హోమ్ /వార్తలు /క్రైమ్ /

Recording Dances: భక్తి పేరుతో రక్తి.. వన భోజనాలు అంటూ అశ్లీల నృత్యాలు.. పాఠశాల పూర్వ విద్యార్థుల నిర్వాకం

Recording Dances: భక్తి పేరుతో రక్తి.. వన భోజనాలు అంటూ అశ్లీల నృత్యాలు.. పాఠశాల పూర్వ విద్యార్థుల నిర్వాకం

వన భోజనాల పేరుతో రికార్డింగ్ డ్యాన్స్

వన భోజనాల పేరుతో రికార్డింగ్ డ్యాన్స్

Recording Dances: కార్తీక మాసాన్ని హిందువులు అందరూ చాలా పవిత్రంగా భావిస్తారు. శివుడి నామం జపిస్తూ పుణ్యం దక్కాలని కోరుకుంటారు. సోమవారం సోమవారం కొందరు ఆలయాలకు వెళ్లి.. దేవుడిని దర్శించుకుని శక్తి మేరకు పూజలు, ఉపవాసాలు చేస్తారు. కొందరైతే కార్తీక మాసంలో పుణ్యానికి తోడు కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదగా గడపవచ్చని వన భోజనలకు వెళ్తారు.. కానీ ఆ పేరుతో కొందరు అశ్లీల నృత్యాలు వేయించడం కలకలం రేపింది.

ఇంకా చదవండి ...

  Recording Dances:  కార్తీక మాసాన్ని హిందువులు ఎంత పవిత్రంగా పూజిస్తారో.. అంత ఎంజాయ్ కూడా చేస్తారు. ముఖ్యంగా పిక్ నిక్ లు.. తీర్థయాత్రలు.. వనభోజనాలు అంటూ సందడిగా.. సరదాగా గడపాలని చాలా మంది కోరుకుంటారు. కార్తీక మాసం (Kartika masam)లో ఆలయాల ప్రదర్శనకు వెళ్లడం.. అభిషేకాలు, పూజలు చేయడం ఎంత కామనో.. వన భోజనాలకు వెళ్లడం కూడా అంతే కామన్. కొందరు కుటుంబ సభ్యులతో వెళ్తే.. మరికొందరు స్నేహితులతో వెళ్తారు. ఇక కుల సంఘాలు, అపార్ట్ మెంట్ వాసులు ఇలా.. ఎవరు వీలు బట్టి వాళ్లు వన భోజనాలకు వెళ్తుంటారు. ఈ వన భోజనాలు కూడా భక్తి శ్రద్ధలతోనే చేయాలి.. ఏదైనా ఉసిరి చెట్టు కింద పూజ చేసి.. తరువాత వన భోజనాలు చేస్తారు. దానికి తోడు అందరూ కలిసి సరదగా ఎంజాయ్ చేయడానికి ఆట పాటలుకూడా ఉంటాయి. ఇంత వరకు అంతా కామన్.. కానీ కొంతమంది ఈ కార్తీక వన భోజనాల పేరుతో అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశారు. కార్తీక మాసం అంటే ఓం నమశ్శివాయ అంటూ దేవుడిని తలచుకోవాల్సిన చోట ఇలా అపచారానికి నాంధి పలికారు. అది కూడా వీటిని ఏర్పాటు చేసింది కూడా స్కూల్ పూర్వ విద్యార్థుల బ్యాచ్ కావడం విశేషం.

  తూర్పు గోదావరి జిల్లా  (East Godavari District)అనపర్తిలోని నల్లమిల్లి రామారెడ్డి జిల్లా పరిషత్ హైస్కూల్ పూర్వ విద్యార్థులు.. వన భోజనాలను ఏర్పాటు చేశారు. ఇక్కడి వరకు ఒకే కాదు.. వన భోజనాల్లో భక్తి శ్రద్దలు చూపించాల్సి వారంతా.. ఎంటర్ టైన్మెంట్ కు ఓటేశారు. అది కూడా అక్కడికి వెళ్లి.. అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయించారు. దీంతో పూర్వ విద్యార్థుల తీరుపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. పూర్వ విద్యార్థులై ఉండి.. పెద్దలు, మహిళలు కూడా వన భోజనాలకు వచ్చారన్న సంగతి మరిచి ఇలా రికార్డింగ్ డ్యాన్స్ లు వేయించడం అది కూడా అశ్లీలంగా ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు దారిస్తోంది.

  ఇదీ చదవండి : రహదారుల మరమ్మత్తులపై ఫోకస్.. అధికారులకు డెడ్ లైన్ పెట్టిన సీఎం జగన్

  ఇంత జరుగుతోంది అని తెలిసినా పోలీసులు పట్టించుకకోపడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్తీక వనభోజనాలు.. పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు. జాతర్లు పేరు ఏదైనా రాజకీయ అండ .. పోలీసులు దన్ను ఉండడంతో అశ్లీల ప్రదర్శనలు సాగుతుండడం సభ్య సమాజంలో సిగ్గుపడేలా చేస్తుంది. నల్లమిల్లి రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ చెందిన 1996- 97 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటి పేరుతో తోటలో అశ్లీల ప్రదర్శనలు బహిరంగంగా నిర్వహించారు.స

  ఇదీ చదవండి : టీడీపీకి బూస్ట్ ఇచ్చిన అమిత్ షా వ్యాఖ్యలు.. ఏపీలో బీజేపీ స్ట్రాటజీ ఇదే

  వనభోజనాలకు వచ్చిన పెద్దలను, సిగ్గుపడేలా చేయడాన్ని నిర్వాహకుల తీరును ఖండించారు. కానీ పోలీసులు ఎలాంటి చర్యలు లేకుండా ఉదాసీనంగా ఉండి పోయినట్లు పలువురు పోలీసులు తీరును ఎండగట్టారు. ఇదే ప్రదర్శనలు రాజకీయ పలుకుబడి లేకుండా ఎవరైనా సామాన్యులు చేస్తే వారిపై విరుచుకు పడే పోలీసులు.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు. సరదాగా ఉత్సాహంగా గడిపే వన భోజన కార్యక్రమంలో ఇలాంటి దృశ్యాలను చూసిన పలువురు నోరెళ్లబెట్టారు. పూర్వ విద్యార్థులు ఇలాంటి నృత్యాలు చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, East Godavari Dist

  ఉత్తమ కథలు