు చేశారు. మరోవైపు ప్రస్తుతం యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..

  దారుణం గురించి తెలిసిన వెంటనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె తండ్రికి ఫోన్ చేసి లోకేష్ ధైర్యం చెప్పారు. చ‌నిపోతానంటూ రోదిస్తోన్న ఆ క‌న్న‌తండ్రి హృద‌యాన్ని అర్థం చేసుకుని.. అధైర్య‌ప‌డొద్దు.. మ‌రో అమ్మాయికి ఇలా జ‌ర‌గ‌కుండా పోరాటం చేద్దాం అంటూ భ‌రోసానిచ్చారు. గుంటూరులో వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం వైఫల్యాలతోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి అన్నారు. రాష్ట్రంలో పేరుకే మహిళా హోం మంత్రి ఉన్నారు. కానీ మహిళలకు రక్షణ లేకుండా పోతోంది అన్నారు. సీఎం ఇంటికి సమీపంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండడం దారుణమన్నారు.

  తమకు ధైర్యం చెప్పిన లోకేష్ తో జరిగిన దారుణం మొత్తం వివరించి కన్నీరు పెట్టుకున్నారు ఆ తండ్రి.. అనారోగ్యంతో ఉన్న తమ చిన్నారిని అత్యంత కిరాత‌కంగా చెరిచార‌ని.. వద్దు ప్లీజ్ అని బతిమాలుతున్నా వినకుండా శ‌రీరమంతా కొరికేశార‌ని.. తన కూతురి బాధ చూస్తుంటే బతకాలి అనిపించడం లేదని గుండెల‌విసేలా రోధించారు. ఆయనను ఓదార్చిన లోకేష్ ధైర్యం చెప్పారు.. ఆ చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు..
  Published by:Nagesh Paina
  First published: