ANDHRA PRADESH CRIME NEWS NEWLY MARRIED BUT HUSBAND DIED IN A ROAD ACCIDENT IN VIZIANAGARAM NGS VZM
Road Accident: ఆరు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు.. ఇంతలోనే ఊహించని విషాదం
ఇంటికి వచ్చిన ఆరు రోజులకే..
Raod Accident: భార్య పిల్లను చూసేందుకు ఆరు రోజుల క్రితమే ఇంటికి వచ్చాడు ఓ జవాను.. కొన్ని రోజులు ఉండి తిరిగి విధుల్లో చేరాలి అనుకున్నాడు.. కానీ ఇంతలోనే ఊహించని ఘటన వారి కుటుంబంలో పెను విషాదం నింపింది.
Raod Accident: ఆంధ్రప్రదేశ్ లో ఓ రోడ్డు ప్రమాదం పెను విషాదం నింపింది. విజయనగరం జిల్లాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం లో ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. జాతీయ రహదారి 26పై వెళ్తున్న సమయంలో బొండపల్లి మండలం గొట్లాం సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో ఆర్మీ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అతడు కేవలం ఆరు రోజుల క్రితమే కుటుంబ కోసం సెలవుపై ఇంటికి వచ్చాడు.. కొన్ని రోజులు ఉండే తిరిగి ఆర్మీలో చేరాలి అనుకున్నాడు... కానీ ఇంతలోనే ఊహించని విషాదం అతడి జీవితాన్ని అర్థాంతరంగా ముగించేసింది..
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నెల్లిమర్ల మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన 30 ఏళ్ల త్రినాథరావు జమ్మూ కాశ్మీర్లో కొన్నేళ్లుగా ఆర్మీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. 2018లో తన అక్క కూతురు కీర్తీతో త్రినాథరావుకు వివాహం జరిగింది. ఇక ఆరు రోజుల క్రితం సెలవులపై సొంతూరుకు వచ్చారు త్రినాథరావు.
ఈ నేపథ్యంలోనే సోమవారం తెల్లవారు జామున బైక్పై విజయనగరం నుంచి గజపతినగరం వైపు వస్తుండగా గొట్లాంకు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో త్రినాథరావు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరగడాన్ని గుర్తించిన తోటి ప్రయాణికులు 108 కి ఫోన్ చేసి సమాచారం అందించారు.
108 సిబ్బంది అంబులెన్స్ లో బొండపల్లి స్ధానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్ధానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు బొండపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆర్.వాసుదేవ్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వివరించారు.
ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న దేశ సైనికుడు.. అది కూడా ఎంతో దేశ భక్తి ఉన్న వాడిగా చిన్నప్పటి నుంచి గ్రామంలో గుర్తింపు పొందాడు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో ఉండేవాడని వారంతా అతని నిబద్ధతను గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గాంధీ నగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఎంతో భవిష్యత్తు ఉన్న ఆర్మీ ఉద్యోగి ఇలా ప్రమాదం జరిగి మృతి చెందడంతో తన సొంత గ్రామం అయిన నెల్లిమర్ల గాంధీ నగర్ కాలనీలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడేళ్ల క్రితమే పెళ్లి అయ్యి, తన భర్తను కోల్పోవడంతో ఆర్మీ ఉద్యోగి త్రినాథరావు భార్య కీర్తి రోదిస్తోంది. తన కుటుంబం ఒంటరిగా మిగిలిపోయిందని విలపిస్తోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.