Home /News /crime /

ANDHRA PRADESH CRIME NEWS ONE MAN BY MISTAKE PUS CASH ANOTHER BIKE IN PARKING AREA NGS

Cash Missing: పొరపాటున తనదే అనుకొని మరో బైక్ లో 2.80 లక్షలు.. చివరికి ఏమైందంటే?

పొరపాటున వేరే స్కూటీలో డబ్బులు పెట్టిన వ్యక్తి

పొరపాటున వేరే స్కూటీలో డబ్బులు పెట్టిన వ్యక్తి

Cash Missing: మతిమరుపు కావొచ్చు.. ఏమరపాటు కావొచ్చు.. వాటి కారణంగా కొన్ని సందర్భాల్లో తీవ్ర నష్టం కలిగిస్తాయి. అలాగే ఓ వ్యక్తి చేసిన చిన్న పొరపాటుకు 2.80 లక్షల రూపాయలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. తరువాత నాలుక కరుచుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. చివరికి ఏం జరిగిందంటే..?

ఇంకా చదవండి ...
    Cash Missing: ఈ రోజుల్లో చాలామందికి మతిమరుపు (Memory loss) చాలా కామన్ అయ్యింది. పెట్టిన వస్తువు ఎక్కడ పెట్టారో మరిచిపోవడం.. బయటకు వెళ్దామనుకున్నప్పుడు ఆ పనికి సంబంధించినది ఏదో ఒకటి మరిచిపోవడం.. లేద ఏమరపాటు చెప్పులు మార్మచి వేసుకోవడం.. ఇక బయటకు వెళ్లినప్పుడు బైక్ తాళాలు (Bike Keys) మరిచిపోవడం.. ఇంకా కొంతమంది పెట్రోల్ బంక్ కు వెళ్లి.. వాహనానికి ఇంధనం నింపుకున్న తరువాత.. అయ్యో పరసు మరిచిపోయాను అనేవాళ్లు కనిపిస్తూనే ఉంటారు. ఎక్కువమంది చేసే పొరపాటు బయట బైక్ పార్కు చేసిన తరువాత.. దానికే తాళాలు వదిలేసి వెళ్లిపోతరు.. తరువాత తాళాలు ఎక్కడ అని వెతుక్కుంటారు.. చాలమంది జీవితం ఇలాంటి పొరపాట్లు.. ఏమరపాట్లు జరుగుతూనే ఉంటాయి.. వాటికి మూల్యం కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే అలాంటి ఘటనే ఒకటి భారీగా నగదు మిస్ అయ్యేలా చేసింది.. ఓ వ్యక్తి పొరపాటును 2.80 లక్షల రూపాయలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

    ఏదైనా పనిమీద వెళ్లినప్పుడు.. పార్కింగ్ ప్లేస్  (Parking place) లో మన వాహనాన్ని వదిలి.. పని చూసుకొని వస్తాం.. అయితే అలా వచ్చినప్పుడు కొందరు ఏమరుపాటులో తన బైక్ అనుకుని మరోకరి బైక్ లో కీ పెట్టే ప్రయత్నం చేస్తుంటారు.. తీర తరువాత నాలుక కరుచుకుంటారు.. అది కూడా ఇద్దరిదీ ఒకే బైక్ అయితే.. తన వాహనం అనుకుని మరొకరి వాహనం తీసుకెళ్లే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు గురించి వింటాం కూడా.. అయితే ఓ వ్యక్తి పొరపాటున తనదే అనుకుని వేరే బైకులో 2.80 లక్ష రూపాయలు ఉంచాడు. కాసేపటికే నాలుక కరచుకుని చూస్తే అక్కడ బైక్ లేదు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.

    ఇదీ చదవండి : జగనన్న వస్తున్నాడు కార్లు జాగ్రత్త.. సీఎం తిరుపతి పర్యటనలో వినూత్న ప్రదర్శన

    స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పెనుకొండ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్‌ ప్రసాద్‌ కొన్ని రోజుల క్రితం ఎనుములపల్లికి చెందిన శ్రీరాములు ఇంట్లో అద్దెకు దిగారు. ఈ క్రమంలోనే శ్రీరాములు ఇంటి పత్రాలను తాకట్టు పెట్టుకుని 2.80 లక్షలు అప్పు ఇచ్చారు. డబ్బు తిరిగి చెల్లిస్తానని శ్రీరాములు చెప్పడంతో శనివారం ప్రసాద్‌ స్థానిక ఆర్టీసీ డిపో వద్దకు వచ్చారు. శ్రీరాములుకు ఇంటి పత్రాలు తిరిగిచ్చిన ప్రసాద్‌ ఆయన తీసుకొచ్చిన 2.80 లక్షలను తన స్కూటీలో పెట్టమని చెప్పి వేరే పనిలో నిమగ్నమయ్యారు. ప్రసాద్‌ స్కూటీనే అనుకుని శ్రీరాములు వేరే స్కూటీ డిక్కీలో నగదు పెట్టేశారు.

    ఇదీ చదవండి : పొలిటికల్ టర్న్ తీసుకుంటున్న గ్యాంగ్ రేప్.. హోం మంత్రి రాజీనామాకు డిమాండ్.. ముగ్గురి అరెస్ట్

    ఇంటికి వెళ్లాక డిక్కీని తెరిచిన ప్రసాద్‌కు నగదు కనిపించలేదు. దీంతో వెంటనే ఆయన పోలీసులను ఆశ్రయించారు. డిపో వద్ద సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పుట్టపర్తికి చెందిన రామచంద్రప్ప నాయుడు బైక్‌లో డబ్బు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పట్టణంలోని ఆయన నివాసం వద్దకు వెళ్లి 2.80 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుస్టేషన్‌లో ప్రసాద్‌కు నగదు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ, ఎస్సైలు గోపీనాథ్, వెంకటరమణ, పోలీసు సిబ్బందికి బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు