Father and son: ఛీ వీళ్లేం తండ్రీ కొడుకులు.. కోచింగ్ పేరుతో మైనర్ బాలికలతో పాడుపనులు.. చివరికి ఏమైందంటే?

కబడ్డీ పేరుతో మైనర్లపై అత్యాచారం

Minor Girls Molested: రోజు రోజుకూ సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు.. అసలు ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. చిన్నారులకు చదువు, ఆటలు, పాటలు నేర్పించాలి అనుకుని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు.. కానీ ఇలాంటి తండ్రీ, కొడుకులు ఉంటే.. అసలు అమ్మాయిలను ఇంట్లోకి బయటకు పంపించాలి అంటే భయపడాల్సి వస్తోంది.

 • Share this:
  Minor Girls Molested : ఆడపిల్ల కనిపిస్తే చాలు మంచంలో ఉన్న ముసలోడు కూడా లేచి పాడుచేయాలని చూసే పాడు సమాజంలో మనం బతుకుతునన్నామా అని భయం వేస్తుంటుంది ఒకోసారి కొన్ని సంఘటనలు చూస్తుంటే. సమాజం ఎటు పోతోందో అర్థం అవ్వడం లేదు.. చిన్నారులకు.. యవతులు, మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోతోంది. కామాంధులు నర రూపరాక్షసులుగా మారుతున్నారు. వారి కోరికలు తీర్చుకోవడానికి వయసుతో సంబంధం లేకుండా మృగాలు అవుతున్నారు.  అభంశుభం తెలియని చిన్నారుల నుంచి మైనర్లను కూడా వదలడం లేదు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మానవ మృగాలకు అడ్డుకట్ట పడటం లేదు. దేశ వ్యాప్తంగా అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు నిర్భయ, దిశ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా ఫలితం లేకుండా  నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు  ఆడపిల్లల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

  విశాఖ జిల్లా (Visakhapatnam District)లో 9 ఏళ్ల బాలికలకు కబడ్డీ (Kabaddi)నేర్పిస్తానని, తినుబండారాలు ఆశ చూపి తండ్రీ కొడుకు (Father and son)ఇద్దరూ లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. విశాఖజిల్లా, అచ్యుతాపురం మండలం పూడి మడక పంచాయతీ శివారు కడపాలెం గ్రామానికి చెందిన మేరుగు బాపయ్య, నూకరాజు తండ్రి కొడుకులు. గ్రామానికి చెందిన నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలికకు(Minor Girl) కబడ్డీ నేర్పిస్తానని నూకరాజు వారిని సమీపంలోని సరుగుడు తోటలోకి తీసుకువెళ్లి వారిపై లైంగికదాడి చేసేవాడు. ఈక్రమంలో తండ్రి బాపయ్య కూడా వారికి తినుబండారాలు, డబ్బలు ఆశ చూపి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు.

  దీంతో భయపడిన బాలికలు వారి తల్లితండ్రులకు విషయం చెప్పారు. దీంతో వారు సోమవారం అచ్యుతాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనకాపల్లి దిశ పోలీసు స్టేషన్‌ డీఎస్పీ మహేశ్వరరావు మంగళవారం కడపాలెం వచ్చి విచారణ చేపట్టారు.

  బాధితురాళ్లను వైద్య పరీక్షల నిమిత్తం అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. నిందితులు బాపయ్య, నూకరాజు పరారీలో ఉన్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు

  ఆంద్రప్రదేశ్ (Andhra  Pradesh) లో లైంగిక వేధింపులు, అ అత్యాచారం ఘటనలకు అడ్డుకట్ట పడడం లేదు. రాష్ట్రంలో దిశ (Disha) లాంటి చట్టాలు అమలులో ఉన్న కీచకుపర్వం మాత్రం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా చిన్నారులను కూడా వదలడం లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయి చిన్నారులను వేధిస్తున్నారు. అయితే ఇక్కడ తండ్రీ, కొడుకు ఇద్దరూ ఇలా అరాచకాలకు పాల్పడుతుండడం దారుణం. ఎట్టకేలకు వీరి పాపాలు పండి.. విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి కామంధులను వదలకూడదని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: