Harassment: కన్నీరు పెట్టిస్తున్న నవ వధువు సూసైడ్ నోట్.. ఎవ్వరినీ వదలొద్దు సార్ అంటూ లేఖ

కన్నీరు పెట్టిస్తున్న నవవధువు లేఖ

Married women Suicide: మెడలో మూడు ముళ్లు పడకముందే.. ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది.

  • Share this:
    Dowry Harassment: దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ.. మహిళలపై ఏదో ఒకరకమైన వేదింపులు తప్పడం లేదు. ఏడు అడుగులు వేసి.. మూడు ముళ్లు వేసి.. వేద మంత్రాల సాక్షిగా జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణాలు చేసిన భర్తల నుంచి వేధింపులు ఎదురైతే వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలి.. పెళ్లైనంత వరకే మహిళ బాధ్యత తల్లిదండ్రులది.. తరువాత అమ్మ, నాన్న అన్నీ తానై చూసుకోవాలసిన బాధ్యత భర్తదే.. కానీ కొందరు భర్తలు మాత్రం కట్టుకున్న నాటి నుంచే భార్యలకు నరకయాతన అనుభవించేలా చేస్తున్నారు. కట్నం తీసుకోవడం నేరమని చెబుతున్నా.. కఠిన శిక్షలు వేస్తున్నా..వరకట్న వేధింపుల సంఘటనలు ఆగడం లేదు. తాజాగా వరకట్న దాహానికి ఓ నవ వధువు బలైంది. పెళ్లి చేసుకున్న మొదటి రోజు నుంచే అదనపు కట్నం కోసం భర్త, అత్త, మామలు పెట్టే వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. కడప  (kadapa)నగరం నెహ్రూనగర్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.

    కడపకు చెందిన 26 ఏళ్ల ఝాన్సీకి, రాజంపేట బోయిన పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధాకృష్ణతో గత నెల 15న వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నకానుకల కింద 15 లక్షల రూపాయలు ఇచ్చారు.  పెళ్లైన 2వ రోజు నుంచే అధిక కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి.  70 లక్షలు ఇస్తేనే సంసారానికి రావాలంటూ ఈ నెల 2న అత్తా, మామలు ఝాన్సీని పుట్టింట్లో వదిలేశారు.

    పెద్దమనుషులు రాధాకృష్ణ ఇంటికి వెళ్లి పంచాయితీ చేశారు. తనకు 70 లక్షలు ఇస్తేనే తన భార్యను సంసారానికి తీసుకెళతానని అతడు తేల్చి చెప్పాడు. కాగా, దీన్ని తన కుటుంబ సభ్యులకు అవమానంగా భావించిన ఝాన్సీ తీవ్ర నిర్ణయం తీసుకుంది. సూసైడ్‌ నోట్‌ రాసింది. ఇంట్లో ఎవరూ గమనించని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తల్లి, తమ్ముడు గమనించే సరికి ఫ్యాన్‌కు వేలాడుతోంది. వెంటనే రిమ్స్‌కు తరలించారు. కానీ అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.

    ఝాన్సీ రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సూసైడ్ నోట్ కంటతడి పెట్టిస్తోంది. ”డియర్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌..ఎవ్వరినీ వదిలిపెట్టొ్టద్దు.. వాళ్లు ఎంతటికైనా తెగిస్తారు.. వాళ్లు చాలా క్రిమినల్‌ మైండెండ్.. మా తల్లిని, కుటుంబాన్ని రక్షించండి.. పవన్‌ ( తమ్ముడు) నువ్వు ఏడవద్దు.. మా తల్లికి, తమ్ముడికి భవిష్యత్తులో ఆపద వస్తే అది రాధాకృష్ణ వల్లనే…” అని సూసైడ్‌ నోట్‌లో రాసుంది. వరకట్న చావు కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    Published by:Nagesh Paina
    First published: