Andhra Pradesh: ప్రస్తుతం సమాజంలో సహజీవనం (Living Relationship) ట్రేండింగ్ వుతోంది. అందుకు పెళ్లైన వారు కూడా తమ సంసారాలను పాడుచేసుకుంటున్నారు. ఎక్కడ చూసిన సహజీవనం పేరుతో జీవితాలు నాశనం చేసుకుంటున్న పరిస్థితి. పెళ్లి కానీ జంటలు సహజీవనం చేస్తుండటం... చూసి పెళ్ళైన జంటలు కూడా విడిపోయి మూడుముడుల బంధాన్ని కాదని వేరొకరితో సహజీవనం చేస్తున్న కల్చర్ మహా నగరాల (Metro cities) నుంచి పల్లెలకు సైతం పాకేస్తూ ఉంది. భర్తతో నెలకొన్న విభేదాలతో భార్య విడిపోయి వేరొకరితో జీవించడం.. భార్యను కాదని ప్రియురాలితో కలసి జీవించడం ప్రస్తుత సమాజంలో రోజు రోజుకూ పెరుగుతున్నాయి. సహజీవనంచేస్తున్న వ్యక్తుల మధ్య మనస్పర్థలు రానంతవరకు అంత బాగానే సాగుతుంది. ఒక్కసారి మనస్పర్థలు వస్తే అంతే.. జీవితాలు సర్వ నాశనం అవుతున్నాయి.
సహజీవనం చేస్తున్నవారి మధ్య విభేదాలకు ప్రధాన కారణం అనుమానామే. తాజాగా చిత్తూరు జిల్లా (Chitoor District)లో కొడవలితో దాడి చేయడంతో నాలుగు రోజులు చికిత్స పొందుతూ ప్రియురాలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.
స్థానికులు పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం., పెద్దకొండమర్రి గ్రామానికి చెందిన మల్లీశ్వరి.... నిమ్మనపల్లె మండలం తావళానికి చెందిన ఓ వ్యక్తికీ 17 ఏళ్ళ క్రితం పెద్ద సమక్షంలో ఒక్కటైయ్యారు. వీరి దాపత్య జీవితానికి నిదర్శనంగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. పద్నాలుగు ఏళ్ళ పాటు వీరి దాంపత్య జీవితం సజావుగా సాగినా.. చిన్న చిన్న మనస్పర్థలు భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్నాయి. దింతో ఇద్దరు తరచు గొడవపడేవారు.
ఇదీ చదవండి: భార్య భర్తల మధ్య గొడవలో దూరడు.. ప్రాణాలే పోయాయి.. ఏం జరిగిందంటే..?
భార్యాభర్తల మధ్య గొడవలు (Wife and husband fight) ముదరడంతో మల్లీశ్వరిపై చెయ్యిచేసుకున్నాడు ఆమె భర్త. దింతో భర్తను విడిచి అమ్మగారి ఇంటికి వెళ్లిపోయింది మల్లీశ్వరి. కొన్నాళ్ళకు గ్రామా సమీపంలో ఉన్న మామిడి తోటలో కాపలా దారుడుగా ఉన్న పెద్ద పంజాణి మండలం దొరస్వామితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మరి సహజీవనం చేసే స్థాయికి వెళ్ళింది. ఇద్దరు చిలకాగోరింకల్లా సహజీవనం చేస్తూ వచ్చారు.
ఇదీ చదవండి: తమిళనాడులో మెగా బ్రదర్స్ క్రేజ్.. అసెంబ్లీలో పవన్ ప్రస్తావన
కొంతకాలం వరకు బాగానే ఉన్న వారి బంధాన్ని అనుమానం అనే భూతం కమ్మేసింది. మల్లీశ్వరి ఎవరితోనో చనువుగా ఉంటోంది అంటూ తరచు గొడవకు దిగేవాడు. రోజు ఇలా గొడవపడుతున్న సందర్భంలో కోపోద్రిక్తుడైన దొరస్వామి.... చేతిలో ఉన్న కొడవలితో మల్లీశ్వరిపై దాడి చేసాడు. అక్కడ నుంచి పరారయ్యాడు దొరస్వామి. దింతో రక్తపు మడుగులో ఉన్న మల్లీశ్వరిని హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడిన మళ్లీశ్వరి తనువు చాలించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు. హత్యాయత్నం క్రింద కేసు నమోదు చేసారు. మల్లీశ్వరి చనిపోవడంతో హత్యకేసుగా మార్చారు. నిందితుడిని త్వరలో పట్టుకొని రిమాండ్ కు తరలిస్తామంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chitoor, Crime news, Murder