Kidnapping Batch: దేవుడి సేవ పేరుతో సన్యాసులు కాలనీల్లో తిరుగుతున్నారా? అప్రమత్తంగా ఉండండి.. చదువుతున్న అమ్మాయిలు ఉంటే బీకేర్ ఫుల్..

బాలికల కిడ్నాప్ కు ప్రయత్నం

Becarefull: మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా.. అయితే చాలా జాగ్రత్తగా ఉండండి.. పిల్లల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ లో ఏ రూపంలోనైనా తిరుగుతూ ఉండొచ్చు.. ముఖ్యంగా దేవుడి పేరుతో వీధి వీధిలో బిక్షాటన చేసే వారిపై ఓ కన్నేసి ఉంచాల్సిందే..

  • Share this:
    monks-attempted-kidnapping: ఇంట్లో స్కూల్ చదివే పిల్లలు ఉంటే.. చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎవరినీ నమ్మి పోసవద్దు.. ఎందుకంటే బాలికలను కిడ్నాప్ (Students Kidnap) చేసే గ్యాంగ్ వివిధ రూపాల్లో మీ చుట్టూ తిరుగుతుంటారు. ముఖ్యంగా సాయిబాబా (Lord Saibaba) పేరుతో ఆటోళ్లో తిరిగే సన్యాసులు.. దేవుడి సేవ పేరుతో వచ్చినా.. ఇంట్లో వస్తువులు రిపేర్ల పేరుతో.. తక్కువ ధరకే వస్తువులు అమ్ముతాం ఇలా వివిధ రూపాల్లో వచ్చి కిడ్నాప్ చేసే ముఠాలు (Kidnap gangs) పెరిగాయి. పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుండడం.. మీడియా వార్తలు రావడంతో చాలావరకు అందరూ అప్రమత్తమవుతున్నారు. దీంతో కిడ్నాప్ గ్యాంగ్ లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నాయి. పోలీసుల కళ్లుగప్పి  కొత్త కొత్త గెటప్ లు వేస్తూ.. కిడ్నాప్ లకు పాల్పడుతున్నారు. తాజాగా పాఠశాలకు వెళుతోన్న ఇద్దరు బాలికలను సన్యాసి వేషంలో ఆటోలో భిక్షాటనకు వచ్చిన కొందరు అటకాయించి కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు.

    ఎక్కడ జరిగింది అంటే..
    పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఊటపల్లికి చెందిన ఇద్దరు బాలికలు మెరకముడిదాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. గురువారం ఉదయం సైకిళ్లపై పాఠశాలకు బయలుదేరారు. గాదెల మర్రివలస కూడలి వద్దకు వచ్చేసరికి అక్కడ సన్యాసి వేషాల్లో ఉన్న కొందరు వీరిని అడ్డగించే యత్నం చేశారు. బాలికలు కాస్త వేగంగా సైకిళ్లు తొక్కడంతో కొద్ది దూరం వెంబడించారు. అదే సమయంలో ప్రయాణికులతో కూడిన ఆటో అటువైపుగా రావడాన్ని గమనించిన సన్యాసులు వెనుదిరిగారు.

    ఇదీ చదవండి: దేవుడ్ని చూడడమే లక్ష్యం.. 70 ఏళ్లుగా అడవిలోనే ఆవాసం.. కర్పూరమే ఆహారం.

    పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆటో
    బాలికలు వేగంగా మెరకముడిదాం చేరుకుని విషయాన్ని స్థానికులకు తెలిపారు. మెరకముడిదాం, ఊటపల్లి వాసులు అప్రమత్తమై మెరకముడిదాంకు సమీపంలో సన్యాసులను పట్టుకుని బుదరాయవలస పోలీసులకు అప్పగించారు. రెండు ఆటోలతో పాటు 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.

    ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలు.. మంచి జీవితం.. కానీ ప్రియుడి కోసం వెళ్లిపోయింది.. తిరిగి వచ్చింది కానీ..

    ముఠా ఎక్కడ నుంచి వచ్చిదంటే....?
    ఈ కిడ్నాప్ గ్యాంగ్ సభ్యులను మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ఏడాది కిందట పార్వతీపురానికి చేరుకున్న వీరు కొన్నాళ్లు తగరపువలసలోను, 3 రోజుల కిందట బాడంగి వచ్చి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు ఆడపిల్లలు, ఐదుగురు మగవారు ఉన్నారు. వీరి ఆధార్‌ కార్డులను పరిశీలించగా వీరిపై గతంలో ఎలాంటి కేసులు లేవని, విచారిస్తున్నామని, కిడ్నాప్‌కు ప్రయత్నించినట్టు తేలితే కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ సీహెచ్‌ నవీన్‌ పడాల్‌ తెలిపారు.
    Published by:Nagesh Paina
    First published: