హోమ్ /వార్తలు /క్రైమ్ /

Gun Firing: అక్రమ సంబంధమా..? రియల్ ఎస్టేట్ గొడవలా..? కాల్పులకు కారణం అదేనా..?

Gun Firing: అక్రమ సంబంధమా..? రియల్ ఎస్టేట్ గొడవలా..? కాల్పులకు కారణం అదేనా..?

శ్రీకాకుళంలో కాల్పుల కలకలానికి కారణం ఇదే..

శ్రీకాకుళంలో కాల్పుల కలకలానికి కారణం ఇదే..

Gun Firing: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల గన్ కల్చర్ పెరిగిపోతోంది. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఓ సర్చంచ్ పై కాల్పులకు తెగబడ్డారు దుండగులు.. ఈ దాడి వెనుక ఓ మహిళ ఉన్నట్టు అనుమానం.. అయితే ఈ దాడికి కారణాలు ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

Gun Firing in Srikakulam:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో గన్ కల్చర్ రోజు రోజుకూ పెరుగుతోంది. చిన్న చిన్న గొడవలకు సైతం తుపాకీలు వాడుతున్నారు. కొందరు. తాజాగా  శ్రీకాకుళం జిల్లా (Srikakulam district)లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. గార మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన సర్పంచ్ వెంకటరమణ మూర్తిపై అర్ధ రాత్రి కాల్పులు జరిగాయి. అది కూడా ఓ మహిళతో మాట్లాడుతున్న సమయంలో మహిళతో పాటే వచ్చిన దుండగులు కాల్పులు జరిపి హత్య  (Murder)చేసేందుకు ప్రయత్నించారు. అద్ళష్టవశాత్తు బుల్లెట్లు పొట్టకు రాసుకుంటూ వెళ్లిపోవడంతో సర్పంచ్ కు ప్రమాదం తప్పింది.  అకస్మాత్తుగా దాడికి దిగిన దుండగులు.. సర్పంచ్ మరణించాడని భావించి అక్కడి నుండి పరారయ్యారు. కొన్నాళ్లుగా మహిళకు, సర్పంచ్ వెంకటరమణ మూర్తికి మధ్య ఉన్న అక్రమ సంబంధం (Extra Marital Affair ), రియల్ ఎస్టేట్ వ్యాపారం (Real Estate Business)లో జరుగుతున్న గొడవలే కాల్పులకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

శ్రీకాకుళం పట్టణంలోని పాత ఆర్డీవో కార్యాలయం సమీపంలోని రామచంద్రపురం సర్పంచ్ గోలివి వెంకట రమణమూర్తికి చెందిన కార్యాలయంనే అతడిపై తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేసేందుకు ప్రయత్నించారు. అద్ళష్టవశాత్తు స్పల్ప గాయాలతో సర్పంచ్ వెంకటరమణ బయటపడ్డారు.  వెంకటరమణ మూర్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మధురా నగర్ లోని సర్పంచ్ వెంకట రమణమూర్తి కి చెందిన కార్యాలయానికి ఆదివారం పేటకు చెందిన షాలిని అనే మహిళ వెళ్లింది. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా సదరు ఆ మహిళ సర్పంచ్ దగ్గరకు తీసుకెళ్లింది. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత మహిళతో సహా వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెంకటరమణ మూర్తిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి హత్యాయత్నం చేసారు.

ఇదీ చదవండి : షార్ లో మరోసారి కరోనా కలకలం.. 200 మందికి నిర్ధారణ

ఈ కాల్పుల్లో రెండు బుల్లెట్లు వెంకటరమణ మూర్తి పొట్టను చీల్చుకుంటూ వెళ్లాయి. స్పల్ప గాయాలతో వెంకట రమణ మూర్తి అక్కడే పడిపోగా .. షాలిని అనే మహిళ సహా ఇద్దరు నిందితులు అక్కడినుండి పరారయ్యారు. స్వల్ప గాయాలతో తప్పించుకున్న సర్పంచ్ వెంకటరమణ ను .. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రిమ్స్ లో చికిత్స తరువాత తెల్లవారుజామున డిశ్చార్జ్ అయ్యారు. కాల్పుల ఘటన సమాచారం అందుకున్న శ్రీకాకుళం వన్ టౌన్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ దాడికి కారణాలు పూర్తిగా తెలియకపోయినా.. సర్పంచ్ కు, ఘటనా స్ధలంలో ఉన్న మహిళకు మధ్య ఉన్న అక్రమ సంబంధం, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పాత గొడవలే కారణమని భావిస్తున్నారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో పోలీసులకు రెండు బుల్లెట్లు లభ్యమయ్యాయి. డీఎస్పీ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ వేలిముద్రలను (Finger prints) సేకరించారు. సేకరించారు.

ఇదీ చదవండి : మంత్రి కొడాలి నానిని అభినందిస్తూ వర్మ ట్వీట్.. గుడివాడ మరో గోవా అంటూ పొగడ్తలు

శ్రీకాకుళం డీఎస్పీ మహేంధ్ర మాట్లాడుతూ..  షాలినీ అనే మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ప్రమేయం ఉన్నట్లు ప్రాధమికంగా గుర్తించామని, ఈ ఘటనపై వివిధ కొణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇద్దరి మధ్య ఉన్న ఇల్లీగల్ ఎఫైర్ కూడా ఒక కారణంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, Crime news, Srikakulam

ఉత్తమ కథలు