ANDHRA PRADESH CRIME NEWS CHURCH FATHER DAILY RAPED A GIRL WHO COMES TO PRACTICES DANCE NGS GNT
Father: మతగురువు ముసుగులో యువతిపై లైంగిక దాడి.. విషయం బయటకు రాకుండా బెదిరింపు
మత గురువు ముసుగులో అత్యాచారం
Church Father: మతగురువు ముసుగులో ఏడాదిగా యువతిపై లైంగిక దాడి చేస్తున్నా ఓ చర్చి ఫాదర్ బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాదిగా పిల్లలకు నృత్యం నేర్పించడానికి వస్తున్న ఓ యువతిపై కామవాంఛ తిర్చుకున్నారు.
Andhra Pradesh: రోజు రోజుకూ సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు.. అసలు ఎవరిని నమ్మాలో తెలియడం లేదు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మహిళలకు, యువతులకు రక్షణ కరువు అవుతోంది. స్కూల్ కు వెళ్లాలన్నా.. కోచింగ్ కు వెళ్లాలన్నా.. షాపింగ్ వెళ్లాలి అన్నా.. ఆఖరికి పవిత్ర స్థలాలకు వెళ్లినా రక్షణ ఉండడం లేదు. ఉన్నతమైన స్థానంలో ఉండాల్సిన వాళ్లు కూడా పాడు బుద్ది చూపిస్తున్నారు. ఆడపిల్ల కనిపిస్తే చాలు మంచంలో ఉన్న ముసలోడు కూడా లేచి పాడుచేయాలని చూసే పాడు సమాజంలో మనం బతుకుతునన్నామా అని భయం వేస్తుంటుంది ఒకోసారి కొన్ని సంఘటనలు చూస్తుంటే. సమాజం ఎటు పోతోందో అర్థం అవ్వడం లేదు. మంచి బుద్ధలు నేర్పి.. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పెద్దలు కూడా కామాంధులై యువతులను కాటేస్తున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా (Guntur District)లో అయితే అగాయిత్యాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. వారంలో రెండు మూడు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారాలు, లైంగిక దాడులు పెరుగుతున్నాయి. తాజా మతగురువు (ఫాదర్) ముసుగులో ఏడాదిగా యువతిపై లైంగిక దాడికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.
గత ఏడాది పిల్లలకు నృత్యం నేర్పించడానికి వచ్చిన ఓ యువతిపై కామవాంఛ తిర్చుకుంటున్న చర్చి ఫాదర్ బాల స్వామి. విషయం బయటకు వచ్చింది. అమాయక ఆడపిల్లలే టార్గెట్గా చేసుకుని లైంగిక వాంఛలు తీర్చుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు మహిళలు ఆరోపిస్తున్నారు.
పేద కూరపాడు కు చెందిన చర్చి మత గురువు (చిన్న ఫాదర్) బాలస్వామి గత ఏడాది డిసెంబర్ నెల లో క్రిస్టమస్ పండుగకు సంబందించిన ఉత్సవాలలో నృత్య రూపకాన్ని పిల్లలతో ప్రదర్శించ టానికి పిల్లలకు నృత్యం నేర్పేందుకు గుంటూరు లో ఒక సంస్థ లో పని చేస్తూ సెలవుపై పెదకూరపాడు వచ్చిన యువతిని పిల్లలకు నృత్యం నేర్పేందుకు రమ్మని పిలిచాడు.
పిల్లలకు నృత్యం నేర్పేందుకు వెళ్లిన యువతిపై మత గురువు (చిన్న ఫాదర్) అత్యాచారా నికి పాల్పడ్డాడు. తల్లి తండ్రులకు చెప్పకుండా ఉంటె తనకు ఏ బాధలు లేకుండా చూసుకుంటానని చెబుతూ ఏడాది కాలం గా యువతీ పై అత్యాచారం చేస్తున్నాడు.
ఒకవేళ ఎవరికైనా చెబితే ఇబ్బందులు తప్పని హెచ్చరించాడు. అయితే తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తనను పెళ్లి చేసుకోవాలని యువతీ కోరగా నిరాకరించి మొహం చాటేశాడు. ఆయన్ను కలిసి తన బాధ చెప్పుకడానికి ప్రయత్నిచగా తప్పించుకు తిరుగుతున్నాడని.. పెళ్లి చేసుకోవటం కుదరదని చెప్పటం తో బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. పిర్యాదు స్వీకరించిన పోలీస్ లు నిండుతుంది పై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార కేసులు నమోదు చేశారు. తరువాత బాధితురాలిని పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.