Home /News /crime /

ANDHRA PRADESH CRIME NEWS FATHER REPED HIS DAUGHTER IN GUNTUR DISTRICT NGS GNT

Andhra Pradesh: ఛీ ఛీ వీడిని తండ్రి అంటారా..? ఐదేళ్ల కన్నకూతురిపైనే దారుణం.. ఇలాంటి వాడిని ఏం అనాలి..?

ప్రతీకాత్మక చిత్రం (Image credit:istock)

ప్రతీకాత్మక చిత్రం (Image credit:istock)

Bad Father: కన్నకూతరిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి.. కీచకుడి అవతారమెత్తాడు. నొప్పి నాన్నా అని ఏడ్చినా వినకుండా పశువులా ప్రవర్తించాడు. తన లైంగిక వాంఛలు తీర్చుకోవడం కోసం చిన్నారిని చిత్ర హింసలకు గురి చేశాడు..

  Father raped Daughter: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన..! మానవత్వానికి మచ్చతెచ్చే దారుణం..! ఏ తండ్రీ చేయకూడని ఘోరాన్ని ఆ కిరాతకుడు చేశాడు.. అసలు తండ్రి అన్న బంధానికే అర్థం లేకుండా చేశాడు. అసలు తండ్రి అంటే ఏంటి.. బిడ్డలకు కొండంత భరోసా.. నాన్న ఉన్నాడు.. తమకేం కాదని ఒక నమ్మకం.. ముఖ్యంగా ఆడ పిల్లలకు అయితే తండ్రే సర్వస్వం. కన్న కూతురిని గుండెలపై పెట్టుకుని చూసుకోవాలి.. ఐదేళ్ల చిన్నారి అంటే.. అన్నీ నాన్నే అనుకుంటుంది. ఆడుకోవడానికి.. అక్కున చేర్చుకోడానికి నాన్నే కావాలి అనుకుంటుంది.. కానీ ఆ కామాంధుడికి మాత్రం కన్న కూతురిపైన కామ వాంఛలు ఎలా కలిగాయో అర్థం కావడం లేదు. అది ఐదేళ్ల చిన్నారిపై.. అసలు నాన్న ఆడుతున్నాడో.. ఇంకేదో చేస్తున్నాడో కూడా తెలియని పసి వయసు.. అలాంటి చిన్నారిపై కామవాంఛలు తీర్చుకుంటూ వచ్చాడు ఆ కసాయి తండ్రి.. ఇలాంటి వాళ్లను తండ్రి అనడం కూడా పాపమేమో.. కన్న కూతురికి చిన్న గాయం అయినా.. తండ్రి మనసు తల్లఢిల్లుతుంది. అమ్మా అని అంటే చాలు నా కూతురికి ఏమైంది అంటూ తండ్రి మనసు విలవిలాడాలి.. అలాంటి తండ్రి కన్న కూతురిపై నొప్పి అని అరుస్తున్నాఇంత అరాచకానికి ఎలా ఒడిగట్టాడో అర్థం కావడం లేదు..

  విజయవాడ (Vijayawada) నగరంలో ఈ దారుణం జరిగింది. కన్నకుతురుపైనే అత్యాచారం చేసిన కసాయి తండ్రి పేరు చినాబాబు.. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ కామాంధుడు పలుమార్లు చిన్నారిపై లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. అయితే చిన్నారికి ఈ మధ్య నొప్పి పెరగడం.. తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిరక్ష్యారాస్యుడైనా కన్న కూతురుని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. మంచి ఉద్యోగంలో ఉన్న చినబాబు ఇలాంటి దారుణానికి పాల్పడడం దారుణం.

  చినబాబుది ప్రేమ వివాహం కూడా.. తమ ప్రేమకు కానుకగా పుట్టిను కూతురిని ఎంత ఆప్యాయంగా చూసుకోవాలి.. కానీ ఇలాంటి పాడు పని ఎలా చేయడగలిగాడు.స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కాలేజీ, వికాస్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పిడి గా పనిచేస్తున్న చినబాబు దారుణం వెలుగులోకి రావడంతో.. భర్యపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిశ పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఈ అత్యాచార కేసును వెనక్కు తీసుకోవాలి అంటూ తల్లికి బెందరింపులు వస్తున్నట్టు తెలుస్తోంది.

  ఇదీ చదవండి: సీఎం కార్యాలయం నుండి అంటూ ఫోన్..! అంగన్వాడీ కార్యకర్తలను వదలని సైబర్ నేరగాళ్లు

  ఇటీవల తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని ఓ గ్రామంలోని వ్యక్తి అభంశుభం తెలియని బాలికలపై అకృత్యానికి ఒడిగట్టాడు. వారిలో ఒకరు కన్నకూతురుకాగా.. మరొకరు వరుసకు కూతురు అవుతుంది. గత నెల 21వ తేదీన ఆరేళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ మృగాడు... ఆగస్టు 15న 14 ఏళ్ల బాలికపై పశువాంఛ తీర్చుకున్నాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా జరిగిన విషయం చెప్పింది. దీంత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరడం ఆందోళన పెంచుతోంది.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Child rape, Crime news, Guntur

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు