Home /News /crime /

ANDHRA PRADESH CRIME NEWS CYBER CHEATER CHEATED 50 LAKH RS NGS BK

Cyber Crime: ఒక్క రూపాయి పంపించి.. 50 ల‌క్ష‌లు కొట్టేశాడు.. ఎలా మోసం చేశాడంటే..?

ఒక్క రూపాయి పంపి.. 50 లక్షలు కొట్టేశాడు..

ఒక్క రూపాయి పంపి.. 50 లక్షలు కొట్టేశాడు..

Cyber Cheating: సైబర్ నేరాలు రోజు రోజుకూ విస్తరిస్తున్నాయి. కేటుగాళ్లు కొత్త కొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వ్యాపారులను టార్గెట్ చేస్తూ.. లక్షలు దండుకుంటున్నారు.. తాజాగా జరిగిన మోసం తెలిసి అంతా షాక్ కు గురవుతున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Kadapa (Cuddapah), India
  M BalaKrishna, Hyderabad, News18

  Cyber Crime:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో  నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలు వెతికి నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా..  ప్రజలకు పదే పదే అవగాహన కల్పిస్తున్నా.. సైబర్ కేటుగాళ్ల మోసాలు ఆగడం లేదు.. అది కూడా నిరక్ష్యరాసులను కాదు.. బాగా చదుకున్న వారిని.. ప్రముఖులను, వ్యాపారవేత్తలను (Businessmen) సైతం మోసం చేస్తున్నారు. తాజాగా జరిగిన మోసం గురించి తెలిసిన వాళ్లంతా షాక్ అవుతున్నారు. ఇంత ఈజీగా మోసం చేయొచ్చా అని షాక్ అవుతున్నారు. మ‌హేశ్ శ‌ర్మ‌ (Mahesh Sharma) అనే వ్యక్తి క‌డ‌ప‌ (Kadapa) లో సిమెంట్ వ్యాపారి.. ఓ రోజు అతడికి ఒక ఫోన్ కాల్ వ‌చ్చింది. అర్జెంట్ గా త‌న‌కు 100 సిమెంట్ క‌ట్ట‌లు పంపించాల‌ని మెటీరియ‌ల్ డెలివ‌రీ అయిన వెంట‌నే అక్క‌డ డ‌బ్బులు కూడా ఇచ్చేస్తామ‌ని చెప్పాడు ఆ వ్య‌క్తి.

  మ‌హేశ్ శ‌ర్మ చాలా ఆనందంతో పొద్దుపోద్దున్నే చాలా మంచి గిరాకి వ‌చ్చింద‌ని 100 సిమెంట్ క‌ట్ట‌లు లోడ్ చేయించి. స‌ద‌రు వ్య‌క్తి చెప్పిన అడ్ర‌స్ కు పంపించాడు. స‌ర‌కు డెలివ‌రీ కూడా అయ్యింది. వెంట‌నే మ‌ళ్లీ ఆ వ్య‌క్తి మ‌హేశ్ శ‌ర్మ‌కు ఫోన్​ చేసి మీరు పంపించిన స‌రుకు చేరుకుంది. డ‌బ్బులు ఎంతో చెప్పండి పంపిస్తామ‌ని నమ్మకంగా చెప్పాడు. 

  అప్పటికే సంతోషంలో ఉన్న మ‌హేశ్ శ‌ర్మ 100 సిమెంట్ క‌ట్ట‌ల‌కు ఎంతైందో చెప్పాడు. మీరు అలాగే లైన్ లో ఉండ‌ండి మీ అకౌంట్ కు డ‌బ్బు పంపిస్తానని మొద‌ట ఒక రూపాయి మీ అకౌంట్ కు పంపించాను ఒక సారి క‌న్ఫామ్ చేయండి అని అన్నాడు అవ‌తలి వ్య‌క్తి. డీల్ అంతా స‌జావుగా సాగుతుంది క‌దాని కొంచెం కూడా అనుమానించ‌డ‌కుండ మ‌హేశ్ శ‌ర్మ త‌మ ఫోన్ లో స‌ద‌రు వ్య‌క్తి పంపించిన లింక్ తో ఉన్న ఒక రూపాయి డ‌బ్బును క‌న్​ఫాం చేశాడు.

  ఇదీ చదవండి : గుంతలో పడి వ్యక్తి మృతి.. ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే?

  కానీ అంతలోనే ఊహించని షాక్ తగిలింది. అక్క‌డ నుంచి త‌న బిజినెస్​ అకౌంట్ లో ఉన్న 50 ల‌క్ష‌లు.. మాయమయ్యాయి. వెంట‌నే తేరుకుని తాను మోస‌పోయాని పోలీసుల‌ను ఆశ్ర‌యించాడు మ‌హేశ్ శ‌ర్మ‌. ఇది ఒక మ‌హేశ్ శ‌ర్మ‌కు జ‌రిగిన మోస‌మే కాదు. ప్ర‌స్తుతం ఏపీలో చాలా మంది వ్యాపారస్తులు ఇదే విధంగా మోస‌పోతున్నారు.

  ఇదీ చదవండి : అన్న ప్రేమకు నిదర్శనం ఇది.. విధి మనుషులనే విడదీస్తుంది.. బంధాన్ని కాదు

  సైబ‌ర్ నేర‌గాళ్లు ఇప్పటి వ‌ర‌కు ఉన్న ప‌ద్ద‌తులు కాకుండా ఇప్పుడు వ్యాపార‌స్తుల‌ను టార్గెట్ చేస్తూ అకౌంట్లో ఉన్న డ‌బ్బును మాయం చేస్తున్నారు.  ముందుగానే వ్యాపారస్తుల బిజినెస్ ఎంతో తెలుసుకుని పెద్ద మొత్తం లో స‌ర‌కు కావాలి వారికి న‌మ్మించి స‌రుకు చేరుకున్న త‌రువాత దానికి ఫేమెంట్ చేయాల‌ని ఒక్క రూపాయి పంపించి వ్యాపారస్తుల అకౌంట్ నుంచి అందిన‌కాడ‌కి దోచేస్తున్నారు కేటుగాళ్లు.

  ఇదీ చదవండి : ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. అధికారం ఏ పార్టీది? ఎవరికి ఎన్నిఅసెంబ్లీ సీట్లు

  ప్ర‌స్తుతం ఇలాంటి కేసులు ఏపీ వ్యాప్తంగా ఎక్కువైపోతున్నాయి. గ‌డిచిన నెల రోజుల్లోనే దాదాపు 142 ఇదే త‌ర‌హా కేసులు న‌మోదైయ్యాయి.  ఒక‌ప్పుడు సైబ‌ర్ నేరాళ్లు ఎక్కువ మెట్రో సిటీల్లో ఉండేవి ఇప్పుడు ఇంట‌ర్నెట్ వినియోగం ఎక్కువ కావడంతోపాటు చాలా మంది వ్యాపారస్తులు త‌మ వ‌స్తువుల‌ను ఆన్ లైన్ లో అమ్మ‌కాలు జ‌ర‌ప‌డం కూడా ఈ మోసాలు పెగ‌డానికి కార‌ణం అంటున్నారు పోలీసులు.

  ఇదీ చదవండి : సీఎం జగన్ కు రాఖీలు కట్టిన మహిళా నేతలు.. కనిపించని మంత్రి రోజా.. పుష్ప శ్రీవాణి!

  ముఖ్యంగా సామాన్యుల‌ను టార్గెట్ చేస్తే ప్ర‌జ‌ల్లో ఉన్న అవ‌గాహాన మూలంగా చాలా వ‌ర‌కు మోసాలు చేయ‌డానికి వీలు కాక‌పోవ‌డంతో ఇప్పుడు ఈ సైబ‌ర్ నేర‌గాళ్లు త‌మ రూటు మార్చి వ్యాపార‌స్తుల‌ను మోసం చేస్తోన్నారు. ఏపీ వ్యాప్తంగా గ‌త నెల రోజుల్లో ఇలాంటి కేసులు 142 న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. ఇంకా 200 కేసులు వ‌ర‌కు పోలీస్ వ‌ద్ద‌కు రానివి ఉంటాయ‌ని అంచ‌న వేస్తోన్నారు పోలీసులు. ప‌రువు పోతుంద‌ని త‌మ‌కు జ‌రిగిన మోసాన్ని బ‌య‌టికి చెప్పుకోవ‌డానికి కూడా చాలా మంది వెనుక‌డు వేస్తోన్నార‌ని అంటున్నారు పోలీసులు. 
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Kadapa

  తదుపరి వార్తలు