Andhra Pradesh: మహిమగల ఈ విగ్రహం మీ దగ్గర ఉంటే అదృష్టం వరించి నట్టే..! ఏంటి దీని స్పెషల్ తెలుసా..?

మహిమగల విగ్రహం అంటూ మోసాలు

రోజుకో కొత్త తరహా మోసం వెలుగులోకి వస్తూనే ఉంది. అమాయకుల నమ్మకమే వారికి పెట్టుబడిగా మారింది. తాజాగా నష్ట పోయే వ్యాపారులను గుర్తించి మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టైంది.

  • Share this:
    మీరు వ్యాపారంలో నష్టపోయారా? మా దగ్గర మహిమ గల విగ్రహం ఉంది. ఆ విగ్రహం పెట్టుకుంటే.. మీ రాత మారిపోతుంది. మీ కష్టాలు పారిపోతాయి. మీమీ వ్యాపారాలు పరుగులు పెడతాయి. కరోనాతో పాటు కష్టాలన్నీ తొలగిపోతాయి.. ఇలా మాయ మాటలు చెప్పి మోసం చేసే ముఠా గుట్టు తాజాగా రట్టైంది. విగ్రహాన్ని చూపించి.. వారికి నమ్మకం కలిగేలే నాలుగు మంచి మాటలు చెప్పి.. నమ్మిన వారి దగ్గర భారీగా డబ్బు గుంజి.. చివరికి నకిలీ విగ్రహాన్ని అంటగట్టేస్తున్నారు. ముఖ్యంగా వ్యాపారంలో నష్టాలు చవి చూసిన వారిని మాత్రమే టార్గెట్ గా చేస్తూ ఈ ముఠా మోసాలకు తెగబడింది. ఇప్పటికే పలువురి వ్యాపారులను మోసం చేసిన విగ్రహాల ముఠాని గుర్తించి గుట్టురట్టు చేసారు జిల్లా పోలీసులు. సాధారణంగా దైవ భక్తి ఎక్కువ ఉన్నవారు.. మహిమ గల విగ్రహాలు ఉంటాయని తెలుసుకుని వాటి గురించి ఆరా తీసే వారు ఎవరైనా ఉన్నారా అని అన్వేషిస్తారు. అలాంటి వారు కనిపిస్తే.. మొదట వారిని పండితులుగా.. లేదా నిపుణులుగా పరిచయం చేసుకుంటారు. ఫలా చోట మహిమగల విగ్రహం ఉందని.. కానీ అది అందరికీ ఇవ్వరని.. ఆ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచాలి అంటూ నమ్మిస్తారు. చివరికి వారితో ఓ నకిలీ విగ్రహాన్ని కొనేలా చేస్తారు. అలా వీరి చేతిలో మోసపోయిన ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠాకు సంకెళ్లు పడ్డాయి.

    ఈ ముఠాలో రాజనాల శ్రీనివాసరావు తో పాటు రొంగలి రామ సత్యం, పైడా వెంకట్ రావు, దివాకర్ కిరణ్ కుమార్, మరొక వ్యక్తి కలిపి ఐదుగురు సభ్యులు ఉన్నారు. ఈ
    టీంను లీడ్ చేసేది రాజనాల శ్రీనివాస్ రావు. ఈయన రొంగలి రామసత్యంతో కలిసి విజయనగరంలో గాయత్రి బోర్ వెల్స్ ని నిర్వహిస్తున్నారు. వీరి దగ్గర దివాకర్ పని
    చేస్తున్నాడు. రాజనాలకి పైడా వెంకట్ రావు స్నేహితుడు. ముఠా లీడర్ రాజనాలకి మహిమ గల విగ్రహాల పిచ్చి ఎక్కువ. అడ్డదారిలో అతి వేగంగా ధనవంతుడై
    పోవాలన్న అత్యాశ రాజనాలను మహిమ గల విగ్రహాల వైపు అన్వేషణ సాగేలా చేసింది. అలా ఆ పిచ్చిలో పడి, అత్యాశతో ఈస్ట్ ఇండియా పేరుతో ఉన్న ఒక పురాతన సిపాయి విగ్రహాన్ని
    కొనుగోలు కూడా చేసాడు. కానీ ఆ విగ్రహం తెచ్చుకున్న నాటి నుంచి వ్యాపారాల్లో మరిన్ని ఎక్కువ నష్టాలను రాజనాల చవి చూసాడట. దీంతో తను కొనుగోలు చేసిన రెండు వందల
    ఏళ్ల నాటి ఆ పురాతన విగ్రహాన్ని ఎవరికైనా అమ్మేయాలని ఆలోచన మొదలు పెట్టాడు. అందుకు తగ్గట్టుగా తన టీంను రెడీ చేసుకున్నాడు. తన స్నేహితుడు పైడా వెంకట్ రావును
    విగ్రహాల మహిమలు తెలిపే నిపుణుడిగా అవతారం ఎత్తించి అందరికీ పరిచయం చేయసాగాడు.

    ఆ క్రమంలో ఈ ముఠాకి మహిమ విగ్రహాల పిచ్చి కలిగిన నెల్లిమర్ల కి చెందిన కాళ్ళ మహేష్ అనే వ్యక్తి తారస పడ్డాడు. దీంతో ఆయన్ని ఎలాగో బురిడీ కొట్టించి మహిమ గల దేవతా విగ్రహం తమ ఉందని నమ్మించారు. మహేష్ వారి మాయ మాటలు నమ్మి దేవతా విగ్రహాన్ని 5 లక్షల రూపాయలకు కొనేందుకు సిద్ధపడ్డాడు. ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని ఈ ఏడాది మే నెల 27న 20 వేలు అడ్వాన్స్ కూడా చెల్లించాడు. ఇక అటు తర్వాత మిగిలిన మొత్తం సొమ్మును సిద్ధం చేసుకుంటే విగ్రహం ఇస్తామని నమ్మించారు. ఆ క్రమంలో ఈ నెల 10న కాళ్ళ మహేష్ కి వీరు ఫోన్ చేసి రమ్మని చెప్పి, అతడికి దేవతా విగ్రహం బదులు సిపాయి విగ్రహం అప్ప చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అందుకు అంగీకరించని మహేష్, తనకు మహిమ గల దేవతా విగ్రహమే కావాలని తెగేసి చెప్పి, తనను రాజనాల ముఠా మోసం చేస్తోందని భావించి పోలీసులకి పిర్యాదు చేసాడు.

    బాధితుడి మహేష్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన విజయనగరం రూరల్ పోలీసులు రెండు బృందాలుగా నిఘా పెట్టారు. మోసం చేసేందుకు ప్రయత్నించిన నలుగురు సభ్యుల ముఠాను, ఆ నకిలీ విగ్రహంతో సహా పోలీసులు అరెస్ట్ చేశారు. మరొక ముద్దాయి ప్రస్తుతానికి పరారీలో ఉన్నాడు. వారిపైన సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ముఠా గతంలోనూ మరికొందర్ని మోసం చేసినట్టు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కి తరలించారు. మొత్తానికి నకిలీ విగ్రహాలతో
    అమాయలను మోసం చేసేందుకు ప్రయత్నించిన ముఠాగుట్టును పోలీసులు రట్టు చేసారు.
    Published by:Nagesh Paina
    First published: