Home /News /crime /

ANDHRA PRADESH CRIME NEWS ONE EX ARMY FAMILE LOSS 60 LAKHS RUPEES WHO CHEATED LADY FAKE DOCTOR NGS GNT

Andhra Pradesh News: కిలాడీ డాక్టర్ మాయ మాటలతో రోడ్డున పడ్డ మాజీ జవాను కుటుంబం.. 60 లక్షలు మాయం

కిలేడీ డాక్టర్

కిలేడీ డాక్టర్

Andhra Pradesh Crime News: సైబర్ మోసాలు.. నమ్మి నట్టేట ముంచే కేటుగాళ్లు రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. నిరక్ష్య రాసులే కాదు.. ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా ఈ రోజుల్లో ఈజీగా మోసాలకు బలి అవుతున్నారు. తాజాగా మిలటరీ విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన కిలాడీ నకిలీ డాక్టర్ వ్యవహారం గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.

ఇంకా చదవండి ...
  Andhra Pradesh Crime News: మనిషి ఆశ ఎంత పనైనా చేయిస్తుంది. సులువుగా డబ్బు వస్తుందని ఆశించి జీవతాలు పాడు చేసుకున్న వారు ఎంతో మంది ఉన్నారు.. అయినా మోసాలు తగ్గడం లేదు.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మోసగాళ్లు కొత్త దారులు వెతుక్కొని మోసాలు (Cheating) చేస్తున్నారు. మిలటరీ విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన కిలాడీ నకిలీ డాక్టర్ (Fake Doctor) వ్యవహారం గుంటూరు జిల్లా (Guntur District)లో వెలుగు చూసింది. తాడేపల్లి ఇప్పటం కి చెందిన మిలటరీ ఉద్యోగి కార్తీక్ భార్యకు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఉద్యోగం మానేసి కొంతకాలం నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నారు. అయితే, పిజియోథెరపీ డాక్టర్ పేరుతో పరిచయమైన రోజా అనే మహిళ కార్తీక్ భార్యకు కొంతకాలం వైద్య సేవలు అందించింది. ఈ క్రమంలో కార్తిక్ కుటుంబ సభ్యులకు చాలా దగ్గరైంది. ఆ చనువును ఆసరాగా చేసుకున్న ఫిజియోథెరపిస్ట్ రోజా ఇదే అదునుగా భావించి.. తాను పెద్ద హాస్పిటల్ పెట్టబోతున్నామని, కోటిన్నర లోన్ వస్తుందని వారిని నమ్మబలికింది. అది నమ్మిన కార్తిక్ కుటుంబ సభ్యులు దాదాపు రూ. 60 లక్షల వరకు నగదు, పది లక్షల వరకు బంగారం, సొంత ఇంటి కాయితాలు సైతం తాకట్టు పెట్టి ఆమెకు డబ్బులు ఇచ్చారు. ఇంత చేసిన తరువాత ఆ ఫిజియోథెరపిస్ట్ తనకేం తెలియందూ బాంబ్ పేల్చింది. పైగా డబ్బులు ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పడమే కాకుండా ఎస్ఐ‌ని పెళ్లి చేసుకుని అతని అండతో రివర్స్ బెదిరింపులకు దిగింది. దాంతో బాధిత కుటుంబం రోడ్డున పడింది.

  డబ్బులు తీసుకుని కుటుంబాన్ని మోసం చేసిన మహిళ.. పెదకాకాని ఎస్ఐ వినోద్ కుమార్‌ను వివాహం చేసుకుంది. ఎస్ఐ వినోద్ అండతో ఆమె మరింత రెచ్చిపోయింది. బాధిత కుటుంబాన్ని మరింత వేధింపులకు గురి చేసింది. అంతేకాదు.. వారి డబ్బులు ఇవ్వకపోగా అప్పు చేస్తే ఇవ్వాల్సిన రూలేమీ లేదని, మీకు చేతనైంది చేసుకోండి అంటూ ఎస్ఐ వినోద్ కుమార్ బాధిత కుటుంబానికి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. సంపాదించిందంతా పోవడంతో తమ కుటుంబానికి ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు.

  ఇదీ చదవండి: వైద్యం కోసం ఎవరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ పనులు వేగవంతం చేయాలన్న సీఎం

  మిలటరీలో సేవలందించి దాచుకున్న డబ్బును మహిళ కాజేయడంతో పాటు ఎస్సై వినోద్ కుమార్ నుంచి బెదిరింపులు వస్తుండటంతో కార్తిక్ కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెళ్లికి ముందే ఎస్ఐతో ప్రేమలో ఉంటూ.. ఇద్దరూ కలిసి మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని అధికారులను కార్తీక్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

  ఇదీ చదవండి: ఏపీలో మందుబాబులకు షాక్.. కొత్త ఉత్తర్వులతో మద్యం ప్రియుల పరేషాన్

  దేశ సరిహద్దుల్లో రక్షణగా ఉన్న జవాన్ ఇప్పుడు న్యాయం కోసం ఎదురు చూపులు చూడాల్సి వచ్చింది. ప్రజలకు న్యాయం చేయాల్సిన ఎస్ఐ.. 420 ఆయన డాక్టర్ భార్యకు అండగా ఉండడంతో తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన డబ్బు తిరిగి అడిగితే సివిల్ కేసు అంటూ న్యాయస్థానంలో తేల్చుకోవాలంటూ బుకాయించిన ఎస్ ఐ వినోద్. ఇప్పటికే కిలాడి డాక్టర్ పై మంగళగిరి లో మూడు కేస్ లు? నమోదైనట్టు తెలుస్తోంది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Cheating case, Crime news, Gunturu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు