Andhra Prdesh: జగనన్న సంక్షేమ పథకాలపై సైబర్ నేరగాళ్ల కన్ను.. చేయూత లబ్ధి దారుడికి శఠగోపం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో సైబర్ నేగరాళ్లు రూటు మార్చారు. ప్రభుత్వ పథకాలే ఆసరాగా చేసుకున్న వారిని కూడా వదలడం లేదు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాల లబ్ధి దారులను టార్గెట్ గా చేశారు. అందుకు ఓ వాలంటీర్ నే వలగా వాడుకుని చూయూత లబ్ధి దారుడ్ని మోసం చేసిన ఘటన కలకలం రేపింది.

 • Share this:
  మోసం చేయడానికి కాదేది అనర్హం అంటూ రెచ్చిపోతున్నారు సైబర్ నేరగాళ్లు.. ఆకలకు పేదలను కూడా వదలడం లేదు. ఏ ఆసరా లేక ప్రభుత్వ పథకాల మీదే జీవనం సాగించే వారిని విడిచిపెట్టడం లేదు. ప్రస్తుతం ఏపీలో భారీగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అయితే ప్రస్తుత పథకాలన్ని ఆన్ లైన్ ద్వారానే లబ్ధి దారులకు చేరువ అవుతున్నాయి. ఆధార్ కార్డ్ అనుసంధానం చేయనదీ పథకం అందదనే ప్రభుత్వ స్పష్టం గా చెబుతోంది. అయితే ఇలా ప్రభుత్వ పథకాలు అందుకునే వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల వారే.. అందులోనూ నిరక్ష్య రాసులు భారీగానే ఉన్నారు. దీంతో వారి అమాయకత్వాన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకునేందుకు ఫోకస్ చేశారు. ఏపీలో ఇటీవల సైబర్ నేరగాళ్ల టెన్షన్ పెరిగిపోతోంది. దొరికిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొని నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం బీసీ మహిళల కోసం ఇస్తున్న చేయూత పధకం నగదు పడిందో లేదో కనుక్కునే నెపంతో.. వాటిని జమ చేస్తామని చెప్పి ఓ లబ్ధిదారుడి ఖాతా నుంచి 46 వేల రూపాయలు స్వాహా చేసిన ఘటన కలకలం రేపుతోంది.. అయితే ఈ సైబర్ నేరానికి అతడు నేరుగా వాలంటీర్ సేవలు వాడుకోవడం చర్చనీయాంశమైంది..

  విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణంలో ఓ సైబర్ మోసం వెలుగు చూసింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి పార్వతీపురం పట్టణంలోని స్థానిక 14వ వార్డు సచివాలయానికి చెందిన వంశీ అనే వాలంటీర్​ కు ఫోన్ చేశాడు.. జిల్లా కలెక్టరేట్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. మీ పరిధిలో అందరికీ చేయూత డబ్బులు వచ్చాయా? అంటూ ప్రశ్నించాడు. ఇద్దరికి రాలేదని వాలంటీర్ సమాధానం చెప్పడంతో.. దీంతో వాళ్లిద్దరికీ ఫోన్ చేయమని ఆగంతకుడు నమ్మబలికాడు.

  ఇలా కేటుగాడి మాటలు నమ్మిన వాలంటీర్.. ఓ లబ్ధిదారుడుకి ఫోన్​ చేసి ఆగంతుకునితో కాన్ఫరెన్స్​లో మాట్లాడించాడు. నేను లబ్ధిదారులతో మాట్లాడతా.. మీరు ఫోన్​ కట్​ చేయమని చెప్పడంతో వాలంటీర్ ఆ కాల్ నుంచి డిస్ కనెక్ట్ అయ్యాడు..

  ఇదీ చదవండి: ఒంటరి మహిళపై 15 మంది మానవ మృగాలు ఆత్యాచారయత్నం.. ఆపై బీరు సీసాలతో దాడి

  వాలింటీర్ లేకపోవడంతో సైబర్ నేరగాడు అసలు డ్రామా మొదలు పెట్టాడు. సదరు లబ్ధిదారుడికి మాయమాటలు చెప్పాడు. మీ ఖాతాలో నగదు పడుతుంది.. మీ ఫోన్​కు వచ్చే ఓటీపీ చెప్పండి అని నమ్మబలికాడు. అయితే వాలంటీర్ స్వయంగా అంతకముందు పరిచయం చేసి మాట్లాడడంతో అతడి నిజంగా ప్రభుత్వ అధికారి అని భావించి పోసపోయారు. ఆ కేటుగాడి మాటలకు మోసపోయిన ఓటీపీ చెప్పారు. అలా రెండుసార్లు ఓటీపీ చెప్పగా 10 వేల రూపాయల చొప్పున మొత్తం 20 వేలు నగదు డ్రా చేశాడు. ఇది గుర్తించిన సదరు వ్యక్తి.. ఇదేంటని అగంతకుడిని ప్రశ్నించగా.. ముందు అలాగే జరుగుతుంది. తర్వాత మొత్తం నగదు జమ అవుతుందని నమ్మించాడు. ఇలా మరో రెండుసార్లు ఓటీపీ చెప్పాడు. ఇంకేముంది.. మొత్తంగా 46 వేల రూపాయలు కాజేశాడు. తరువాత మోసపోయానని గుర్తించిన బాధితుడు. లబోదిబో మంటూ పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై కళాధర్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్​ చేసి బ్యాంకు వివరాలు అడిగితే చెప్పొద్దని ఎస్సై సూచించారు.
  Published by:Nagesh Paina
  First published: