Home /News /crime /

ANDHRA PRADESH CRIME NEWS ONE MAN KILLED WOMAN WHO LIVING TOGETHER WITH IN GUNTURU NGS GNT

Extramarital Affair: డిగ్రీ చదువుతున్న కూతురిపై కన్నేశాడు.. కసితో తల్లిని కడతేర్చాడు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమించిన యుకుడ్ని వదిలేయాలని.. తనతో సంబంధం కొనసాగించాలని కూతురిని డిమాండ్ చేశాడు ఓ వ్యక్తి.. ఆ వేధింపులు భరించలేక కూతురు, తల్లి పోలీసులను ఆశ్రయించారు. జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన ఆ వ్యక్తి కసితో ఏం చేశాడో తెలుసా..?

  మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. కొందరు వావి వరసలు మరచిపోతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. నరరూప రాక్షలుగా మారుతున్నారు. కోరికలు తీర్చుకోవడానికి క్షణికావేశంలో హత్యలు చేస్తున్నారు. అది కూడా తన వాళ్లనే.. జీవితాంతం తోడుగా ఉంటారని.. కంటికి రెప్పలా చూసుకుంటారని ఆశించిన వారే ఇలా కిరాతకాలకు పాల్పడుతుండడం తీవ్ర
  ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకూ ఇలాంటి ఘటనలు పెరుగుతూ ఉన్నాయి. ఓ వ్యక్తి భర్త తోడు లేని ఓ మహిళను చేరదీశాడు. ఆమెకు అన్ని విధాల అండగా ఉన్నాడు. ఒకటి రెండేళ్లు కాదు 18 ఏళ్లు సహజీవనం చేశాడు. అయితే ఇన్నాళ్ల పాటు అతడు ఆమెను బాగా చూసుకోవడం వెనుక దురద్దేశం ఇటీవలే బయటపడింది. ఆమెతో పాటు చిన్నారి కూతురు కూడా ఉండడంతో.. ఆమె పెరిగి పెద్దైనంత వరకు ఓపిక పట్టాడు. ఆ కూతురు ఇప్పుడు డిగ్రీకి రావడం.. సరైన వయసులో ఉండడంతో.. అతడి కన్ను ఆమె కూతురుపై పడింది. అతడి దురుద్దేశం గ్రహించిన ఆమె కామాంధుడి నుంచి తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. దీంతో అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.. గుంటూరులోని కుప్పురావు కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన 42 ఏళ్ల ఓ మహిళను తన భర్త వదిలేశాడు. దీంతో ఆమె చిన్నారులైన తన కొడుకు, కూతురుతో కలిసి కుప్పురావుకాలనీలో ఉంటోంది. అదే సమయంలో పిల్లలతో ఒంటరిగా జీవన పోరాటం చేస్తున్న ఆమెతో గోలి సాంబయ్య పరిచయం పెంచుకున్నాడు. ఆ మహిళతో పాటు పిల్లలకు కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఆమెకు నమ్మకం కల్పించి సహజీవనం ప్రారంభించాడు.

  అలా 18 ఏళ్ల పాటు వారి జీవితం హాయిగానే గడిచిపోయింది. మరోవైపు ఆ మహిళ కుమార్తె ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. దీంతో మహిళకు వయసు పెరగడంతో ఆమెపై మోజు పోయింది. డిగ్రీ చదువుతున్న ఆమె కూతురుపై కన్నేశాడు. గత కొన్ని రోజులుగా ఆమె కూతురిని లైంగికంగా వేధిస్తూ వచ్చాడు. కానీ జూన్ 29న తనతో కలిసి ఉండాలి అంటే కూతురు కూడా.. తన కోరికలు తీర్చాలని కండిషన్ పెట్టాడు. లేదంటే వేధిస్తానని హెచ్చరించాడు. దాడికి కూడా పాల్పడ్డాడు. ఇది సరైన పద్ధతి కాదని కూతురుపై ఇలాంటి అఘాయిత్యం చేయడం ఏంటని ఆ మహిళ మందలించినా.. అతడు పద్ధతి మార్చుకోలేదు. పదే పదే ఆమెను లైంగికంగా లోబర్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించారు వారు. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని, తనతో సంబంధం పెట్టుకోవాలని శారీరకంగా సాంబయ్య వేధిస్తున్నాడంటూ.. అడ్డు పడాలని చూసిన తన అన్నయ్యపైనా దాడికి పాల్పడ్డాడని తల్లితో కలిసి ఫిర్యాదు చేసింది ఆ యువతి. స్పందించిన పోలీసులు సాంబయ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో జైలులో ఉండి ఇటీవల బెయిల్‌పై వచ్చాడు. తనను జైలుకు పంపారన్న కక్ష పెంచుకున్న సాంబయ్య శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మహిళ ఇంటికి వెళ్లి కత్తితో ఆమె నుదిటిపై గాయం చేసి, మెడ కోసి దారుణంగా హత్య చేశాడు. 18 ఏళ్ల పాటు తనతో సహజీవనం చేసిందన్న కనికరం లేకుండా కిరాతకుడిగా మారాడు. కాలనీలో అందరూ చూస్తుండగానే హత్య చేసిన పారిపోయాడు. సమాచారం అందుకున్న అర్బన్‌ ఎస్సై నారాయణ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి వివరాలు నమోదు చేసుకున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Extramarital affairs, Guntur

  తదుపరి వార్తలు