పొట్ట చేత పట్టుకుని.. బతుకు కోసం వలస వచ్చాడు.. పట్టణం కావడంతో బేకరీ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారం బాగానే సాగుతున్నా.. డబ్బుపై వ్యామోహం పెంచుకున్నాడు. తనకు ఇల్లు, దుకాణం అద్దెకు ఇఛ్చిన యజమాని కూతురినే వలలో వేసుకోవాలని చూసాడు. అనుకున్న ప్లాన్ సక్సెస్ కావడంతో పెళ్లి చేసుకున్నాడు. ఇంతలోనే చావు కబురు చల్లగా చెపుతూ.. తనకు గతంలోనే పెళ్ళైనట్లు చెప్పాడు. దింతో రెండో భార్య గొడవకు దిగింది. కానీ పెళ్లి చేసుకున్న పాపానికి కాపురం చేస్తూ వచ్చేది. ఆరు నెలల తరువాత అతడు రెండో భార్యను కూడా వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు. ఆరు నెలలు కాపురంపై మోజు తీరిపోయిందో ఏమో.. ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేశాడు.. కానీ అసలు విషయం బయటపడింది. ఇప్పుడు ఆ భర్త కోసం ఇద్దరు భార్యల కుటుంబాల వారు గొడవ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరి భార్యల పంచాయితి ఇప్పుడు పోలీస్ స్టేషన్ కు చేరింది.
మదనపల్లె పట్టణంలో నివాసం ఉంటున్న మేఘన ఉన్నత చదువులు చదివింది. కానీ తమిళనాడు నుంచి వలస వచ్చిన ప్రియుడు అంబురాజు మోసపూరిత మాటలకు మోసపోయింది. నువ్వే ప్రాణం అంటూ పెళ్లి చేసుకున్నాడు అంబురాజు. తీరా పెళ్లి అయ్యాక తనకు గతంలోనే పెళ్లయ్యిందంటూ రెండవ భార్య, వారి కుటుంబ సభ్యులు తెలిసింది. కానీ అప్పటికే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడంతో ఏమి చేయలేక భర్తను మన్నించి కాపురం చేస్తూ వచ్చింది మేఘన. ఈ క్రమంలో 6 నెలల మేఘన రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేసుకొనే స్థితికి వెళ్లిపోయింది. అనారోగ్య స్థితిలో ఉన్న భార్యను దూరం చేసుకొనే ప్రయత్నం చేసాడు అంబురాజు
ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అంబురాజు కనీసం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కూడా రాకపోవడంతో తల్లిదండ్రుల సహకారంతో డయాలసిస్ చేయించుకోవడం జరుగుతోంది. ఫోన్ కు స్పందించక ఫోగా ఆచూకీ కూడా దొరకకుండా అంబురాజు తిరుగుతున్నాడు. అంబురాజు మొదట భార్య నదియా ఇంటి వద్ద వున్నాడని తెలుసుకున్న మేఘన అక్కడకు చేరుకుంది. మొదటి భార్య ఇంటికి తాళం వేసి అంబురాజు లేడని చెప్పడంతో తల్లిదండ్రులతో కలిసి అక్కడే దర్నాకు దిగింది. అప్పటి వరకు ఇంట్లో ఉన్న అంబురాజు దొంగచాటుగా ఇంటి వెనుకుపోయి, ఆటోలో నిద్రపోతున్నట్లు నటించాడు. ఆరోగ్యం బాగలేని తన బాగోగులు చూసుకోవాలని మేఘన అంబురాజు ను కోరింది.
అంబురాజు ఇంటిముందు మేఘన, తల్లిదండ్రులతో కలిసి దర్నా కు దిగిన విషయం తెలుసుకున్న సిపిఎం శ్రీనివాసులు, ఐటియూసి క్రిష్ణమూర్తి మేఘనకు మద్దతుగా నిలిచారు. వారు సర్దుబాటు చేయాలని చూసిన మొదటి బార్య బందువులు గొడవ చేయడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అంబురాజును టూ టౌన్ పోలీసు స్టేషనుకు తరలించారు. డయాలసిస్ పేషెంట్ అనికూడా చూడకుండా నిరాదరణకు గురిచేస్తూ తన కుమార్తె దీన స్థితికి కారణమైన వ్వక్తిని కఠినంగా శిక్షించాలని బాదితురాలి తండ్రి సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chitoor, Telangana crime news