Home /News /crime /

ANDHRA PRADESH CRIME NEWS LOW PRICE BRANDED SMART PHONE POLICE FOUND THEY ALL ARE THEFTED PHONES NGS

Low Price Smartphones: సగం ధరకే కొత్త బ్రాండెడ్ సెల్‌ఫోన్లు.. ఎగబడ్డ జనం.. ఆ తరువాత షాక్..

low price branded smart phones

low price branded smart phones

Low Price Smartphones: పది వేల రూపాయల స్మార్ట్ ఫోన్ ధర.. కేవలం 5 వేల రూపాయలే.. అది కూడా కొత్తది బ్రాండెడ్ ఫోన్.. ఆఫర్ టెప్టింట్ గా ఉండడంతో ఆ ఫోన్ లను కోనేందుకు జనం ఎగబడ్డారు.. అయితే అనుమానం వచ్చిన పోలీసులు అంత తక్కువ ధరకు ఫోన్ ఎలా అమ్ముతున్నారని తెలిసి.. ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇంకా చదవండి ...
  Cell Phones Theft:  ఓ వైపు కార్తీక మాసం (Kartika masam).. పండగల సీజన్.. ఇప్పటికే దీపావళి ఆఫర్లు (Diwali offers) ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆన్ లైన్ లో అయితే ఆఫర్ల వర్షమే కురుస్తోంది. అతి చౌక ధరలు అంటా అందరూ ప్రకటనలో ఊదర గొడుతున్నారు. ఇక నెల్లూరు జిల్లా (Nellore District)లో అయితే బహిరంగా మార్కెట్ లో సెల్ ఫోన్ల ఆఫర్లు అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి. 20 వేల బ్రాండెడ్ ఫోన్ 10 వేల రూపాయలకే.. పది వేల రూపాయల ఫోన్ ఐదు వేల రూపాయలకే అంటూ బహిరంగంగా ఫోన్లను అమ్మకాలకు పెట్టారు. మౌత్ పబ్లిసిటీతో విషయం తెలుసుకున్న వినియోగ దారులంతా అక్కడకు క్యూ కట్టారు. తమకు నచ్చిన బ్రాండెండ్ ఫోన్లను (Branded Phones) కొనుకున్నారు. అంత తక్కువ ధరకు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ లు అంటే ఎవరు వద్దంటారు.. అందుకే జనం భారీగా ఎగబడ్డారు. అయితే బిల్లు అడిగితే మాత్రం ఏదో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదులు అందడంతో.. వారి విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..

  నెల్లూరు జిల్లాలో ఇటీవల ఓ ముఠా గ్రామాల్లో తిరుగుతూ అతి తక్కువ ధరకే సెల్ ఫోన్లు విక్రయించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కొద్ది రోజులుగా ఈ ముఠా గుట్టు చప్పుడు కాకుండా గూడూరు ప్రాంతంలోని గ్రామాల్లో ఈ బిజినెస్ చేస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో సెల్ ఫోన్ విక్రయ ముఠాపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు.
  గూడురులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడుకి చెందిన మేకల కృష్ణ, మేకల పవన్ గా గుర్తించారు. వారి నుంచి సుమారు 220కు పైగా స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.

  ఇదీ చదవండి : లాహిరి లాహిరి లాహిరిలో.. పాపికోండల టూర్ కు సూపర్ క్రేజ్.. కార్తీక మాసంలో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు

  బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో సెల్ ఫోన్లు చోరీ చేయడం వీరి పని.. అలా కొట్టేసిన ఫోన్లను ఏ ప్రాంతంలో కొట్టేసి.. అక్కడే అమ్మితే దొరికిపోతారనే భయంతో.. చెన్నైలో సెల్ ఫోన్లు కొట్టేయడం పనిగా పెట్టుకున్నారు. చెన్నైలోని రద్దీ ప్రాంతాల్లో ఫోన్లు దొంగిలించి ఏపీలో అమ్ముతున్నారు. కొట్టేసిన ఫోన్లను ఫార్మెట్ చేసి, కొత్త ఫోన్లలా పల్లెటూళ్లలో సగం రేటుకే అమ్మేస్తున్నారు. గూడూరు పోలీసులు చాకచక్యంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలుగురు సభ్యుల ముఠా దొంగ సెల్ ఫోన్లను విక్రయిస్తున్నట్లు తేల్చారు. పరారీలో ఉన్న మరో ఇద్దర్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు.

  ఇదీ చదవండి : నీట మునిగిన ఆ రెండు జిల్లాలు.. మరో మూడు రోజుల పాటు వానలే వానలు.. ఈ ప్రాంతాల్లో అప్రమత్తం
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Nellore Dist, Smartphones

  తదుపరి వార్తలు