ANDHRA PRADESH CRIME NEWS ONE BIG CHAIN SNATCHER ARRESTED BY VIZIANAGARAM POLICE NGS VZM
AP Crime News: చైన్ స్నాచింగ్ లో ఆరి తేరిన దొంగను పట్టించిన బైక్.. అసలు ఏం జరిగిందంటే..?
చైన్ స్నాచర్ ను పట్టించిన బైక్
AP Crime News: అతడో పేరు మోసిన గజ దొంగ.. చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసిరాడు. కళ్లు మూసి తెరిచే లోపు చాకిచక్యంగా మహిళల మెడలో చైన్ లను తెంపేస్తాడు.. అలాంటి కరుడుగట్టిన చైన్ స్నాచర్ ను బైక్ పోలీసులకు పట్టించింది. బ్లూ బైక్ ఆధారంగా దొరికిన దొంగ..
AP Crime News: నడుచుకుని వెళ్తున్న మహిళలు.. లేద ఒంటరిగా ఉన్న మహిళలు కనిపించడమే పాపం.. క్షణాల్లో వారి మెడలో ఉన్న మెడలో బంగారు ఆభరణాలు (China snatching) మాయం చేస్తాడు. మెరుపు వేగంతో తెంపుకుపోతాడు. ఎక్కువగా నడుచుకుని వెళ్లే మహిళలు, అమ్మాయిలను టార్గెట్ చేస్తాడు. బైక్ (Bike) పై వెళ్లూ.. వరుస చోరీల (Theft)కు పాల్పడుతున్నాడు. తన బ్లూ కలర్ పల్సర్ బైక్ పై స్పీడ్ గా దూసుకుపోతూ.. చాకచక్యంగా చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతూ.. తప్పించు కుంటున్నాడు. విజయనగరం జిల్లా (Vizianagaram)గుర్ల మండలం చింతలపేట గ్రామానికి చెందిన 30 ఏళ్ల పతివాడ గోవిందరావు అనే వ్యక్తి.. స్ధానికంగా ఉన్న గ్యాస్ ఏజెన్సీ (Gas Agency) లో పనిచేస్తున్నాడు. అయితే ఈ పని చేస్తున్నా.. వస్తున్న జీతం డబ్బులు చాలకపోవడం, జల్సాలకు అలవాటు పడడంతో చైన్ స్నాచింగ్ లకు పాల్పడడం తన ప్రవ్ళత్తిగా మార్చుకున్నాడు. ఇలా వరుస చైన్ స్నాచింగ్ లకు, దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ గా మారాడు..
విజయనగరం పట్టణంలోని 1టౌన్, 2టౌన్ పోలీసు స్టేషన్ల పరిధిలో అక్టోబరు, నవంబరు మాసాల్లో 1టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని బాబామెట్ట, తెలుకల వీది, ఓరుగంటివారి వీది, హనుమాన్ నగర్, తోటపాలెం, శుభం ఫంక్షన్ హాలు దగ్గర వరుసగా పతివాడ గోవిందరావు చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డాడు.
వీటిపై వరుస ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ స్పెషల్ టీమ్ ను వేసి విచారణ చేసారు. చైన్ స్నాచింగ్ లు జరిగిన ప్రదేశాలను పరిశీలించి, నిందితుడ్ని పట్టుకొనేందుకు ఫిర్యాదుదారులను విచారించి, సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. విచారణలో నిందితుడు బ్లూ కలర్ పల్సర్ బైక్ మీద వచ్చి నేరాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు.
దీంతో బ్లూ కలర్ పల్సర్ బైకులను వినియోగిస్తున్న వారిపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, నిందితుడ్ని పట్టుకొనేందుకు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు.
ఇలా రెండు రోజుల క్రితం పట్టణంలోని కొత్త పేట నీళ్ళ ట్యాంకు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతుండగా, బ్లూ కలరు పల్సర్ బైకు మీద నెల్లిమర్ల నుండి విజయనగరం వైపు వస్తున్న ఒక వ్యక్తి పోలీసులు గమనించారు. పోలీసులను గమనించిన నిందితుడు తన బైక్ ను యూటర్న్ చేసుకొని పరారయ్యేందుకు ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వెంబడించి.. గోవిందరావును అదుపులోకి తీసుకొని విచారించారు. సీసీ ఫుటేజ్ ల ద్వారా గోవిందరావును ఈ చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా పోలీసులు తేల్చారు.
నెల్లిమర్ల గ్యాస్ ఏజన్సీలో పని చేస్తున్నట్లు, చెడు వ్యసనాలకు అలవాటుపడి, మహిళలను లక్ష్యంగా చేసుకొని, నిర్జన ప్రదేశాల్లో మాటువేసి, వారి మెడలో చైన్లు తెంచుకొని పారిపోతున్నట్టుగా ఒప్పుకున్నాడు. ఇటీవల అతడు చేసిన చైన్ స్నాచింగ్ ల్లో సుమారు 10 తులాల బంగారు ఆభరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండుకు తరలిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. ఈ కేసులో నిందితుడ్ని అరెస్టు
చేయడం, ఆభరణాలను రికవరీ చేయడంలో క్రియాశీలకంగా పని చేసిన 2 టౌన్ పోలీసులను అభినందించి, ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ దీపిక అందజేసారు.
ఎన్ని నేరాలకు పాల్పడినా.. ఏదో ఒక తప్పు చేయడం ద్వారా నిందితులు దొరకడం జరుగుతుందని, ఈ కేసులో సీసీ ఫుటేజీలను పరిశీలించడం ద్వారా ..తన పల్సర్ బైక్ నే అన్ని నేరాలకు వాడుతున్నాడన్న ఒక్క ఆధారంతో నిందితుడిని అరెస్ట్ చేయగలిగామన్నారు. ఏ బైక్ మీదైతే వెళ్తూ చైన్ స్నాచింగ్ నేరాలకు పాల్పడుతున్నాడో.. ఆ బైకే అతడిని పట్టించింది. నిందితుడు పోలీసుల కంటపడి ..పారిపోతూ చివరకు దొరికిపోయి ఊచలు లెక్కపెడుతున్నాడు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.