ANDHRA PRADESH CRIME NEWS MINOR GIRL RAPED BY SOME GANG IN CM JAGAN OWN DISTRICT NGS
AP Crime News: సీఎం జగన్ సొంత జిల్లాలో దారుణం.. బాలికపై పది మంది పలు మార్లు అత్యాచారం..
ప్రతీకాత్మకచిత్రం
AP Crime News: ఆంధ్రప్రదేశ్ లో అమ్మాయిలకు రక్షణ లేదా..? పసి పిల్లలను కూడా వదలరా..? ఎది కూడా ఎక్కడో కాదు.. సీఎం జగన్ సొంత జిల్లాల్లో దారుణ కలకలం రేపింది. ఓ బాలికపై పదిమంది పలుమార్లు అత్యాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయినా కేసు నమోదు కాకపోవడం అమానుషం..
Minor Girl Rape: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోజు రోజుకూ నేరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు.. మహిళలు, చిన్నారులకు కూడా రక్షణ కరువవుతోంది. నిత్యం ఎక్కడో ఒక దగ్గర అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. అది కూడా చిన్న పిలల్లు, మైనర్లపై గ్యాంగ్ (Minore Rape) రేపులు భయపడేలా చేస్తున్నాయి. తమ కోరికలు తీర్చుకోవడానికి మైనర్ల పట్ల పశువుల్లా ప్రవర్తిస్తున్నారు కొందరు. ఆశలు చూపిస్తున్నారు లేదంటే మాయ మాటలు చెబుతున్నారు. అప్పటికీ కుదరకపోతే బెదిరింపులకు పాల్పడుతున్నారు.. విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో పెద్ద మనుషుల్లా చలమాణి అయిపోతున్నారు. ఆఖరికి ఆ మైనర్లు గర్భం (Minor Pregnant) దాలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తోంది. దిశ (Disha)లాంటి చట్టాలు చేసినా.. పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా.. ఇలాంటి ఘటనలు ఆగడం లేదు. అదగి కూడా ఎక్కడో కాదు..స్వయంగా సీఎం జగన్ (CM Jagan) సొంత జిల్లాలో వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
వైఎస్ఆర్ కడప జిల్లా (Kadap District) ప్రొద్దుటూరులో ఈ దారుణం చోటుచేసుకుంది. బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఎస్సీ మైనర్ బాలికపై పది మంది పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ అమానుష వ్యవహారం.. బాలిక గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి చూసింది. స్థానికుల సమాచారం మేరకు.. ప్రొద్దుటూరుకు చెందిన ఓ మైనర్ బాలిక.. స్థానికంగా ఓ మసీదు దగ్గర ఆశ్రయం తీసుకోంటోంది.
బాలికకు తల్లి లేదు.. తండ్రి ప్రొద్దుటూరులోనే మరొక ప్రాంతంలో బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మసీదు సమీపంలోని ఓ డెకరేషన్ దుకాణంలో పనిచేస్తున్న చెంబు అనే యువకుడి కన్ను బాలికపై పడింది. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇటీవల కూలదోసిన మార్కెట్ దగ్గర నుంచి బాలికను ఆటోలో తీసుకెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది.
ఆమె గర్భం దాల్చిందని తెలుసుకున్న స్థానికులు.. వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈక్రమంలో గ్రామ సచివాలయ మహిళా కానిస్టేబుల్.. బాలికతో ఏకాంతంగా మాట్లాడి ఏం జరిగింది అన్నదానిపై ఆరా తీశారు. చెంబు అనే యువకుడితో పాటు అతని స్నేహితులు 10 మంది తనపై అత్యాచారం చేసినట్లు బాలిక కన్నీటి పర్యంతమై చెప్పింది. నొప్పి బరించలేను అని చెప్పినా.. తనపై అత్యాచారంర చేశారంటూ విలపించింది. వాళ్ల ప్రవర్తనతో గట్టిగా ఏడ్చేదాన్ని అని అయినా ఎవరూ పట్టించుకునే వారు కాదని పోలీసులకు ఆవేదన తెలిపింది.
ఆ బాలిక చెప్పిన మాటలను వీడియో రికార్డు చేసిన ఎంఎస్కే యధాతధంగా ఆ వీడియోను వన్ టౌన్ పోలీసులకు అందించింది. అయితే ఈ ఘటన బయటకు పొక్కకుండా బాధితురాలిని మరొకచోటకి తరలించాలని వన్ టౌన్ పోలీసులు స్థానిక ఎంఎస్కేలకు ఆదేశించారని, బాధ్యులపై కేసు కూడా నమోదు చేయలేదన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్ టౌన్ పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిండు గర్భిణీ అయిన బాలిక ప్రస్తుతం మైలవరంలో ఓ ప్రైవేట్ స్వచ్చంద సంతలో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. అయితే ఇంత దారుణానికి ఒడిగట్టిన భాద్యులపై పోలీసు సిబ్బంది కేసులు కూడా నమోదు చేయకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు..ఘటనపై వివరణ కోరారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.