Home /News /crime /

ANDHRA PRADESH CRIME NEWS ONE MAN ENTERED IN WIFE AND HUSBAND FIGHT AFTER HE WAS KILLED NGS GNT

Wife and husband: భార్య భర్తల మధ్య గొడవలో దూరడు.. ప్రాణాలే పోయాయి.. ఏం జరిగిందంటే..?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Andhr Pradesh: ఎందులోనైనా దూరొచ్చుకాని భార్య భర్తల మధ్య దూరొద్దు అని పెద్దలు చెబుతుంటారు.. తాజాగా ఓ వ్యక్తి అలా భార్య మధ్య మధ్య వివాదంలో తల దూర్చినందుకు ప్రాణాల కోల్పోవలసి వచ్చింది.

  Andhra Pradesh:  పుణ్యానికి పోతే పాపం ఎదురైందనే సామతె ఉంది.. కానీ ఓ వ్యక్తి విషయంలో మాత్రం పుణ్యానికి పోతే ఏకం ప్రాణమే పోయింది. సాధరణంగా రోడ్డుపై గొడవ జరుగుతూ ఉంటే.. కొందరు చూసి చూడనట్టు వెళ్లిపోతారు. మనకెందుకులే అని లైట్ తీసుకుంటారు. మరికొందరైతే ఎదో సినిమా చూసినట్టు ఆ తతంగమంతా కళ్లప్పగించి చూస్తారు. మరికొందరైతే వద్దు అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తారు.  ముఖ్యంగా మనకు తెలిసిన వారు.. లేదా సన్నిహితులు బంధువులు గొడవ పడుతుంటే ఎవరైనా చూస్తూ ఊరుకోరు.. కొందరు తప్పు లేని వారిపై నిలబడతారు. మరికొందరు ఆ గొడవ ఆపే ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నమే  చేశాడు ఓ వ్యక్తి.. అయితే అలా చేసినందుకే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.. అసలు ఏం జరిగింది అంటే..

  గుంటూరు (Guntur)లో భార్యాభర్తల మధ్య గొడవ జరగడం చూసి సరిదిద్దేందుకు వెళ్లిన ఓ వ్యక్తి వారి కుమారుడి చేతిలోనే  దారుణ హత్యకు గురయ్యాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు నగరంలోని మంగళదాస్‌నగర్‌లో చోటుచేసుకుంది. పాతగుంటూరు పోలీసుల కథనం ప్రకారం.. పెయింటర్‌గా పనిచేసే మంగళదాస్‌నగర్‌ 2వ లైనుకు చెందిన గోగులపాటి బెన్ని మద్యానికి బానిసై తరచూ భార్యను వేధిస్తుండేవాడు.

  ఇదీ చదవండి: రుచే కాదు డిమాండ్ అ‘ధర’హో.. పంట పండిస్తున్న పులస.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాకే

  తాగుడు మానేయాలని భార్య ప్రతి రోజూ నచ్చ చెప్పే ప్రయత్నం చేసేది. దీంతో నిత్యం ఆ భార్య భర్తలు గొడవ పడేవారు. అయితే ఓ రోజు ఇద్దరి మధ్య గొడవ పెద్దది అవ్వడంతో.. నిన్న రాత్రి బెన్ని తన భార్యను  కొడుతూ ఉండగా..  సమీప బంధువైన శ్యాంసన, పక్కనే ఉన్న ఏచూరి సత్యనారాయణ(48)లు వచ్చి వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు.

  ఇదీ చదవండి: సీఎంతో సినీ పెద్దల భేటీ.. నాగార్జున దూరం..! మహేష్, బన్నీ వెళ్తారా?

  అయితే అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో ఉన్న బెన్నీ కుమారుడు.. మా కుటుంబ వివాదంలో మీ జోక్యం ఎందుకని ప్నశ్నించారు. అలా కొట్టుకుంటుంటే ఊరుకోవాల.. తల్లితండ్రి కొట్టుకుంటే నువ్వేం చేస్తున్నావంటూ అవతల వ్యక్తులు నిలదీశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం పెరిగింది.  బెన్ని కొడుకు ఆవేశంతో రగిలిపోయాడు.

  ఇదీ చదవండి: రూపాయికే రుచికరమైన ఇడ్లీ.. నమ్మలేకపోతున్నారా నిజం.. మూడు రకాల చెట్నీలు కూడా.. ఎక్కడో తెలుసా..?

  తన కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవడమే కాకుండా..  తననే తిడతారా అంటూ చిందులు వేశాడు. ఇంట్లో ఉన్న కత్తితో సత్యనారాయణను కిరతకంగా పొడిచాడు. క్షణికావేశంలో ఏం చేస్తున్నాడో  మరిచిపోయాడు.  దీంతో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణను మొదట ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

  ఇదీ చదవండి: తమిళనాడులో మెగా బ్రదర్స్ క్రేజ్.. అసెంబ్లీలో పవన్ ప్రస్తావన

  ప్రథమ చికిత్స తరువాత అతడ్ని ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆ తరువాత సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సత్యనారాయణ ఉదయం మృతి చెందాడు. హత్యకు పాల్పడ్డ జానను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాపం ఓ భార్య భర్తల మధ్య వివాదంలో దూరినందుకు సత్యనారాయణ తన ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime, Guntur

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు