Home /News /crime /

Crime News: కరోనా కష్టాలతో వ్యాపారంలో నష్టం వచ్చిందని రూటు మార్చారు.. చివరకు ఏం చేశారంటే..?

Crime News: కరోనా కష్టాలతో వ్యాపారంలో నష్టం వచ్చిందని రూటు మార్చారు.. చివరకు ఏం చేశారంటే..?

దొంగలుగా మారిన వ్యాపారులు

దొంగలుగా మారిన వ్యాపారులు

AP Crime News: వారంత వ్యాపారస్తులు.. కొన్ని రోజుల పాటు బాగానే వ్యాపారం చేసేవారు. కానీ పరిస్థితులు అనుకూలించక.. నష్టాలు వచ్చాయి. దీంతో వాటి నుంచి బయటపడేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. కానీ చివరికి ఏం జరిగింది అంటే..?

  Andhra Pradesh Crime News:  శ్రీకాకుళం జిల్లా (Srikakulam Disrtict) ఇచ్చాపురంలో నలుగురు వ్యక్తులు ఇటుకల వ్యాపారం చేసేవారు. కరోనా ఎఫెక్ట్.. లాక్ డౌన్ కారణంగా  పనులన్నీ నిలిచిపోవడంతో.. ఇటుకల వ్యాపారంలో నష్టాలపాలయ్యారు. చివరకు లక్షల రూపాయలు అప్పుల పాలై.. చివరికి మరో మార్గాన్ని ఎంచుకున్నారు.  దొంగలుగా (thieves) మారాలని నిర్ణయించుకున్నారు.  ఆ వెంటనే బడా వ్యాపారుల ఇళ్లను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఒకే ఒక్క చోరీతో సెటిల్ అయిపోదామని భావించి శ్రీకాకుళం జిల్లాలో భారీ చోరీకి పాల్పడ్డారు. చివరకు పాపం పండి పోలీసుల (Police) కంటికి చిక్కి ఊచలు లెక్కపెడుతున్నారు.

  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో మూడు వారాల కిందట జరిగిన భారీ చోరీని పోలీసులు ఛేదించారు. దొంగల నుండి చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను  (Gold and silver ornaments)స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ  కేసు విచాణలో  నలుగురు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు తేల్చి.. సరిగ్గా మూడు వారాల తర్వాత అరెస్ట్ చేసి.. వారి నుంచి చోరీ సొత్తును రికవరీ చేశారు.

  ఇదీ చదవండి : వాహనదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. ఎందుకో తెలుసా..?

  ఇచ్ఛాపురం పట్టణం చక్రపాణి వీధిలో మల్లెడి రామిరెడ్డి అనే వ్యాపారి  నివాసముంటున్నారు. గత నెల 17న రామిరెడ్డి అనారోగ్యానికి గురికావడంతో స్వస్థలం అనపర్తి (తూర్పుగోదావరి జిల్లా) వెళ్లారు. అక్కడ చికిత్సపొందుతూ అదే నెల 27న మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి అనపర్తి వెళ్లిపోయారు. ఇంటికి తాళం వేసి వుండడం, వ్యాపారి కుటుంబం ఇంట్లో లేరన్న విషయాన్ని గమనించిన నలుగురు దుండగులు పక్కా స్కెచ్ వేసారు. మరుసటి రోజు 28న అర్ధరాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న బంగారం, వెండి దోచుకుపోయారు.

  ఇదీ చదవండి : ఫుడ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. అక్కడ బిర్యానీ ఫ్రీ.. రెండు కేజీల బిర్యానీ తింటే టమాటో ఫ్రీ.. కానీ ఓ కండిషన్

  రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన రామిరెడ్డి కుటుంబం చోరీ జరిగిన విషయాన్ని గమనించి అవాక్కయ్యారు.  ఈ ఘటనపై రామిరెడ్డి కుమారుడు రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 82 తులాల బంగారంతో పాటు 34 తులాల వెండి చోరీకి గురైనట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి నుంచి పోలీసు విచారణ  చేపట్టారు పోలీసలులు.

  ఇదీ చదవండి : సామాన్యుడి ఆహ్వానంపై స్పందించిన సీఎం.. ఆటోలో ఇంటికి వెళ్లి భోజనం.. వైరల్ గా మారిన వీడియో

  సోమవారం ఉదయం లొద్దపుట్టి ధనరాజ తులసమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో పోలీసులు తనిఖీ చేస్తుండగా... కారులో తిరుపతి స్వామి (ప్రకాశం), తిరుపతిరావు (నెల్లూరు), జి.వెంకటరమణయ్య (నెల్లూరు), బి.శ్రీనివాసరావు (విజయనగరం) అనే నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించారు. క్షుణ్ణంగా తనిఖీ చేయగా... కారులో 39 తులాల బంగారంతో పాటు 354 తులాల వెండి ఆభరణాలు కనిపించాయి. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా రామిరెడ్డి ఇంట్లో తామే దొంగతనం చేసినట్టు వారు ఒప్పుకున్నారు.

  ఇదీ చదవండి : షాకింగ్ కార్ యాక్సిడెంట్.. ఇప్పటి వరకు ఇలాంటిది చూసి ఉండరేమో.. ఆరు వాహనాలపై ఎఫెక్ట్..

  ఇచ్ఛాపురం పట్టణంలో ఇటుకల ఫ్యాక్టరీ నిర్వహించేవారమని, వ్యాపారంలో నష్టం రావడంతో అప్పుల పాలయ్యామని.. దీంతో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నామని ఒప్పు కున్నారు. వ్యాపారి రామిరెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చోరీకి పాల్పడాలని నిర్ణయించుకుని.. పక్కా స్కెచ్ తో చోరీకి పాల్పడ్డట్టు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ శివరామిరెడ్డి తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించింది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Vizianagaram

  తదుపరి వార్తలు